అన్వేషించండి

Indian Mango party San Francisco: అమెరికాలో ఫ్రీ మ్యాంగో ఫెస్టివల్ పెట్టిన భారతీయులు - క్యూలో నిలబడి తిన్న అమెరికన్లు - వీడియోలు వైరల్

Darshil SF Mango Festival 2026: అమెరికాలోని సన్‌ఫ్రాన్సిస్కోలో భారతీయ మామిడి పండ్లతో నిర్వహించిన మ్యాంగో పార్టీ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆల్ఫాన్సో, కేసర్ పండ్ల రుచికి అమెరికన్లు ఫిదా అయ్యారు.

India Mango Production Wall Street Journal report: సన్‌ఫ్రాన్సిస్కో వీధుల్లో భారతీయ మామిడి పండ్ల సువాసనలు గుబాళించాయి. భారతదేశానికి చెందిన అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆల్ఫాన్సో, కేసర్, చౌన్సా వంటి మామిడి రకాలను ఉచితంగా రుచి చూపించడానికి నిర్వహించిన ఒక వినూత్న  మ్యాంగో పార్టీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వందలాది మంది అమెరికన్లు, ప్రవాస భారతీయులు ఈ పండ్ల రుచిని ఆస్వాదించడానికి గంటల తరబడి పొడవైన క్యూ లైన్లలో నిలబడ్డారు.  

అమెరికాను ఊపేస్తున్న  మ్యాంగో వైబ్స్ 

భారత సంతతికి చెందిన కమ్యూనిటీ లీడర్ దర్శిల్ ఆధ్వర్యంలో సన్‌ఫ్రాన్సిస్కోలో ఈ మామిడి పండగ ఘనంగా జరిగింది. ఇప్పటికే విజయవంతంగా నాలుగో సంవత్సరంలోకి అడుగుపెట్టిన ఈ వార్షిక వేడుక, ఈసారి సోషల్ మీడియా సృష్టించిన హంగామాతో గ్లోబల్ టాపిక్‌గా మారింది. ఈ ఈవెంట్‌లో వందలాది మామిడి పండ్లను వాలంటీర్లు అక్కడికక్కడే ముక్కలుగా కోసి, వచ్చిన వారికి ఉచితంగా సర్వ్ చేశారు. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలను ఎక్స్ యూజర్ జారెడ్ సీడెల్ షేర్ చేస్తూ..  నా జీవితంలో తిన్న అత్యంత అద్భుతమైన మామిడి పండ్లు ఇవే.. ఇక్కడి వైబ్స్ నెక్ట్స్ లెవెల్  అని ప్రశంసించారు.    

భారతీయుల గుండెల్లో ప్రత్యేక స్థానం 

ఈ వైరల్ పోస్టులపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. భారతీయ మామిడి పండ్లను మ్యూనిటీ అంతా కలిసి ఆస్వాదించడంలో ఉండే మజానే వేరు.. సన్‌ఫ్రాన్సిస్కోలో వేసవి కాలానికి ఇంతకంటే మంచి ముగింపు ఉండదు  అని ఒకరు కామెంట్ చేయగా..  మామిడి పండ్ల కోసం భారతీయుల గుండెల్లో ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం రిజర్వ్ అయి ఉంటుంది అని మరొకరు భావోద్వేగంగా రాసుకొచ్చారు. అమెరికన్లకు భారతదేశపు అసలైన రుచులను పరిచయం చేయడమే కాకుండా, ప్రవాస భారతీయులు తమ స్వదేశీ జ్ఞాపకాలను నెమరవేసుకోవడానికి ఈ ఈవెంట్ ఒక అద్భుతమైన వేదికగా నిలిచింది.  

