News
News
X

Live-in Relationships: లివిన్‌ రిలేషన్‌షిప్‌లకూ రిజిస్ట్రేషన్‌ రూల్ పెట్టండి, సుప్రీంకోర్టులో పిటిషన్

Live-in Relationships: లివిన్‌ రిలేషన్‌షిప్స్‌కు కూడా రిజిస్ట్రేషన్ నిబంధన పెట్టాలంటూ సుప్రీంకోర్టులో ఓ లాయర్ పిటిషన్ వేశారు.

FOLLOW US: 
Share:

Live-in Relationships Registration:

పిటిషన్ వేసిన లాయర్..

లివిన్‌ రిలేషన్‌లు ఈ రోజుల్లో చాలా సాధారణమైపోయింది. అయితే కొన్నిసార్లు ఇవే ప్రాణాల మీదకు తెస్తున్నాయి. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన శ్రద్ధ హత్య కేసు ఇందుకు ఉదాహరణ. లివిన్‌లో ఉన్న సమయంలోనే అఫ్తాబ్ ఆమెను కిరాతకంగా హత్య చేశాడు. ఈ కేసుతో మరోసారి సహజీవనంపై చర్చ మొదలైంది. ఈ క్రమంలోనే సుప్రీంకోర్టు లాయర్ మమతా రాణి ఓ పిటిషన్ వేశారు. లివిన్ రిలేషన్‌షిప్‌లకూ రిజిస్ట్రేషన్‌ చేసేలా సుప్రీం కోర్టు కేంద్రానికి ఆదేశాలివ్వాలని అందులో కోరారు. సహజీవనం చేసే వాళ్లకు చట్టబద్ధత ఉండేలా చూడాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. చాలా మంది రహస్యంగా సహజీవనం చేస్తున్నారని, చివరకు అవి దారుణమైన నేరాలకు దారి తీస్తున్నాయని అన్నారు. లివిన్ పార్ట్‌నర్స్‌ భద్రతను దృష్టిలో పెట్టుకుని రిజిస్ట్రేషన్‌ నిబంధన తీసుకు రావాలని కోరారు మమతా రాణి. అంతే కాదు. లివిన్‌లో ఉన్న వాళ్ల వ్యక్తిగత సమాచారాన్నీ సేకరించేలా రూల్స్ పెట్టాలని అన్నారు. ఈ మేరకు సుప్రీం కోర్టు కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలివ్వాలని విజ్ఞప్తి చేశారు. తప్పనిసరిగా వ్యక్తిగత వివరాలు ఇవ్వాలన్న నియమం పెట్టాలని చెప్పారు. ఈ సందర్భంగా శ్రద్ధ, నిక్కీ యాదవ్‌ హత్య కేసుల్ని పిటిషన్‌లో ప్రస్తావించారు. లివిన్‌ రిలేషన్‌షిప్‌లో ఉన్న వాళ్లకు ముప్పు ఉందని తెలిస్తే పలు సందర్భాల్లో సుప్రీం కోర్టు వాళ్లకు భద్రత కల్పించిందని వివరించారు. ప్రాథమిక హక్కుల కోణంలో ఆలోచించి అలాంటి బంధాలకు రిజిస్ట్రేషన్ వ్యవస్థ తీసుకురావాలని అడిగారు. 

కర్ణాటక హైకోర్టు ఏం చెప్పిందంటే..?

నచ్చిన వ్యక్తులతో సహజీవనం చేసి పెళ్లి చేసుకోకపోతే మోసం చేసినట్లు కాదని కర్ణాటక హైకోర్టు తెలిపింది. సదరు వ్యక్తిపై భారతీయ శిక్షాస్మృతి సెక్షన్ 420 కింద కేసు పెట్టలేమని న్యాయమూర్తి జస్టిస్ కె.నటరాజన్ నేతృత్వలోని సింగిల్ జడ్జి బెంచ్ వెల్లడించింది. అయితే ఎనిమిదేళ్లుగా తనను ప్రేమంచి సహజీవనం చేసిన ప్రియుడు తనను పెళ్లి చేసుకోనని చెప్పాడంటూ ఓ మహిళ 2020వ సంవత్సరం మే 5వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేసిది. అయితే సదరు వ్యక్తిపై అతని కుటుంబ సభ్యులపై ఈ ఫిర్యాదును కొట్టివేస్తూ.. కర్ణాటక ధర్మాసనం తీర్పునిచ్చింది. ఇద్దరి మధ్య ఉన్న సహజీవనం ఒప్పందాన్ని అతను మోసపూరిత ఉద్దేశంతో ఉల్లంఘించాడని చెప్పలేమని ఈ సందర్భగా న్యాయమూర్తి అభిప్రాయ పడ్డారు. ఇంట్లో వాళ్లు ఇంకో అమ్మాయితో పెళ్లి కుదర్చిన కారణంగా.. సహజీవనాన్ని వైవాహిక బంధంగా మార్చుకునేందుకు సదరు అబ్బాయి నిరాకరించాడు. అలాగే పరస్పర అంగీకారంతో కూడిన శృంగారానికి, అత్యాచారానికి మధ్య తేడా ఉంది. సహజీవన భాగస్వామి ఇతరత్రా కారణాలతో వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంటే బాధితురాలు అత్యాచారం చేశారని అంటే అది చట్ట ప్రకారం నేరం కిందకు రాదని మాహరాష్ట్ర హైకోర్టు రెండేళ్లు క్రితం తెలిపింది. ఇద్దరూ కలిసే ప్రేమలో పడి.. ఇష్టంగా సహజీవనం చేయండాన్ని అత్యాచారంగా పరిగణించలేమని స్పష్టం చేసింది. 

