Thalapathy Vijay CM : సీఎంగా విజయ్ - స్పెషల్ అట్రాక్షన్‌గా సౌత్ క్వీన్ త్రిష... వీడియోస్ వైరల్
Trisha Krishnan : సౌత్ క్వీన్ త్రిష దళపతి విజయ్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Actress Trisha To Attend CM Vijay Oath Ceremony : తమిళనాడులో పొలిటికల్ సస్పెన్స్‌కు తెరపడింది. 108 స్థానాల్లో ఘన విజయం సాధించిన కోలీవుడ్ స్టార్, టీవీకే అధినేత విజయ్... ఇతర పార్టీల సపోర్ట్‌తో సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఏళ్ల చరిత్రను తిరగరాస్తూ అధికారాన్ని కైవసం చేసుకున్నారు. ఈ ఎన్నికల్లో విజయ్ పేరు ఎంత మార్మోగిందో అంత కంటే ఎక్కువగా హీరోయిన్ త్రిష పేరు కూడా మార్మోగింది.
విజయ్‌కు సపోర్ట్ చేయడం సహా ఎన్నికల ఫలితాల రోజు తిరుమల వెళ్లి స్వామిని దర్శించుకోవడం, ఆ తర్వాత నేరుగా విజయ్ ఇంటికే వెళ్లి శ్రీవారి ప్రసాదాన్ని అందజేశారు. దాదాపు గంటన్నర పాటు పలు అంశాలపై విజయ్, త్రిష చర్చించారు. దళపతి ఇంటి నుంచి బయటకు వచ్చిన త్రిష విక్టరీ సింబల్ చూపిస్తూ వెళ్లారు. ఈ వీడియోలు వైరలయ్యాయి.
సీఎంగా విజయ్... హాజరైన త్రిష
సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సౌత్ క్వీన్ త్రిష హాజరయ్యారు. నెహ్రూ స్టేడియంలో కార్యక్రమానికి హాజరైన ఆమె... సెంటరాఫ్ అట్రాక్షన్‌గా నిలిచారు. వేదిక ముందుకు వెళ్లిన ఆమె అక్కడికి వచ్చిన అభిమానులకు అభివాదం చేశారు. కుటుంబ సభ్యులతో ఆనందాన్ని షేర్ చేసుకున్నారు. సౌత్ క్వీన్ రాకతో ఆ ప్రాంగణమంతా సందడిగా మారింది. ప్రస్తుతం ఈ వీడియోస్ ట్రెండ్ అవుతున్నాయి.
Reporter :"big day for Tamil Nadu"#Trisha : "Thank you, looking forward"
— cinee worldd (@Cinee_Worldd) May 10, 2026
She is Attending #Vijay’s Swearing in Ceremony!! pic.twitter.com/l6Snj4MFQr
Trisha Krishnan warmly greets TVK chief #Vijay's sister and mother as she arrives at Jawaharlal Nehru Indoor Stadium for his swearing-in as Tamil Nadu CM. pic.twitter.com/HCqyzNdtFS
— cinee worldd (@Cinee_Worldd) May 10, 2026
Also Read : మదర్స్ డే స్పెషల్ - ఈ మూవీస్ డోంట్ మిస్... అమ్మ ప్రేమను కళ్లకు కట్టేలా...
విజయ్ కేబినెట్ ఇదే
తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారంతో పాటు మరో 9 మంది మంత్రులుగా కూడా ప్రమాణం చేశారు. వారిలో ఏడుగురు టీవీకే, ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిలో ఓ మహిళ కూడా ఉన్నారు. ఎన్ ఆనంద్, ఆదవ అర్జున, ఎస్ కీర్తన, కెఎ సెంగోటియన్, కెజి అరుణ్ రాజ్, పి వెంకటరమణన్, సీఆర్ నిర్మల్ కుమార్, రాజ్ మోహన్, టికె ప్రభు ప్రమాణ స్వీకారం చేశారు.
Also Read : రియల్ లైఫ్ అమ్మ... రీల్ లైఫ్ యాక్షన్ - ఈ స్టార్ హీరోయిన్స్ డెడికేషన్ వేరే లెవల్
Before You Go
MahuaMoitra: మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|
ట్రెండింగ్ వార్తలు






















