Satya Nadella: భారత్‌లో మైక్రోసాప్ట్ 17.5 బిలియన్ డాలర్ల పెట్టుబడి -ప్రధాని మోదీతో భేటీ తర్వాత సత్యనాదెళ్ల ప్రకటన
Satya Nadella meets PM Modi: మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల ప్రధాని మోదీతో సమావేశం అయ్యారు. భారత్ AI ఫస్ట్ ఫ్యూచర్ కోసం 17.5 బిలియన్ డాలర్ల భారీ పెట్టుబడి పెట్టనున్నట్లుగా ప్రకటించారు.

Satya Nadella commits 17 billion to India AI first future : మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో నాదెళ్ల భారతదేశంలో ఏఐ ఫస్ట్ ఫ్యూచర్ కోసం మైక్రోసాఫ్ట్‌కు చెందిన 17.5 బిలియన్ అమెరికన్ డాలర్లు అంటే సుమారు సుమారు 1.46 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడిని ప్రకటించారు. ఇది మైక్రోసాఫ్ట్ ఆసియాలో అతిపెద్ద పెట్టుబడిగా నిలిచింది. ఈ పెట్టుబడి భారత్ AI అవకాశాలను ప్రోత్సహించడానికి, మౌలిక సదుపాయాలు, నైపుణ్యాలు, సామర్థ్యాలను బలోపేతం చేయడానికి ఉపయోగపడుతుందని నాదెళ్ల తెలిపారు.
ప్రధాన మంత్రి మోదీతో నాదెళ్లల మధ్య జరిగిన సమావేశాన్ని ‘భారత్ AI అవకాశాలకు ఉపయోగపడే చర్చ’గా నాదెళ్ల వర్ణించారు. ఈ సమావేశం భారత్ AI రంగంలో ముందస్తుగా ఉండాలనే లక్ష్యాన్ని సమర్థించడానికి దోహదపడుతుందని అధికారిక వర్గాలు తెలిపాయి. మైక్రోసాఫ్ట్ ఈ పెట్టుబడి ద్వారా భారత్ AI మౌలిక సదుపాయాలను బలోపేతం చేస్తూ, దేశ యువతకు నైపుణ్యాలు అందించడానికి, స్వదేశీ సాంకేతికతలను అభివృద్ధి చేయడానికి ప్రాధాన్యత ఇస్తుందని నాదెళ్ల పేర్కొన్నారు.
మైక్రోసాఫ్ట్ ఈ 17.5 బిలియన్ డాలర్ల పెట్టుబడిని భారత్ AI భవిష్యత్తును రూపొందించడానికి ఉపయోగిస్తుంది. ఇది ఆసియా మొత్తంలో మైక్రోసాఫ్ట్ చేసిన అతిపెద్ద పెట్టుబడిగా నిలిచింది. పెట్టుబడి ద్వారా AI మౌలిక సదుపాయాలు, దేశ యువతకు నైపుణ్యాల అభివృద్ధి, సావరెయిన్ కెపాబిలిటీస్ వంటి రంగాల్లో ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఈ ప్రకటన భారత్-అమెరికా టెక్ సహకారాన్ని మరింత బలోపేతం చేస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
Thank you, PM @narendramodi ji, for an inspiring conversation on India’s AI opportunity. To support the country’s ambitions, Microsoft is committing US$17.5B—our largest investment ever in Asia—to help build the infrastructure, skills, and sovereign capabilities needed for… pic.twitter.com/NdFEpWzoyZ
— Satya Nadella (@satyanadella) December 9, 2025
సత్య నాదెళ్ల 2014లో మైక్రోసాఫ్ట్ సీఈఓగా నియమితులైన తర్వాత, కంపెనీ భారత్‌లో పెట్టుబడులను మరింత పెంచింది. భారత్ AI, క్లౌడ్ కంప్యూటింగ్ రంగాల్లో భారత్‌ను గ్లోబల్ హబ్‌గా మార్చాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారు. ఈ పెట్టుబడి భారత్ డిజిటల్ ఇకానమీని బలోపేతం చేస్తూ, ఉద్యోగాలు, స్టార్టప్‌లకు మద్దతుగా నిలుస్తుందని టెక్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.




