Also Read: Heatwave Alert: ఎండాకాలం వ్యాధులతో జాగ్రత్త, అప్రమత్తంగా ఉండాలంటూ రాష్ట్రాలకు కేంద్రం లేఖ

Published at : 28 Feb 2023 03:39 PM (IST) Tags: Live-in relationship Registration Supreme Court Live-in Relationships Live-in

సంబంధిత కథనాలు

Medical Seats: కొత్తగా పది మెడికల్‌ పీజీ సీట్లు, కాకతీయ మెడికల్ కాలేజీకి కేటాయింపు!

Medical Seats: కొత్తగా పది మెడికల్‌ పీజీ సీట్లు, కాకతీయ మెడికల్ కాలేజీకి కేటాయింపు!

SSC CHSLE 2022 Key: ఎస్‌ఎస్‌సీ సీహెచ్‌ఎస్‌ఎల్‌ఈ - 2022 ఆన్సర్ 'కీ' విడుదల, అభ్యంతరాలకు అవకాశం!

SSC CHSLE 2022 Key: ఎస్‌ఎస్‌సీ సీహెచ్‌ఎస్‌ఎల్‌ఈ - 2022 ఆన్సర్ 'కీ' విడుదల, అభ్యంతరాలకు అవకాశం!

Stree Nidhi: స్త్రీనిధి నుంచి 3 లక్షల వరకు రుణాలు, వడ్డీ 3 శాతం తగ్గింపు: మంత్రి ఎర్రబెల్లి

Stree Nidhi: స్త్రీనిధి నుంచి 3 లక్షల వరకు రుణాలు, వడ్డీ 3 శాతం తగ్గింపు: మంత్రి ఎర్రబెల్లి

ISRO Jobs: ఇస్రో-నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్‌లో ఖాళీలు, అర్హతలివే!

ISRO Jobs: ఇస్రో-నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్‌లో ఖాళీలు, అర్హతలివే!

నెల గడువిస్తే 24 గంటల్లో రాహుల్ గాంధీపై అనర్హత వేటు అన్యాయమే: కేంద్ర మాజీ మంత్రి

నెల గడువిస్తే 24 గంటల్లో రాహుల్ గాంధీపై అనర్హత వేటు అన్యాయమే: కేంద్ర మాజీ మంత్రి

టాప్ స్టోరీస్

Sukesh Letter BRS : బీఆర్ఎస్ కు రూ.75 కోట్లు ఇచ్చా, కలకలం రేపుతున్న సుఖేష్ చంద్రశేఖర్ లేఖ

Sukesh Letter BRS : బీఆర్ఎస్ కు రూ.75 కోట్లు ఇచ్చా, కలకలం రేపుతున్న సుఖేష్ చంద్రశేఖర్ లేఖ

AP Cabinet : సీదిరి అవుట్, తమ్మినేని ఇన్- మంత్రి వర్గ మార్పులపై ఏపీలో జోరుగా ప్రచారం!

AP Cabinet : సీదిరి అవుట్, తమ్మినేని ఇన్- మంత్రి వర్గ మార్పులపై ఏపీలో జోరుగా ప్రచారం!

IPL 2023 Opening Ceremony: తెలుగు పాటలకు ఊగిపోయిన స్టేడియం - అదిరే స్టెప్పులతో అలరించిన తమన్నా, రష్మిక!

IPL 2023 Opening Ceremony: తెలుగు పాటలకు ఊగిపోయిన స్టేడియం - అదిరే స్టెప్పులతో అలరించిన తమన్నా, రష్మిక!

Nellore Spa: నెల్లూరులో ఆల్ ఇన్ వన్ మసాజ్, స్పెషల్ సర్వీస్ అంటూ వల! 15 మంది అరెస్ట్

Nellore Spa: నెల్లూరులో ఆల్ ఇన్ వన్ మసాజ్, స్పెషల్ సర్వీస్ అంటూ వల! 15 మంది అరెస్ట్