దురంధర్ సినిమాలో కనిపించిన టీ కొట్టు లడఖ్‌లోని లేహ్‌లో ఉంది. దాని అసలు పేరు ఎస్‌హెచ్ ఖాన్ రెస్టారెంట్.
Dhurandhar Washma Butt Chai Shop Real Location: ధురంధర్ సినిమా ఎఫెక్ట్! లడఖ్‌లో టీ కొట్టు కిటకిట! అసలు రీజన్ ఏంటంటే?
Dhurandhar Washma Butt Chai Shop Real Location:ధురంధర్ సినిమాలో కనిపించే ఐకానిక్ వష్మా బట్ చాయ్ షాప్ సినిమా సెట్ కాదు. సినిమా దెబ్బకు లడక్‌లోని ఈ టీ కొట్టు పర్యాటకులతో కిటకిటలాడుతోంది.

- సినిమాలో చూపిన టీ కొట్టు నిజమైనదని తెలిసింది.
- లడఖ్ లోని ఈ చాయ్ షాప్ వైరల్ అవుతోంది.
- పర్యాటకులు టీ తాగడానికి, ఫోటోలు దిగడానికి వస్తున్నారు.
- ఈ చాయ్ షాప్ లడఖ్ పర్యాటకానికి కొత్త ఆకర్షణ.
Dhurandhar Washma Butt Chai Shop Real Location:వెండితెరపై కనిపించే కొన్ని ప్రదేశాలు ఎంత అద్భుతంగా ఉంటాయి. ఇలా అద్భుతంగా కనిపించేవన్నీ కూడా నిజమేనని నమ్మలేం. అలాగని అన్నీ గ్రాఫిక్స్, సెట్టింగ్స్ అనుకుంటే కూడా పొరపాటే. ఇప్పుడు మనం పైన చెప్పిన టీ కొట్టు కూడా అలాంటిదే. ఇప్పుడు ఈ టీ కొట్టు మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. రీసెంట్ బ్లాక్‌బస్టర్ ధురంధర్‌లోని హంజా అలీ మజారీ, ఆలం భాయ్ మధ్య సాగే సన్నివేశాల్లో టీ సీన్ గుర్తుందా. ఆ వష్మ బట్ చాయ్ షాప్ ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఇది సినిమా కోసం వేసిన సెట్ అని చాలా మంది అనుకునే ఉంటారు. కానీ అది తప్పు. లడఖ్‌లోని లేహ్‌లో ఉన్న నిజమైన టీ కొట్టు అది.
టీ కొట్టుకు పరుగులు పెడుతున్న పర్యాటకులు
లడఖ్ పర్యటనకు వెళ్లిన సౌమ్య ఛటర్జీ అనే ట్రావెల్ వ్లాగర్, ఇన్ స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఒక వీడియోతో ఈ రహస్యం బయటపడింది. ఈ టీ కొట్టు లేహ్‌లో ఉంది. నిజానికి దీని అసలు పేరు ఎస్ హెచ్ ఖాన్ రెస్టారెంట్. పేరు మార్చి అక్కడ సీన్స్ తీసారు. అయితే సినిమా పాపులారిటీని చూసి, ఆ హోటల్ యజమాని సినిమాలో వాడిన వష్మా బట్ చాయ్ షాప్ అనే సైన్ బోర్డును అలాగే ఉంచేశారు. సినిమా సెట్ అనుకొని పొరపడిన ఫ్యాన్స్, ఇది నిజంగానే ఉందని తెలియడంతో ఇప్పుడు అక్కడికి క్యూ కడుతున్నారు.
సోషల్ మీడియాలో పోస్టులు
వష్మా బట్ చాయ్ షాప్‌లో టీ తాగేందుకు వెళ్తున్న పర్యాటకులు ఆ ప్రాంతాన్ని ఆస్వాదిస్తున్నారు. అక్కడ జరిగిన సీన్స్‌ను గుర్తు చేసుకుంటున్నారు. సెల్ఫీలు, ఫొటోలు దిగుతున్నారు. సోషల్ మీడియాలో ఈ ఫొటోలు, వాటికి సంబంధించిన పోస్టులు చేసిన వారంతా ప్రత్యేకంగా టీ కొట్టును చూసేందుకు ఆ ప్రాంతాన్ని సందర్శిస్తున్నారు.
