అన్వేషించండి

Indian Celebrities Adopted Orphans: వీళ్లే అసలైన సెలబ్రెటీలు, అనాథలను దత్తత తీసుకున్న గొప్పోళ్లు

Indian Celebrities Adopted Orphans: అనాథ.. ఈ ప్రపంచంలో ఈ పదానికి మించిన బరువైన పదం ఏదీ ఉండదేమో! తల్లిదండ్రులు లేక, నా అనుకునే వారు లేక, ఆదరించేవారు కరువై ఎంతో మంది రోడ్లపై తిరుగుతున్నారు.

Indian Celebrities Adopted Orphans: అనాథ.. ఈ ప్రపంచంలో ఈ పదానికి మించిన బరువైన పదం ఏదీ ఉండదేమో! తల్లిదండ్రులు లేక, నా అనుకునే వారు లేక, ఆదరించేవారు కరువై ఎంతో మంది రోడ్లపై తిరుగుతున్నారు. దొరికింది తింటూ, దొరకని నాడు పస్తులు ఉంటూ, రోడ్లపై, బస్టాండుల్లో,  రైల్వే స్టేషన్లలో సాగుతున్న బ్రతుకులు ఎన్నో. పరిస్థితులు వీరిలో కొందరిని నేరస్తులుగా మారిస్తే, మరి కొందరిని సమాజంపై విద్వేషకులు మారుస్తున్నాయి.

యుద్ధాలు, వ్యాధులు, పేదరికం, కరువు, ప్రకృతి విపత్తులు తదితర కారణాల వల్ల తమ తల్లిదండ్రులను కోల్పోవడం,  పేదరికం, ఉపాధి లేకపోవడం, నిరక్షరాస్యత, కుల, మత, ప్రాంతీయ, లింగ అసమానతల కారణంగా మన దేశంలోనూ లక్షల మంది అనాథలవుతున్నారు. అలాంటి వారిని దత్తత తీసుకుని కొత్త జీవితం ఇవ్వడం చెప్పినంత సులువుకాదు. కానీ ఇండియాకు చెందిన పలువురు ప్రముఖులు, సెలబ్రిటీలు పిల్లలను దత్తత తీసుకున్నారు. పలువురికి ఆదర్శంగా నిలిచారు. అలాంటి ప్రముఖుల గురించి ప్రత్యేక కథనం..

ప్రపంచంలో చాలా మంది గొప్ప వాళ్లు ఉండొచ్చు. కానీ కొందరికి మాత్రమే మంచి మనసు ఉంటుంది. సుస్మితా సేన్, రవీనా టాండన్, సన్నీలియోన్ & డేనియల్ వెబర్, భానుశాలి & మహివిజ్ గుర్మీత్ చౌదరి & డెబినా బొనర్జీ, శోభన, నీలం కొఠారి వంటి వారు ఇందుకు ఉదాహరణగా నిలుస్తారు.  

సుస్మితా సేన్ 
ప్రముఖ బాలీవుడ్ నటి సుస్మితా సేన్ తన 25 ఏళ్ల వయసులో అలీసా అని బిడ్డను దత్తత తీసుకున్నారు. ఇందుకోసం ఆమె చాలా కాలంపాటు న్యాయ పోరాటం చేయాల్సి వచ్చింది. 2010లో ఆమె రెనీ అనే మరో బిడ్డను దత్తత తీసుకుంది. తొలుత ఆమె నిర్ణయాన్ని, సింగిల్ పేరెంట్ విధానాన్ని చాలా మంది వ్యతిరేకించారు. అయినా ఆమె వెనక్కి తగ్గలేదు. ఆ తరువాత దేశంలో సింగిల్ పేరెంట్‌హుడ్‌గా ఉండాలనుకునే వారికి సుస్మితా సేన్ ఆదర్శంగా నిలిచారు.  

రవీనా టాండన్
మరో ప్రముఖ నటి రవీనా టాండన్ సైతం ఇద్దరిని దత్తత తీసుకున్నారు. 21 ఏళ్ల వయసులో ఛాయా, పూజ అనే ఇద్దరు అమ్మాయిలను దత్తత తీసుకున్నారు. ఆ తరువాత ఆమెకు రాషా, రణబీర్‌ పుట్టారు. సొంత పిల్లలతో పాటు దత్తత తీసుకున్నవారని సైతం ఆమె ప్రేమగా చూసుకునే వారు. తన ఇద్దరు దత్తత పిల్లల గురించి ఆమె ఆమె మాట్లాడుతూ..  నా ఇద్దరు యువ సోదరీమణులతో కలిసి జీవించడం సంతోషంగా ఉందంటూ చమత్కరిస్తుంది.  

