అన్వేషించండి

Trisha Vijay Krishnan: TVK అంటే త్రిష విజయ్ కృష్ణనా..? దళపతి లక్కీచార్మ్‌ అంటూ ఫ్యాన్స్ పూనకాలు 

విజయ్ రాజకీయ పార్టీ.. అనూహ్య విజయం.. సీఎంగా ప్రమాణ స్వీకారం అన్నీ అలా జరిగిపోయాయి. ఓట్లేసిన పబ్లిక్ సంగతి పక్కనపెడితే... విజయ్ సీఎం కావాలని గట్టిగా కోరుకున్న ఫ్యాన్స్ మాత్రం ఇదంతా ఒక్కరి వల్లే అంటున్నారు..ఎవరా ఒక్కరు..?

Trisha Factor in Vijay's Win: తమిళ రాజకీయాల్లో సైలంట్ సునామీ దళపతి విజయ్.. ఇప్పుడు తమిళనాడు కొత్త సీఎం.. ఎన్నికలకు ముందు ఆయన సీఎం అవుతారని ఊహించిన వారు తక్కువే. .. తమిళనాడులో  అండర్‌ కరెంట్‌గా విజయ్ వేవ్ నడిచింది. ఈ విజయానికి కారణాలను రాజకీయ విశ్లేషకులు రకరకాలుగా చెబుతారు. కానీ ఆయన హార్డ్‌ కోర్ ఫ్యాన్స్ మాత్రం ఈ విజయంలో క్రెడిట్‌ను ఒకరికి ఇస్తున్నారు. విజయ్‌ విజయంలో ఆమె  X ఫ్యాక్టర్‌.. హీరోయిన్ త్రిష..

విజయ్ లైఫ్‌లో త్రిష అంత స్పెషలా...?

 విజయ్ లైఫ్‌లో త్రిష అంత స్పెషలా...? వాళ్లిద్దరి బంధం అెంత బలమైందా అంటే దానికి ఫాన్స్ వెంటనే జస్టిఫికేషన్ ఇస్తారు. ద్రవిడ రాజకీయ కుంభస్థలం బద్ధలు కొట్టి గద్దెనెక్కారు విజయ్‌..! రెండేళ్లలో రాజకీయాన్నే మార్చేశాడు. పార్టీ అనౌన్స్‌ చేసి...నేరుగా సీఎం చైర్‌లో కూర్చున్నారు.అయితే రెండేళ్ల క్రితం పార్టీ పెట్టడానికి ముందు ఇంకొకటి జరిగింది. పదిహేనేళ్ల క్రితం బ్రేక్ అయిన మూవీ కాంబినేషన్ తిరిగి వర్కవుట్ అయింది. కోలీవుడ్‌ దళపతి విజయ్‌తో స్క్రీన్‌మీదకు స్మైలీ స్టార్ త్రిష వచ్చింది.అదే ఆయన దశను మార్చింది అని నమ్ముతారు.. ఫ్యాన్స్.  " అన్న "దశమార్చిన దేవత" అంటూ వాళ్లు పొంగిపోతున్నారు. ఆ కాంబోను.. “లక్కీ సింబల్”గా చూస్తున్నారు?