 అమెరికా మార్కెట్ లో లగ్జరీ  ఐటమ్

భారతీయ మామిడి పండ్లకు అమెరికాలో విపరీతమైన డిమాండ్ ఉంది. పరిమిత కాలం మాత్రమే లభించే ఈ పండ్లు మార్కెట్లోకి వచ్చిన కొన్ని గంటల్లోనే అమ్ముడవుతుంటాయి. అక్కడి మార్కెట్లో ఇవి అత్యంత ఖరీదైన లగ్జరీ  వస్తువులుగా పరిగణిస్తారు.  మామిడి పండ్లను అమెరికాకు చేర్చడం వెనుక ఒక పెద్ద శాస్త్రీయ ప్రక్రియ ఉంది. అమెరికా దిగుమతి నిబంధనలకు అనుగుణంగా, క్వాలిటీ , రుచి దెబ్బతినకుండా ఉండేందుకు ముంబైలోని ప్రత్యేక ప్లాంట్లలో ఈ పండ్లకు  గామా ఇరాడియేషన్   చేసిన తర్వాతే విమానాల్లో యూఎస్ మార్కెట్లకు తరలిస్తారు.

ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన గ్లోబల్ స్టాట్ 

ఈ ఈవెంట్ వైరల్ అవుతున్న తరుణంలోనే  ది వాల్ స్ట్రీట్ జర్నల్  నివేదికలోని ఒక ఆసక్తికరమైన గణాంకం అంతర్జాతీయ నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా లభించే మొత్తం మామిడి పండ్లలో దాదాపు సగం వాటా భారతదేశానిదే. ఇండియా ఏటా సుమారు  20 మిలియన్ మెట్రిక్ టన్నుల మామిడిని ఉత్పత్తి చేస్తోంది. అయితే ఇందులో కేవలం  1 శాతం మాత్రమే విదేశాలకు ఎగుమతి అవుతోంది. మిగిలిన 99 శాతం పండ్లను భారతీయులే స్వయంగా తినేస్తారనే వాస్తవం విని గ్లోబల్ ఆన్‌లైన్ కమ్యూనిటీ నోరెళ్లబెడుతోంది.
 
సన్‌ఫ్రాన్సిస్కోలో జరిగిన ఈ మ్యాంగో సెలబ్రేషన్ కేవలం ఒక పండ్ల రుచిని చూపించే కార్యక్రమంగానే కాకుండా, భారతదేశపు సాంస్కృతిక రాయబారి గా నిలిచింది. పండ్ల రారాజైన మామిడికి ఉన్న అంతర్జాతీయ క్రేజ్ ఏంటో ఈ ఈవెంట్ మరోసారి నిరూపించింది.  

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Breaking News: తుని చిన్నారి అదృశ్యం కేసులో కీలక మలుపు- అకస్మాత్తుగా పెంపుడు కుక్క మృతి
తుని చిన్నారి అదృశ్యం కేసులో కీలక మలుపు- అకస్మాత్తుగా పెంపుడు కుక్క మృతి
Jeedimetla Bangladeshi Nationals Arrested: హైదరాబాద్‌లో ఏడుగురు బంగ్లాదేశీయుల అరెస్ట్ - పాస్‌పోర్టులు, వీసాలేం లేవు - ఎలా వచ్చారు?
హైదరాబాద్‌లో ఏడుగురు బంగ్లాదేశీయుల అరెస్ట్ - పాస్‌పోర్టులు, వీసాలేం లేవు - ఎలా వచ్చారు?
Elon Musk Net Worth 2026:తొలి ట్రిలియనీర్‌గా ఎలాన్ మస్క్ రికార్డు! అదానీ, అంబానీల కంటే పది రెట్లు ఎక్కువ సంపద!
తొలి ట్రిలియనీర్‌గా ఎలాన్ మస్క్ రికార్డు! అదానీ, అంబానీల కంటే పది రెట్లు ఎక్కువ సంపద!
US Iran Deal: ఇరాన్‌తో శాంతి ఒప్పందం కుదిరింది, త్వరలోనే సంతకాలు చేసుకుంటాం: Donald Trump
ఇరాన్‌తో శాంతి ఒప్పందం కుదిరింది, త్వరలోనే సంతకాలు చేసుకుంటాం: Donald Trump
Advertisement