సన్నీ లియోన్ & డేనియల్ వెబర్
సెలబ్రిటీలు సన్నీ లియోన్, ఆమె భర్త డేనియల్ వెబర్ 2016లో చిన్నారి నిషాను దత్తత తీసుకున్నారు. ఆ నిర్ణయంతో ఆమెపై ప్రశంసలు వెల్లువెత్తాయి. తరువాత ఈ జంట సరోగసీ ద్వారా కవలలు నోహ్, ఆషెర్‌లను తల్లిదండ్రులయ్యారు. ఇప్పుడు వారి కుటుంబం ఐదుగురితో సంతోషంగా ఉంటోంది. 

భానుశాలి & మహి విజ్
టీవీ రంగానికి చెందిన భానుశాలి, మహి విజ్జ్ జంట 2017లో రాజ్‌వీర్, ఖుషీలను దత్తత తీసుకున్నారు. వారి నిర్ణయంపై సోషల్ మీడియాలో అభిమానులు ప్రసంశలు కురిపించారు. కోవిడ్ సమయంలో కూడా ఈ జంట కేర్‌టేకర్ తమ దత్తత పిల్లలను వదిలిపెట్టలేదు. ఏడాది క్రితం వీరికి మరో బిడ్డ పుట్టింది.  

గుర్మీత్ చౌదరి & డెబినా బోనర్జీ
పిల్లలను దత్తత తీసుకున్న మరో టెలివిజన్ జంట గుర్మీత్ & డెబినా. వారు అత్యంత ఇష్టపడే సెలబ్రిటీలలో ఒకరు. ఈ జంట పూజ, లత అనే ఇద్దరు సోదరీమణులను దత్తత తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆడపిల్లల బాల్యాన్ని దూరం చేయకూడదని ఆ దంపతులు ముందుకొచ్చి లీగల్ కాగితాలపై సంతకాలు చేసి, ఇద్దరినీ సొంత కుటుంబంలా చూసుకుంటూ ఆనందంగా జీవిస్తున్నారు.  

శోభన
కేరళకు చెందిన ప్రముఖ దక్షిణ భారత నటీమణులలో ఒకరైన శోభన అనంతనారాయణిని దత్తత తీసుకున్నారు. చిన్నారి అన్న ప్రాసన కార్యక్రమం గురువాయూర్ ఆలయంలో జరిపించారు. 

మిథున్ చక్రవర్తి
ఒకప్పటి సూపర్‌స్టార్‌ల గురించి ఎక్కువగా మాట్లాడుకునే వారిలో ఆయన ఒకరు. చెత్త కుండీలో పడి ఉన్న బాలికను దత్తత తీసుకున్నాడు. ఆమెకు ఇషాని అని పేరు పెట్టి పెంచుకుంటున్నారు.  

సలీం ఖాన్
సలీం ఖాన్ (సల్మాన్ ఖాన్ తండ్రి) తన కుమార్తె అర్పితను దత్తత తీసుకున్నారు. తన సొంత బిడ్డలా చూసుకున్నారు. ఆమె కూడా తన కుటుంబంపై ప్రేమను చూపిస్తుంది. తన కుటుంబ సభ్యుల పేర్లను ఒంటిపై టాటూగా వేయించుకుంది. 

సుభాష్ ఘాయ్
ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు సుభాష్ ఘాయ్ అతని కుటుంబం ఒక చిన్న అమ్మాయిని దత్తత తీసుకుని ఆమెకు మేఘన అని పేరు పెట్టారు. పెద్దయ్యాక ఆమె లండన్‌లో ఉన్నత చదువులు చదివింది.  

దిబాకర్ బెనర్జీ
ప్రముఖ దర్శకుడు ఖోస్లా కా ఘోస్లా , అతని భార్య రిచా ముంబైలోని అనాథాశ్రమాల నుంచి ఒక చిన్న అమ్మాయిని దత్తత తీసుకున్నారు. వారు ఆమెకు ఇరా అని పేరు పెట్టారు.
 
