IAF MiG 29K Fighter Jet Crash: సముద్ర తీరంలో కుప్పకూలిన మిగ్- 29కే- పైలట్ సేఫ్!
IAF MiG 29K Fighter Jet Crash: గోవా తీరంలో మిగ్- 29కే యుద్ధ విమానం కుప్పకూలిపోయింది.
IAF MiG 29K Fighter Jet Crash: భారత నౌకాదళానికి చెందిన మిగ్-29కే విమానం గోవా తీరంలో కుప్పకూలింది. సాంకేతిక లోపం కారణంగానే మిగ్- 29కే విమానం కూలిపోయినట్లు నేవీ అధికారులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనలో పైలట్ క్షేమంగా బయటపడ్డాడు.
A MiG 29K fighter aircraft crashed over sea on a routine sortie off Goa coast after it developed a technical malfunction while returning to base. Pilot ejected safely & was recovered in a swift search & rescue operation. Pilot is reported to be in a stable condition: Indian Navy pic.twitter.com/CDyC1wBUHI
— ANI (@ANI) October 12, 2022
తిరిగి వెళ్తుండగా
విమానం సముద్రం మీదుగా ఎగురుతుండగా సాంకేతిక లోపంతో ఒక్కసారిగా కూలిపోయింది. సమాచారం అందిన వెంటనే అధికారులు వేగంగా రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. దీంతో పైలట్ సురక్షితంగా బయటపడ్డాడు.
శిక్షణలో వినియోగిస్తున్న ఈ విమానం నేవీ స్థావరానికి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సాంకేతిక లోపం కారణంగానే ఈ ఘటన జరిగినట్లు అనుమానిస్తున్నారు. ప్రమాదంపై విచారణకు బోర్డు ఆఫ్ ఎంక్వైరీని అధికారులు ఆదేశించారు. రష్యాలో తయారైన మిగ్-29కే ప్రపంచంలోనే అత్యంత అధునాతనమైన యుద్ధ విమానం.
ఏదైనా ప్రమాదం సంభవించినప్పుడు ఎజెక్షన్ హ్యాండిల్ లాగడంతో వెనక సీటులో ఉండే పైలట్ ముందుకు ఎజెక్ట్ అయి సురక్షితంగా బయటపడేందుకు ఈ విమానంలో ప్రత్యేక ఎజెక్షన్ సీటు ఉంది. 2020 ఫిబ్రవరి, నవంబర్ నెలల్లో రెండు మిగ్-29 కే విమానాలు కూలిపోయాయి.
ఇటీవల
భారత సైన్యానికి చెందిన చీతా హెలికాప్టర్ అరుణాచల్ ప్రదేశ్‌లో ఇటీవల కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఓ పైలట్ ప్రాణాలు కోల్పోయారు. మరొకరు గాయపడ్డారు. తవాంగ్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఉదయం 10 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందిన వెంటనే అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.
Tragic news coming from Tawang District in Arunachal Pradesh about an Indian Army Cheetah Helicopter crash. Praying for the survival of the pilots 🙏 pic.twitter.com/I6uhldhPbI
— Kiren Rijiju (@KirenRijiju) October 5, 2022
గాయపడ్డ ఇద్దరు పైలట్లను సమీపంలోని సైనిక ఆస్పత్రికి తరలించారు. అందులో లెఫ్టినెంట్ కర్నల్ సౌరభ్ యాదవ్ చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. మరో పైలట్ ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. ప్రమాదంపై పూర్తి స్థాయి దర్యాప్తునకు ఆదేశించారు.
Also Read: Viral Video: పానీపూరీ ఎలా ఉంది గజేంద్ర! ఎంచక్కా లాగించేసింది!
Also Read: Congress President Election: 'నా వెనుక సోనియా గాంధీ లేరు- అందుకే బరిలోకి దిగాను'