అన్వేషించండి

Radhan Pandit: 101 ఏళ్ల వరకు విజయ్ సీఎం.. రష్యా-అమెరికా గొడవలు కూడా తీరుస్తారట - దళపతి తీసేసిన జ్యోతిష్యుడి అతి వైరల్!

Vijay OSD Controversy: రిక్కీ రాధన్ పండిట్ వెట్రివేల్.. విజయ్ జ్యోతిష్యుడు ఇప్పుడు ట్రోలింగ్ మెటీరియల్ అయిపోయారు. ఇంటర్యూల్లో ఆయన చేస్తున్న కామెంట్లే కారణం.

Vijay OSD Radhan Pandit:  తమిళనాడు నూతన ముఖ్యమంత్రి విజయ్ తన వ్యక్తిగత జ్యోతిష్యుడు రాధన్ పండిట్‌ను ఓఎస్డీగా నియమించడంపై రాష్ట్రవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. ద్రవిడ రాజకీయాలకు పురిటిగడ్డ అయిన తమిళనాట, హేతువాద భావజాలం బలంగా ఉన్న చోట ఒక జ్యోతిష్యుడికి ప్రభుత్వ పదవి ఇవ్వడం ఏంటని ప్రతిపక్షాలతో పాటు మిత్రపక్షాలు కూడా మండిపడ్డాయి. దీంతో ఒత్తిడికి తలొగ్గిన విజయ్, నియమించిన 18 గంటల్లోనే ఆయనను పదవి నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే, పదవి పోయినా రాధన్ పండిట్  ఇంటర్యూల్లో చేస్తున్న  వ్యాఖ్యలు మాత్రం ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.  

రాధన్ పండిట్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో  విజయ్ జాతకం ప్రకారం ఆయన మరో 50 ఏళ్ల పాటు తమిళనాడు ముఖ్యమంత్రిగా కొనసాగుతారని జోస్యం చెప్పారు. ప్రస్తుతం విజయ్ వయస్సు 51 ఏళ్లు. అంటే పండిట్ లెక్క ప్రకారం విజయ్  101 ఏళ్ల వయస్సు  వచ్చే వరకు సీఎంగానే ఉంటారన్నమాట. ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.  పదవిలో ఉన్నది 18 గంటలే.. కానీ జోస్యం మాత్రం 50 ఏళ్లా అంటూ ఎద్దేవా చేస్తున్నారు.  

పండిట్ ఇక్కడితో ఆగకుండా, విజయ్ శక్తులు కేవలం తమిళనాడుకే పరిమితం కావని.. ఆయన అంతర్జాతీయ సమస్యలను కూడా పరిష్కరిస్తారని పేర్కొన్నారు.  రష్యా అధ్యక్షుడు , అమెరికా అధ్యక్షుడి మధ్య ఉన్న విభేదాలను కూడా విజయ్ పరిష్కరించగలరు అని ఆయన వ్యాఖ్యానించడం ఇప్పుడు పెద్ద కామెడీగా మారింది. ముందు రాష్ట్ర ఆర్థిక సమస్యలు చూడమనండి, ఆ తర్వాత రష్యా-అమెరికా పంచాయితీలు చూద్దాం అంటూ తమిళ నెటిజన్లు రాధన్ పండిట్‌ను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.
 
ఒకవైపు ముఖ్యమంత్రిగా విజయ్ తన పరిపాలనతో ప్రజలను ఆకట్టుకోవాలని ప్రయత్నిస్తుంటే, ఆయన సన్నిహితులు ఇలాంటి  అతి  వ్యాఖ్యలు చేయడం పార్టీకి ఇబ్బందిగా మారింది. జ్యోతిష్యులను నమ్మడం వ్యక్తిగత విషయం అయినప్పటికీ, దానిని ప్రభుత్వంతో ముడిపెట్టడం వల్ల విజయ్ యొక్క హేతుబద్ధత  పై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా యువతలో ఉన్న క్రేజ్‌ను ఇలాంటి వ్యాఖ్యలు దెబ్బతీస్తాయని  భావిస్తున్నారు.  

 రాధన్ పండిట్ గతంలో విజయ్ విజయాలను కచ్చితంగా ఊహించారని ఆయన మద్దతుదారులు చెబుతున్నా, ప్రస్తుతం ఆయన చేసిన అంతర్జాతీయ వ్యాఖ్యలు మాత్రం టీవీకే పార్టీకి పెద్ద తలనొప్పిగా మారాయి. 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Kerala Influencer Akhil Megha: కేరళం సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ జంటకు దిష్టి తగిలేసిందా? బస్సు క్లీనర్‌తో భార్య పరార్‌! బోరుమంటున్న భర్త!
కేరళం సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ జంటకు దిష్టి తగిలేసిందా? బస్సు క్లీనర్‌తో భార్య పరార్‌! బోరుమంటున్న భర్త!
Cow Urine Selling: పాలు సేకరణ కేంద్రంలా గోమూత్ర సేకరణ కేంద్రాలు! లీటరు రూ. 10! ఈ పైలట్ ప్రాజెక్టు గురించి తెలుసా? 
పాలు సేకరణ కేంద్రంలా గోమూత్ర సేకరణ కేంద్రాలు! లీటరు రూ. 10! ఈ పైలట్ ప్రాజెక్టు గురించి తెలుసా? 
అత్యంత లగ్జరీగా Trump Towers.. హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌లో మరో మైలురాయి, ధర వింటే షాక్
కోకాపేటలో లగ్జరీగా Trump Towers.. హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌లో మరో మైలురాయి, ధర వింటే షాక్
Court Denies Sushil Bail: ఒలింపియన్ సుశీల్ కుమార్‌కు బెయిల్ ఇచ్చేందుకు ఢిల్లీ హైకోర్టు నో.. సాగర్ ధన్కర్ మర్డర్ కేసులో షాకింగ్ ట్విస్ట్!
సుశీల్ కుమార్‌కు బెయిల్ ఇచ్చేందుకు ఢిల్లీ హైకోర్టు నో.. సాగర్ ధన్కర్ మర్డర్ కేసులో షాకింగ్ ట్విస్ట్!
Advertisement

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Old City Metro Updates: హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
KTR Son Himanshu Movie Debut: కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
Cow Urine Selling: పాలు సేకరణ కేంద్రంలా గోమూత్ర సేకరణ కేంద్రాలు! లీటరు రూ. 10! ఈ పైలట్ ప్రాజెక్టు గురించి తెలుసా? 
పాలు సేకరణ కేంద్రంలా గోమూత్ర సేకరణ కేంద్రాలు! లీటరు రూ. 10! ఈ పైలట్ ప్రాజెక్టు గురించి తెలుసా? 
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
UPI Transaction: మీరు ఒకసారి UPI చేస్తే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? 
మీరు ఒకసారి UPI చేస్తే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? 
Chemical Signaling: మొక్కలు మాట్లాడుకుంటాయా? సైన్స్, ఆధ్యాత్మికత చెప్పే అద్భుత రహస్యం!
మొక్కలు మాట్లాడుకుంటాయా? సైన్స్, ఆధ్యాత్మికత చెప్పే అద్భుత రహస్యం!
Microsoft Alert: హోటల్ వై-ఫైకి కనెక్ట్ అవ్వడం వల్ల మీ డేటా హ్యాక్‌! మైక్రోసాఫ్ట్ సీరియస్ వార్నింగ్! 
హోటల్ వై-ఫైకి కనెక్ట్ అవ్వడం వల్ల మీ డేటా హ్యాక్‌! మైక్రోసాఫ్ట్ సీరియస్ వార్నింగ్! 
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
Embed widget