త్రిష లక్కీ చార్మ్..!
త్రిష విజయ్ కాంబినేషన్ 22 ఏళ్ల కిందట మొదలైంది. వెండితెరపై వాళ్లది హిట్‌పెయిర్. గిల్లీతో మొదలైన స్నేహం.. మొన్నటి లియో వరకూ ఉంది. అయితే మధ్యలో 15 ఏళ్లు వాళ్లిద్దరి సినిమాలకు గ్యాప్ వచ్చింది కానీ.. వాళ్లిద్దరి మధ్యా గ్యాప్ లేదన్నది కోలీవుడ్ ఇన్‌సైడ్ టాక్. అయితే 15 ఏళ్లు దూరంగా ఉన్న త్రిష.. కరెక్ట్‌గా ఆయన లైఫ్‌ టర్న్ అయ్యే ముందు ఎంటర్‌ అవ్వడం ఆ న్యూ జర్నీ సూపర్‌హిట్టవడంతో ఫ్యాన్స్‌ దృష్టిలో త్రిష ఓ లక్కీ చార్మ్ అయిపోయారు. 2000ల తమిళ సినిమా చూసిన జనరేషన్‌కు...విజయ్ - త్రిష అంటే ఒక ఎమోషన్.ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీ...
సాంగ్స్, ఫన్ మూమెంట్స్...ఇవన్నీ ఇప్పటికీ ఫ్యాన్స్ మైండ్‌లో స్ట్రాంగ్‌గా ఉన్నాయి.ఆవిడొ్చ్చాకనే అంతా మారిపోయింది అనే కామెంట్లు, మీమ్‌లు స్టార్ట్ అయ్యాయి.అందుకే ఇప్పుడు ఇద్దరూ ఒకే ఫ్రేమ్‌లో కనిపిస్తే...సోషల్ మీడియాలో అది వెంటనే వైరల్ అవుతోంది. విజయ్‌లాగే త్రిషను ఆమె ఫ్యాన్స్‌ ఓన్ చేసుకున్నారు. అసలు విజయ్ విజయంలో అసలైన ఫ్యాక్టర్ త్రిషనే అనే స్థాయికి వచ్చారు. దానికి తోడు ఆమె నేరుగా ఎక్కడా ఎన్నికల ప్రచారంలో పాల్గొనకపోయినా... ఫలితాల రోజు తిరుమల వెళ్లడం.. అదే రోజు విజయ్‌ను కలవడం.. క్యాడర్‌ను చీర్‌ చేయడం.. ఇవన్నీ తనను ఇంకో స్థాయికి తీసుకెళ్లాయి. ఇక విజయ్ ప్రమాణ స్వీకారంలో త్రిష కనిపించేసరికే.. తన స్థానం ఏంటో అందరికీ అర్థమైపోయింది. విజయ్‌తో సమానంగా మీడియా త్రిషను ఫోకస్ చేసింది. 

అసలు TVK అంటే.. త్రిష- విజయ్ కృష్ణన్ 
తమిళగ.. వెట్రి కజగం ఇదీ టీవీకే పార్టీ పూర్తి పేరు. కానీ దీనిని త్రిష విజయ్ కృష్ణన్..అంటూ ఫ్యాన్స్ మార్చే పరిస్థితిి వచ్చింది. "అన్న ఇద్దరి పేర్లు కలిసొచ్చేలా పార్టీ పేరు సెట్ చేసుకున్నాడు" అని లైట్‌గా జోక్స్ వేసుకుంటున్నవారు కూడా ఉన్నారు. 

 

తమిళనాడులో ఇది మామూలే..!
సినిమా స్టార్లు.. పోలిటికల్ ప్లేయర్లు అవ్వడం తమిళనాడుకు కొత్తకాదు. అరవై ఏళ్లుగా సినిమారంగమే.. తమిళనాడు రాజకీయాన్ని శాసించింది. వీళ్లను చూసినప్పుడు  50 ఏళ్ల కిందట వచ్చి రాజకీయాలను శాసించిన మరో పెయిర్ గుర్తుకు రాక మానదు. తమిళ సూపర్‌స్టార్ MGR.. ఆయన హిట్‌ జోడీ జయలలిత ఇద్దరూ తమిళ రాజకీయాల్లో పీక్ స్థాయికి చేరారు. ఇద్దరూ ముఖ్యమంత్రులయ్యారు. MGR ఉన్నప్పుడు పార్టీ కార్యకలాపాల్లో ఉన్న జయ.. తర్వాతర్వాత సీఎం అయ్యారు. ఇప్పుడు  త్రిష కూడా...పార్టీలోకి వస్తారా.. అనే చర్చ రావడం సహజం. 
ఏమో తమిళనాడులో వినిపిస్తున్న మాటలేంటంటే.. విజయ్ రాజీనామా చేసే ఓ స్థానానికి త్రిష వెళతారని... చూడాలి మరి ఏం జరుగుతుందో.. అక్కడ అన్నీ ఊహించనివే అవుతున్నాయి కదా..

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Trisha Vijay Krishnan: TVK అంటే త్రిష విజయ్ కృష్ణనా..? దళపతి లక్కీచార్మ్‌ అంటూ ఫ్యాన్స్ పూనకాలు 
TVK అంటే త్రిష విజయ్ కృష్ణనా..? దళపతి లక్కీచార్మ్‌ అంటూ ఫ్యాన్స్ పూనకాలు 
7 Seater Cars For Families: పెద్ద కుటుంబాలకు ఈ 7 సీటర్ కార్లు బెస్ట్.. జాబితాలో Ertiga, Bolero మరింత ప్రత్యేకం
పెద్ద కుటుంబాలకు ఈ 7 సీటర్ కార్లు బెస్ట్.. జాబితాలో Ertiga, Bolero మరింత ప్రత్యేకం
ABP Desam Top 10, 11 May 2026: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Evening
ABP Desam Top 10, 11 May 2026: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Evening
CM Chandrababu Naidu Delhi Tour: ప్రధాని మోదీ ఏడు సూత్రాలు ఒక జాతీయ మిషన్ .. ప్రతి పౌరుడు భాగస్వామి కావాలి - సీఎం చంద్రబాబు పిలుపు
ప్రధాని మోదీ ఏడు సూత్రాలు ఒక జాతీయ మిషన్ .. ప్రతి పౌరుడు భాగస్వామి కావాలి - సీఎం చంద్రబాబు పిలుపు
Advertisement

