అన్వేషించండి

Kanpur Petrol Pump Scam: ట్యాంక్ 45 లీటర్ల కెపాసిటీ అయితే 52 లీటర్ల పెట్రోల్ కొట్టేశారట - ఆ కార్ ఓనర్‌కు అడ్డంగా దొరికిపోయిన బంకు శీను

52 Litres In 45 Litre Tank: కారులో పెట్రోల్ ట్యాంకర్ సామర్థ్యం 45 లీటర్లు, ట్యాంక్ ఫుల్ చేయమంటే.. 52 లీటర్లు కొట్టేశారు.కింద చుక్క పోలేదు. మరి మిగతా పెట్రోల్ ఎటు పోయినట్లు?

Petrol Pump Fuel Fraud: పెట్రోల్ బంకు దగ్గరకుపోయి..పెట్రోల్ కొట్టించుకోవడం మాత్రమే మనకుతెలుసు. ఎంత కొట్టారో ఎదురుగా ఉన్న రీడింగ్ చూపిస్తుంది. కానీ నిజంగా అంతే ట్యాంకులోకి వచ్చి ఉంటుందన్న గ్యారంటీలేదు. ఒక్కో సారి ఇలా స్కాములు చేసిఅడ్డంగా దొరికిపోతూ ఉంటారు. అలాంటి ఘటనే కాన్పూర్ లో జరిగింది. 

ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఒక పెట్రోల్ బంక్  45 లీటర్ల సామర్థ్యం ఉన్న ఒక కారు ట్యాంకులో ఏకంగా 52 లీటర్ల పెట్రోల్ నింపినట్లు బంక్ మిషన్లు చూపించడంతో సదరు కారు యజమాని అవాక్కయ్యాడు. బంక్ నిర్వాహకులు రీడింగ్‌లో మోసానికి పాల్పడుతున్నారని బాధితుడు అధికారులకు ఫిర్యాదు చేయడంతో ఈ వింత ఉదంతం వెలుగులోకి వచ్చింది.  

  
 ట్యాంకు చిన్నది.. బిల్లు పెద్దది! 

కారు యజమాని బంకుకు వెళ్లేసరికే కారు ట్యాంకులో ఇప్పటికే రెండు నుంచి మూడు లీటర్ల ఇంధనం ఉంది. కారు కంపెనీ నిబంధనల ప్రకారం ట్యాంక్ గరిష్ట సామర్థ్యం 45 లీటర్లు మాత్రమే. అయితే, బంక్ సిబ్బంది పెట్రోల్ పోయడం ప్రారంభించాక మిషన్ రీడింగ్ ఏకంగా 52 లీటర్లు చూపించింది. అంతటితో ఆగకుండా, ఈ ఇంధనాన్ని ఒకే విడతలో కాకుండా.. మొదట 40 లీటర్లు, ఆ తర్వాత మరో 11 లీటర్ల చొప్పున విడతల వారీగా నింపారు. మిషన్‌లో గరిష్ట పరిమితి 45 లీటర్లు ఉన్నప్పటికీ, అదనంగా మరో 7 లీటర్లు ఎలా పట్టిందనేది ఇప్పుడు మిస్టరీగా మారింది.

 క్లీన్ చిట్ ఇచ్చిన అధికారులు  

విషయం కాస్తా వివాదాస్పదమవడంతో జిల్లా సరఫరా శాఖ  అధికారులు రంగంలోకి దిగారు. జిల్లా సరఫరా అధికారి   రాకేష్ కుమార్ బంకుకు వచ్చి మిషన్లను తనిఖీ చేశారు. అయితే, ఆన్-సైట్ తనిఖీల్లో మిషన్లలో ఎలాంటి సాంకేతిక లోపాలు లేవని, అవి పక్కాగా పనిచేస్తున్నాయని బంక్ నిర్వాహకులకు క్లీన్ చిట్ ఇచ్చారు. కారు మాన్యువల్  లో పేర్కొన్న పరిమితి కంటే ట్యాంకులో కొంత అదనంగా ఇంధనం పట్టే అవకాశం ఉంటుందని అధికారి సమర్థించుకునే ప్రయత్నం చేశారు.  