సందీప్ సోపర్కర్
ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ సందీప్ సోపార్కర్ ఒక మగబిడ్డను దత్తత తీసుకుని అర్జున్ అని పేరు పెట్టారు. 2007 నుంచి అర్జున్‌ను ప్రేమగా చూసుకుంటున్నారు.  

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Case On KTR: ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 -  నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 - నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
Rahul Gandhi: బీజేపీ ఎంపీలపై దాడి - రాహుల్ గాంధీపై హత్యాయత్నం కేసు నమోదు
బీజేపీ ఎంపీలపై దాడి - రాహుల్ గాంధీపై హత్యాయత్నం కేసు నమోదు
Pawan Kalyan: నాగబాబు కోసం పవన్ కల్యాణ్ త్యాగం -  కేబినెట్ మార్పుచేర్పుల్లో సంచలన విషయం ఇదే !
నాగబాబు కోసం పవన్ కల్యాణ్ త్యాగం - కేబినెట్ మార్పుచేర్పుల్లో సంచలన విషయం ఇదే !
Telangana Tenth Exams: తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది!
తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అంబేడ్కర్ వివాదంపై పార్లమెంట్‌లో బీజేపీ, కాంగ్రెస్ ఆందోళనలుఅశ్విన్ రిటైర్మెంట్‌పై పాక్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలునా కామెంట్స్‌ని ట్విస్ట్ చేశారు, అంబేడ్కర్ వివాదంపై అమిత్ షాMumbai Ferry Capsized 13 Died | నేవీ బోట్...టూరిస్ట్ బోట్ ఢీ కొట్టడంతోనే ప్రమాదం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Case On KTR: ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 -  నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 - నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
Rahul Gandhi: బీజేపీ ఎంపీలపై దాడి - రాహుల్ గాంధీపై హత్యాయత్నం కేసు నమోదు
బీజేపీ ఎంపీలపై దాడి - రాహుల్ గాంధీపై హత్యాయత్నం కేసు నమోదు
Pawan Kalyan: నాగబాబు కోసం పవన్ కల్యాణ్ త్యాగం -  కేబినెట్ మార్పుచేర్పుల్లో సంచలన విషయం ఇదే !
నాగబాబు కోసం పవన్ కల్యాణ్ త్యాగం - కేబినెట్ మార్పుచేర్పుల్లో సంచలన విషయం ఇదే !
Telangana Tenth Exams: తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది!
తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది!
Manchu Issue: అరెస్టు నుంచి రక్షణ కల్పించలేం - మోహన్ బాబుకు తేల్చి చెప్పిన హైకోర్టు !
అరెస్టు నుంచి రక్షణ కల్పించలేం - మోహన్ బాబుకు తేల్చి చెప్పిన హైకోర్టు !
ఎన్టీఆర్ ఘాట్ జొలిస్తే అంతే సంగతులు - కాంగ్రెస్‌కు బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేల స్ట్రాంగ్ వార్నింగ్
BRS On NTR: ఎన్టీఆర్ ఘాట్ జొలిస్తే అంతే సంగతులు - కాంగ్రెస్‌కు బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేల స్ట్రాంగ్ వార్నింగ్
Today Headlines: రాజధాని అమరావతి నిర్మాణంపై బిగ్ అప్‌డేట్ - రాహుల్‌కు కేటీఆర్ లేఖ, టాప్ హెడ్ లైన్స్ @ 3 PM
రాజధాని అమరావతి నిర్మాణంపై బిగ్ అప్‌డేట్ - రాహుల్‌కు కేటీఆర్ లేఖ, టాప్ హెడ్ లైన్స్ @ 3 PM
Telangana Assembly: 'నువ్వేమన్నా డిప్యూటీ లీడర్‌వా?' - హరీష్ రావుపై మంత్రి కోమటిరెడ్డి తీవ్ర ఆగ్రహం, అసెంబ్లీలో మాటల యుద్ధం
'నువ్వేమన్నా డిప్యూటీ లీడర్‌వా?' - హరీష్ రావుపై మంత్రి కోమటిరెడ్డి తీవ్ర ఆగ్రహం, అసెంబ్లీలో మాటల యుద్ధం
Embed widget