వీడియోలు

Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్
MahuaMoitra: మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|
Pitapuram Politics: పిఠాపురం ఇన్‌చార్జ్ మార్పు.. కన్నీళ్లు ఆపుకోలేకపోయిన వర్మ... ప్రెస్‌మీట్‌లో ఎమోషనల్
Abhishek Sharma: అభిషేక్ శర్మ vs పంజాబ్: ఇది బ్యాటింగ్ కాదు.. తాండవం
Medchal Infant Kidnap: '50 CC కెమెరాలతో గంటల్లో పట్టుకున్న పోలీసులు.
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy on Bandi Sanjay Son Case: చట్టం ముందు ఎవరూ అధికులు కారు - మీడియా చిట్‌చాట్‌లో బండి సంజయ్ కుమారుడి కేసుపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
చట్టం ముందు ఎవరూ అధికులు కారు - మీడియా చిట్‌చాట్‌లో బండి సంజయ్ కుమారుడి కేసుపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
YSRCP Spokesperson Shyamala Response on Rumors: శ్యామలకు కౌంట్‌డౌన్ మొదలైందా? పొగ పెడుతున్న వారికీ యాంకర్ శ్యామల ఘాటు కౌంటర్!
శ్యామలకు కౌంట్‌డౌన్ మొదలైందా? పొగ పెడుతున్న వారికీ యాంకర్ శ్యామల ఘాటు కౌంటర్!
Petrol and Diesel Price Hike? ప్రధాని మోదీ మాటల వెనక అంతరార్థం అదేనా..! భారత్ పై మిడిల్ ఈస్ట్ సంక్షోభం తప్పదా! సామాన్యులపై భారీ భారం?
ప్రధాని మోదీ మాటల వెనక అంతరార్థం అదేనా..! భారత్ పై మిడిల్ ఈస్ట్ సంక్షోభం తప్పదా! సామాన్యులపై భారీ భారం?
IPL Fastest Centuries: ఐపీఎల్ చరిత్రలో ఫాస్టెస్ట్ సెంచరీలు బాదిన టాప్ 5 బ్యాటర్లు వీరే.. వైభవ్ వెరీ వెరీ స్పెషల్
IPL చరిత్రలో ఫాస్టెస్ట్ సెంచరీలు బాదిన టాప్ 5 బ్యాటర్లు వీరే.. వైభవ్ వెరీ వెరీ స్పెషల్
TN Minister S Keerthana: ఎమ్మెల్యేగా ప్రమాణం చేయకుండా మహిళా మంత్రికి అనుమతి నిరాకరణ.. నిరాశగా వెనుదిరిగిన కీర్తన
ఎమ్మెల్యేగా ప్రమాణం చేయకుండా మహిళా మంత్రికి అనుమతి నిరాకరణ.. Watch Video
Peddi Trailer : రామ్ చరణ్ మాస్ జాతర షురూ - పెద్ది ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్... ఇట్స్ అఫీషియల్
రామ్ చరణ్ మాస్ జాతర షురూ - పెద్ది ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్... ఇట్స్ అఫీషియల్
Barrierless Toll Plaza: టోల్ ప్లాజాల వద్ద ఇక ఆగక్కర్లేదు.. దేశంలో రెండో బారియర్ లెస్ టోల్ ప్రారంభం! కేంద్రం సరికొత్త అడుగు
టోల్ ప్లాజాల వద్ద ఇక ఆగక్కర్లేదు.. దేశంలో రెండో బారియర్ లెస్ టోల్ ప్రారంభం! కేంద్రం సరికొత్త అడుగు
Bandi Bhagirath POCSO Case: బండి సంజయ్ కుమారుడిపై పోక్సో కేసు.. తక్షణ విచారణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం
బండి సంజయ్ కుమారుడిపై పోక్సో కేసు.. తక్షణ విచారణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం
Embed widget