ఎక్కువ మంది చదివిన ఈ వార్తలు మిస్ అవ్వొద్దు | |
| 1 | కోహ్లీ, సాయి సుదర్శన్ మధ్య మాటల యుద్ధం |
| 2 | ఆర్సీబీ విజయానికి కారణం ఇదే |
| 3 | రెండోసారి ఐపీఎల్ టైటిల్ సొంతం చేసుకున్న ఆర్సీబీ |
| 4 | ఆరెంజ్, పర్పుల్ క్యాప్ విన్నర్లు వీరే |
| 5 | ఫ్యామిలీతో ఆర్సీబీ ప్లేయర్స్ సెలబ్రేషన్ |
ధురంధర్ 2 ప్రపంచవ్యాప్తంగా 1850 కోట్లను కొల్లగొట్టింది. ఈ సినిమాలోని కనిపించిన ప్రాంతాలను ఎక్స్‌ప్లోర్ చేస్తున్నారు. అందులో భాగంగానే ఇప్పుడు టీ కొట్టు వెలుగులోకి వచ్చింది. ఇదే కాదు భారత్‌లో సినిమా టూరిజం వేగంగా పెరుగుతోంది. కశ్మీర్ నుంచి రాజస్థాన్ వరకు సినిమాల్లో కనిపించే లొకేషన్‌లకు పర్యాటకుల తాకిడి పెరగడం సహజం. ఇప్పుడు లడఖ్‌లోని ఈ వష్మా బట్ చాయ్ షాప్ టీ కొట్టు కూడా ఆ జాబితాలో చేరింది. పాతకాలపు సైన్ బోర్డులు, ఆ గదిలో ఇంటీరియర్స్ ప్రేక్షకులను పాత రోజుల్లోకి తీసుకెళ్తున్నాయి.
లడఖ్ టూరిజానికి కొత్త కలర్
లడఖ్ అంటేనే సాధారణంగా మొనాస్టరీలు, సాహస క్రీడలు, ప్రకృతి అందాలకు ప్రసిద్ధి. కానీ ఇప్పుడు ఈ టీకొట్టు ఒక కొత్త పర్యాటక ఆకర్షణగా మారింది. స్థానికంగా ఉండే చిన్న చిన్న వ్యాపారాలకు సోషల్ మీడియా ఏవిధంగా అండగా నిలుస్తుందో చెప్పడానికి ఈ చాయ్‌షాపు మంచి ఎగ్జాంపుల్. ఒకప్పుడు కేవలం స్థానికులు మాత్రమే టీ తాగేవారు. అలాంటి హోటల్ ఇప్పుడు జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది.
Before You Go
MahuaMoitra: మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|
Frequently Asked Questions
దురంధర్ సినిమాలో కనిపించిన టీ కొట్టు ఎక్కడ ఉంది?
ఆ టీ కొట్టు సినిమా కోసం ఏర్పాటు చేసిన సెట్టా?
కాదు, అది సినిమా కోసం ఏర్పాటు చేసిన సెట్ కాదు. అది లేహ్‌లో నిజంగానే ఉన్న టీ కొట్టు. పేరు మార్చి అక్కడ సన్నివేశాలు చిత్రీకరించారు.
ఈ టీ కొట్టు ఇప్పుడు ఎందుకు అంత పాపులర్ అయింది?
ట్రావెల్ వ్లాగర్ సౌమ్య ఛటర్జీ షేర్ చేసిన వీడియోతో ఈ టీ కొట్టు సోషల్ మీడియాలో వైరల్ అయింది. సినిమా అభిమానులు ఇది నిజమని తెలుసుకుని అక్కడికి వెళ్తున్నారు.
ఈ టీ కొట్టు వల్ల లడఖ్ పర్యాటకానికి ఎలా ఉపయోగపడుతుంది?
ఈ టీ కొట్టు ఇప్పుడు లడఖ్‌లో ఒక కొత్త పర్యాటక ఆకర్షణగా మారింది. స్థానిక వ్యాపారాలకు సోషల్ మీడియా ఎలా ఉపయోగపడుతుందో చెప్పడానికి ఇది ఒక మంచి ఉదాహరణ.
ట్రెండింగ్ వార్తలు






