వీడియోలు

Hardik Pandya Ruled Out of ODI | ఆఫ్ఘాన్ వన్డే సిరీస్‌కు హార్దిక్ దూరం ?
Womens T20 World Cup 2026 | మహిళల టీ20 వరల్డ్‌కప్‌కు టీమిండియా రెడీ
Who is Cricketer Bharti Fulmali | ట్రోలర్స్ నోర్లు మూయించిన మహిళా క్రికెటర్
Seniors Complain Against Gautam Gambhir | గౌతమ్ గంభీర్‌పై బీసీసీఐకి ఫిర్యాదు ?
Manav's Father Left Stadium Out Of Nervousness | కొడుకు మ్యాచ్ చూడకుండానే వెళ్లిన తండ్రి
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jeedimetla Bangladeshi Nationals Arrested: హైదరాబాద్‌లో ఏడుగురు బంగ్లాదేశీయుల అరెస్ట్ - పాస్‌పోర్టులు, వీసాలేం లేవు - ఎలా వచ్చారు?
హైదరాబాద్‌లో ఏడుగురు బంగ్లాదేశీయుల అరెస్ట్ - పాస్‌పోర్టులు, వీసాలేం లేవు - ఎలా వచ్చారు?
Suryiya Face Swap: ప్రభాసే కాదు... సూర్య కూడా దొరికేశాడు... ఇద్దరి సినిమాల్లో సేమ్ మిస్టేక్
ప్రభాసే కాదు... సూర్య కూడా దొరికేశాడు... ఇద్దరి సినిమాల్లో సేమ్ మిస్టేక్
Vizag Steel Plant Accident: స్టీల్ ప్లాంట్ ప్రమాదం ఘటనలో మరో ప్రాణం బలి - చికిత్స పొందుతూ కార్మికుడు సూరిబాబు మృతి
స్టీల్ ప్లాంట్ ప్రమాదం ఘటనలో మరో ప్రాణం బలి - చికిత్స పొందుతూ కార్మికుడు సూరిబాబు మృతి
Bihar Mobile Tower Stolen: మొబైల్స్ కాదు.. ఏకంగా మొబైల్ టవర్స్ చోరీ - బీహార్‌ దొంగలతో మామూలుగా ఉండదు మరి!
మొబైల్స్ కాదు.. ఏకంగా మొబైల్ టవర్స్ చోరీ - బీహార్‌ దొంగలతో మామూలుగా ఉండదు మరి!
Breaking News: మాజీ మంత్రి దేవినేని ఉమా పేరుతో సైబర్ మోసం!వాట్సాప్ కాల్స్ చేసి వసూళ్లు! 
మాజీ మంత్రి దేవినేని ఉమా పేరుతో సైబర్ మోసం!వాట్సాప్ కాల్స్ చేసి వసూళ్లు! 
NEET UG 2026 Retest:నీట్‌ యూజీ 2026 రీటెస్టులో కీలక మార్పులు! అదనంగా 15 నిమిషాల టైం! రఫ్‌ వర్క్ కోసం మరిన్ని పేజీలు!
నీట్‌ యూజీ 2026 రీటెస్టులో కీలక మార్పులు! అదనంగా 15 నిమిషాల టైం! రఫ్‌ వర్క్ కోసం మరిన్ని పేజీలు!
BRS BJP Secret Alliance Rumours: బీజేపీపై పోరాడకుండా ఒంటరి పోటీ అంటే నమ్ముతారా? బీఆర్ఎస్ రాజకీయ వ్యూహం సీరియస్‌గా లేదా?
బీజేపీపై పోరాడకుండా ఒంటరి పోటీ అంటే నమ్ముతారా? బీఆర్ఎస్ రాజకీయ వ్యూహం సీరియస్‌గా లేదా?
Yogi Adityanath Strategy: మూడో సారి గెలిచేందుకు ఆదిత్యనాథ్ స్కెచ్ - అఖిలేష్ యాదవ్ రివర్స్ ప్లాన్ - యూపీలో ఏం జరుగుతోంది?
మూడో సారి గెలిచేందుకు ఆదిత్యనాథ్ స్కెచ్ - అఖిలేష్ యాదవ్ రివర్స్ ప్లాన్ - యూపీలో ఏం జరుగుతోంది?
Embed widget