అన్వేషించండి

Trisha Krishnan Vijay : విజయ్‌‌కు సపోర్ట్‌గా త్రిష పోస్ట్! - వదినమ్మా అంటూ ఫ్యాన్స్ సందడి

Trisha Vote : ఓటు వేసిన తర్వాత హీరోయిన్ త్రిష చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. టీవీకే అధినేత, నటుడు విజయ్‌కు ఇండైరెక్ట్‌గా సపోర్ట్ చేసేలా పోస్ట్ ఉండడం హాట్ టాపిక్‌గా మారింది.

Trisha Supports TVK Vijay After Casting Her Vote Insta Post Gone Viral : తమిళనాడు ఎన్నికల్లో అందరి దృష్టి దళపతి విజయ్ టీవీకే పార్టీపైనే ఉంది. తొలిసారి ఎన్నికల బరిలో నిలవగా ఫలితం ఎలా ఉంటుందో అనే ఉత్కంఠ అటు ఇండస్ట్రీతో పాటు ఇటు పొలిటికల్ వర్గాల్లోనూ ఉంది. ఇదే టైంలో హీరోయిన్ త్రిష చేసిన తాజా ఇన్ స్టా పోస్ట్ వైరల్ అవుతోంది. 

విజయ్‌కు సపోర్ట్‌గా... 

త్రిష విజయ్‌ను పరోక్షంగా సపోర్ట్ చేసిన పోస్ట్‌పై ఇప్పుడు నెట్టింట చర్చ సాగుతోంది. గురువారం ఉదయం చెన్నైలోని అభిరామపురంలోని సెయింట్ ఫ్రావిన్స్ జేవియర్ మిడిల్ స్కూల్‌లో తన తల్లితో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు త్రిష. ఆ తర్వాత తన ఇన్ స్టాలో తన వేలికి ఉన్న సిరా చుక్కను చూపిస్తూ ఫోటో దిగారు. 

ఆ ఫోటోకు ఆమె పెట్టిన పాట ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. విజయ్‌తో కలిసి నటించిన బ్లాక్ బస్టర్ మూవీ 'గిల్లి'లోని 'అర్జునర్ విల్లు' అనే పాటను జత చేశారు. అందులో కేవలం వేలికి విజల్ గుర్తు వేసి ఆ ఈలలు వినిపించే పార్ట్ మాత్రమే యాడ్ చేశారు. టీవీకే విజయ్‌ను పరోక్షంగా సపోర్ట్ చేస్తున్నట్లే ఈ పోస్ట్ ఉండడంతో నెట్టింట కామెంట్స్ వెల్లువెత్తుతున్నాయి. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Trish (@trishakrishnan)

Also Read : ప్రకృతి ఒడిలో సెలబ్రిటీస్ - ఇండియాస్ ఫస్ట్ ట్రావెల్ బేస్డ్ టాక్ షో... ఎందులో స్ట్రీమింగ్ అంటే?

గత కొంతకాలంగా విజయ్, త్రిషల మధ్య రిలేషన్ షిప్ రూమర్స్ హల్చల్ చేస్తున్నాయి. ఓ నటితో వివాహేతర సంబంధం కారణంగానే తాను డివోర్స్ కోరుతున్నట్లు విజయ్ భార్య సంగీత కోర్టులో పిటిషన్ వేశారు. ఈ విడాకుల గొడవలు జరుగుతుండగానే విజయ్, త్రిష ఇద్దరూ ఓ పెళ్లిలో కలిసి కనిపించండం ఆ రూమర్స్‌కు మరింత బలం చేకూరినట్లయింది. ఆ తర్వాత విజయ్ ఎలక్షన్ క్యాంపెయిన్‌లో బిజీ అయిపోయారు.

వదినమ్మ అంటూ...

ఇప్పుడు తాజాగా... విజయ్‌ను సపోర్ట్ చేసేలా త్రిష పోస్ట్ ఉండడంతో ఫ్యాన్స్ సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. 'వదినమ్మ' అన్నకు సపోర్ట్ చేస్తున్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు. విజయ్, త్రిష ఇద్దరూ కలిసి హిట్ పెయిర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. 'గిల్లి', 'తిరుపాచ్చి', 'కురువి', 'లియో' వంటి సినిమాల్లో నటించారు. అయితే, రిలేషన్ షిప్ రూమర్స్, ఆ ప్రచారంపై ఇద్దరూ ఎప్పుడూ బహిరంగంగా నోరు మెదపలేదు. ప్రస్తుతం త్రిష చేసిన పోస్ట్ మాత్రం పెద్ద చర్చకే దారి తీసింది.

ఇక, తమిళనాడు ఎన్నికల్లో రికార్డు స్థాయిలో 82.24 శాతం పోలింగ్ నమోదైంది. టీవీకే అధినేత విజయ్ తిరుచిరాపల్లి ఈస్ట్, పెరంబూర్ నుంచి పోటీలో నిలిచారు. రజనీ కాంత్, కమల్ హాసన్, శ్రుతి హాసన్, విక్రమ్, విజయ్ సేతుపతి, ధ్రువ్ విక్రమ్, సుహాసిని మణిరత్నం, ఖుష్బూ తదితరులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మే 4న ఫలితాలు వెల్లడి కానున్నాయి.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Ayodhya Ram Mandir News: అయోధ్య రామ మందిరం విరాళాల కేసులో బిగ్ ట్విస్ట్ ! చంపత్ రాయ్, అనిల్ మిశ్రాలకు క్లీన్ చిట్!
అయోధ్య రామ మందిరం విరాళాల కేసులో బిగ్ ట్విస్ట్ ! చంపత్ రాయ్, అనిల్ మిశ్రాలకు క్లీన్ చిట్!
Tamil Nadu Politics Vijay: వ్యక్తిగత జీవితం వర్సెస్ పొలిటికల్ క్లీన్ ఇమేజ్ - త్రిష అంశం విజయ్ రాజకీయాన్ని మార్చేస్తుందా?
వ్యక్తిగత జీవితం వర్సెస్ పొలిటికల్ క్లీన్ ఇమేజ్ - త్రిష అంశం విజయ్ రాజకీయాన్ని మార్చేస్తుందా?
Breaking News: మార్కాపురం జిల్లాకు ‘చంద్రన్న మార్కాపురం జిల్లా’గా పేరు పెట్టాలని విజ్ఞప్తి
మార్కాపురం జిల్లాకు ‘చంద్రన్న మార్కాపురం జిల్లా’గా పేరు పెట్టాలని విజ్ఞప్తి
Nitin Nabin New Team: నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Peddi Sudarshan Reddy Wife Crying: నర్సంపేటలో అర్ధరాత్రి హైడ్రామా! మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు! కంటతడి పెట్టిన భార్య!
నర్సంపేటలో అర్ధరాత్రి హైడ్రామా! మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు! కంటతడి పెట్టిన భార్య!
KBR Park Traffic Rules:కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
Konaseema Fishermen Missing:కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
Vijay Son Jason Sanjay: గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
Irumudi Censor Review: 'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?
'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?
AP DSC Notification 2026: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
Telangana Political War: డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
Shiva Srishti Vyakaranam: మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
Embed widget