 

 కంపెనీ మేనేజర్ షాకింగ్ స్టేట్మెంట్ 

అధికారుల వివరణపై బాధితుడు . స్థానికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. 45 లీటర్ల ట్యాంకులో 9 నుండి 10 లీటర్ల అదనపు ఇంధనం ఎలా పడుతుందని ప్రశ్నించగా.. అధికారులు మళ్లీ కారు మాన్యువల్ వైపే వేలు చూపించారు తప్ప స్పష్టమైన సమాధానం ఇవ్వలేదు. అయితే, ఈ వివాదంపై సదరు  ఫోక్స్‌వ్యాగన్ కంపెనీ అధికారిక అవుట్‌లెట్ మేనేజర్ స్పందిస్తూ.. తమ కారు ట్యాంకులో 52 లీటర్లు లేదా అంతకంటే ఎక్కువ ఇంధనం పట్టే అవకాశమే లేదని తేల్చి చెప్పారు. ఎయిర్ స్పేస్, పైపులతో కలుపుకున్నా గరిష్టంగా 4 నుండి 5 లీటర్ల తేడా ఉండవచ్చేమో కానీ, ఈ స్థాయిలో అదనంగా పట్టడం అసాధ్యమని కంపెనీ టెక్నీషియన్లు స్పష్టం చేయడం బంక్ మోసాన్ని బలపరుస్తోంది.

 ఆలస్యమైన తనిఖీలు - బినామీ డీల్స్ ఆరోపణలు 

ఈ మొత్తం వ్యవహారంలో అధికారుల తీరుపై కూడా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బాధితుడు శనివారం ఫిర్యాదు చేస్తే, అధికారులు సోమవారం మధ్యాహ్నం వరకు బంకుకు రాలేదు. దాదాపు ఒకటిన్నర రోజు ఆలస్యంగా రావడంపై లక్నోలో ఉన్నామని, ఇతర పనులు ఉన్నాయని అధికారులు సాకులు చెప్పారు. ఈ గ్యాప్‌ను వాడుకుని పెట్రోల్ బంక్ యాజమాన్యం తమ మిషన్లలోని అవకతవకలను, రీడింగ్ మోసాలను సరిచేసుకుని సాక్ష్యాలను మాయం చేసి ఉంటుందని బాధితుడు ఆరోపిస్తున్నాడు.
 
స్థానిక అధికారులు, పెట్రోల్ బంక్ యాజమాన్యం కుమ్మక్కై తమకు క్లీన్ చిట్ ఇచ్చుకున్నారని కారు యజమాని మండిపడుతున్నారు. సాధారణంగా పెట్రోల్ బంకుల్లో సామాన్య ప్రజలు ఇలాంటి మోసాలకు నిత్యం గురవుతూనే ఉంటారని, ఈ 52 లీటర్ల ఉదంతం దానికి సజీవ సాక్ష్యమని నెటిజన్లు సామాజిక మాధ్యమాల్లో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.   

Advertisement

టాప్ హెడ్ లైన్స్

IND vs SL 1st Test: ఇండియా చారిత్రాత్మక 600వ టెస్ట్ సమరం.. డబ్ల్యూటీసీ ఫైనల్ టార్గెట్ తో గిల్ సేన ప్లాన్స్.. రేపటి నుంచి తొలి టెస్టు!
ఇండియా చారిత్రాత్మక 600వ టెస్ట్ సమరం.. డబ్ల్యూటీసీ ఫైనల్ టార్గెట్ తో గిల్ సేన ప్లాన్స్.. రేపటి నుంచి తొలి టెస్టు!
Jemimah Injury Shock: జెమిమా రోడ్రిగ్స్ కు గాయం.. ఆసియా కప్ తో పాటు ఏషియన్ గేమ్స్ కు దూరం, రీప్లేస్మెంట్ ఎవ‌రంటే..!
జెమిమా రోడ్రిగ్స్ కు గాయం.. ఆసియా కప్ తో పాటు ఏషియన్ గేమ్స్ కు దూరం, రీప్లేస్మెంట్ ఎవ‌రంటే..!
Breaking News:తెలంగాణ ఫీజు రియింబర్స్‌మెంట్‌పై రేవంత్ కీలక ప్రకటన 
తెలంగాణ ఫీజు రియింబర్స్‌మెంట్‌పై రేవంత్ కీలక ప్రకటన 
NDA Convenor Chandrababu?: ఎన్డీయే కూటమికి కొత్త కన్వీనర్ ఏర్పాటుకు మోదీ గ్రీన్ సిగ్నల్! రేసులో చంద్రబాబు!
ఎన్డీయే కూటమికి కొత్త కన్వీనర్ ఏర్పాటుకు మోదీ గ్రీన్ సిగ్నల్! రేసులో చంద్రబాబు!
Advertisement

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Naidu: అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
Venkatesh: కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Makutam Review - మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
Embed widget