అన్వేషించండి

Monsoon 2026: గుడ్ న్యూస్ - అండమాన్ ని తాకిన నైరుతి మేఘాలు.. జూన్ మొదటి వారంలోనే తెలుగు రాష్ట్రాల్లోకి!

South west Monsoon: నైరుతి రుతుపవనాలు అండమాన్ సముద్రాన్ని పలకరించాయి. ఎల్‌నినో ప్రభావం ఉన్నా ముందుగానే రుతుపవనాలు వచ్చేశాయి.

Andaman Monsoon: భారతదేశ వ్యాప్తంగా ఎండవేడిమితో అల్లాడుతున్న ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు అందించింది. 2026 ఏడాదికి సంబంధించి నైరుతి రుతుపవనాలు దక్షిణ అండమాన్ సముద్రం, నికోబార్ దీవులు, ఆగ్నేయ బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాల్లోకి అధికారికంగా ప్రవేశించాయి. సాధారణంగా మే 20 నాటికి రావాల్సిన రుతుపవనాలు, ఈ సారి కొంచెం ముందుగానే అంటే మే 15 నాటికే అండమాన్ తీరాన్ని తాకాయి.  వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండటంతో ఇవి వేగంగా ముందుకు కదులుతున్నట్లు ఐఎండీ ధృవీకరించింది.
 
ప్రస్తుతం అండమాన్ సముద్రం మీదుగా వీస్తున్న గాలుల వేగం పెరగడం, మేఘాల సాంద్రత ఎక్కువగా ఉండటంతో రుతుపవనాల విస్తరణకు మార్గం సుగమమైంది. రాబోయే 48 గంటల్లో ఇవి మిగిలిన అండమాన్ దీవులతో పాటు బంగాళాఖాతంలోని మరిన్ని ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉంది. ఆగ్నేయ దిశ నుంచి వీస్తున్న బలమైన గాలులు రుతుపవనాల కదలికను వేగవంతం చేస్తున్నాయని, ఫలితంగా దేశంలోని ఇతర ప్రాంతాలకు వర్షాలు సకాలంలో అందే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. 

 
అండమాన్ నుండి మలుపు తిరిగే ఈ రుతుపవనాలు జూన్ 1 నాటికి కేరళ తీరాన్ని తాకనున్నాయి. కేరళలోకి ప్రవేశించిన తర్వాత ఇవి కర్ణాటక మీదుగా ప్రయాణించి, జూన్ 5 నుండి 8వ తేదీ మధ్యలో రాయలసీమ, దక్షిణ తెలంగాణ ప్రాంతాల్లోకి ప్రవేశించే అవకాశం ఉంది. జూన్ రెండో వారం నాటికి రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా రుతుపవనాలు పూర్తిగా విస్తరిస్తాయని ఐఎండీ అంచనా వేస్తోంది.  

ఎల్‌నినో   ప్రభావం ప్రస్తుతం ఉందని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది.  రుతుపవనాలు వచ్చే వరకు కొన్ని ప్రాంతాల్లో వడగాల్పుల తీవ్రత కొనసాగవచ్చని, అరేబియా సముద్రంలో ఏర్పడే అల్పపీడనాల ఆధారంగా రుతుపవనాల వేగంలో మార్పులు ఉండొచ్చని ఐఎండీ హెచ్చరించింది. ప్రస్తుతం అండమాన్ దీవుల్లో మొదలైన ఈ చినుకుల ప్రయాణం, మరో రెండు వారాల్లో భారత ప్రధాన భూభాగాన్ని చల్లబరచనుంది. నైరుతి రుతుపవనాల రాకతో దేశంలో వ్యవసాయ పనులకు అంకురార్పణ జరగనుంది.                   

టాప్ హెడ్ లైన్స్

NDA Convenor Chandrababu?: ఎన్డీయే కూటమికి కొత్త కన్వీనర్ ఏర్పాటుకు మోదీ గ్రీన్ సిగ్నల్! రేసులో చంద్రబాబు!
ఎన్డీయే కూటమికి కొత్త కన్వీనర్ ఏర్పాటుకు మోదీ గ్రీన్ సిగ్నల్! రేసులో చంద్రబాబు!
Independence Day Quiz Questions : ఆగస్టు 15పై పోటీ పరీక్షల్లో అడిగే ముఖ్యమైన GK ప్రశ్నలు.. సమాధానాలు ఇవే
ఆగస్టు 15పై పోటీ పరీక్షల్లో అడిగే ముఖ్యమైన GK ప్రశ్నలు.. సమాధానాలు ఇవే
Independence Day Speech : స్వాతంత్య్ర దినోత్సవ 2026 ప్రసంగం.. స్కూల్ స్పీచ్ పోటీలో గెలవాలంటే ఈ టిప్స్ పాటించండి
స్వాతంత్య్ర దినోత్సవ 2026 ప్రసంగం.. స్కూల్ స్పీచ్ పోటీలో గెలవాలంటే ఈ టిప్స్ పాటించండి
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Naidu: అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
Venkatesh: కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Makutam Review - మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
Embed widget