Vijay Family: పెళ్లాం బిడ్డలు రాలేదు కానీ..ఆవిడొచ్చింది...! విజయ్‌ను పిల్లలు కూడా దూరం పెట్టారా...?
Vijay Family: రెండు మూడు రోజుల డ్రామా తర్వాత మొత్తానికి తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణస్వీకారం పూర్తైంది. కానీ ఆ కార్యక్రమానికి ఆయన భార్యా బిడ్డలు హాజరుకాకపోవడం అనేది ఇప్పుడు హాట్ టాపిక్

Vijay Family Missing at Swaring-in: తమిళనాడు ముఖ్యమంత్రిగా.. విజయ్ ప్రమాణ స్వీకారం రెండు రోజులుగా మెయిన్‌స్ట్రీమ్ మీడియా న్యూస్. కానీ ఆ ప్రమాణ స్వీకారానికి ఆయన కుటుంబం హాజరుకాకపోవడం సోషల్ మీడియా న్యూస్. విజయ్ భార్య సంగీతా సోర్ణలింగం విజయ్‌తో డైవోర్స్ కు అప్లై చేసిన విషయం అందరికీ తెలిసిందే. వేరే మహిళతో కలిసి ఉంటూ తమ వివాహబంధాన్ని విచ్చిన్నం చేశాడని ఆరోపిస్తూ.. విజయ్ నుంచి విడాకులు కావాలని సంగీత ఈ ఫిభ్రవరిలో కోర్టులో పిటిషన్ వేశారు. దంపతులు విడిపోయినా ముఖ్యమైన సందర్భాల్లో కలవడం.. పిల్లల కోసం కొన్ని ఫంక్షన్లకు అటెండ్ అవ్వడం చూస్తూనే ఉంటాం.విడాకులకు అప్లై చేసినా ఇప్పటికీ ఆమె విజయ్ భార్యనే. విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రి అవ్వడం అన్నది అతి పెద్ద ముఖ్యమైన ఘటన. ఇలాంటి ప్రత్యేక సందర్భంలోనూ ఆమె ప్రమాణస్వీకారానికి రాలేదు. ఆమెనే కాదు వాళ్ల పిల్లలు జాసన్ సంజయ్ Jason Sanjay, దివ్వ సాషా Divya Saasha రాకపోవడం పెద్ద చర్చకు దారితీసింది.
వీళ్లు రాలేదు కానీ.. ఆవిడొచ్చింది.
వీళ్లు రాకపోవడం అన్న విషయం పక్కన పెడితే.. ఈ ప్రమాణ స్వీకారానికి మరొకరు రావడం కూడా పెద్ద వార్తగా నిలిచింది. విజయ్ కుటుంబ బంధం విచ్చిన్నం కావడానికి కారకురాలు అని ఆరోపణలు ఎదుర్కొంటున్న త్రిష కృష్ణన్ Trisha Kishnan అెటెండ్ అవ్వడం మరింత దుమారాన్ని రేపింది. విజయ్ ప్రమాణ స్వీకారం చేసిన నెహ్రూ స్టేడియానికి త్రిష అటెండ్ అయ్యారు. దీంతో మొత్తం ఫోకస్ అటువైపు వెళ్లింది.
ప్రమాణ స్వీకార కార్యక్రమానికి విజయ్ తల్లిదండ్రులు శోభా చంద్రశేఖర్, SA చంద్రశేఖర్, విజయ్ కజిన్స్ వచ్చారు. భార్యా బిడ్డలు కూడా వస్తే.. ఈ కార్యక్రమానికి నిండుదనం వచ్చి ఉండేదని కొంతమంది ఫ్యాన్స్ బాధపడ్డారు. ప్రమాణ స్వీకారం తర్వాత దీని గురించే చర్చ నడిచింది. విజయ్ కు వైఫ్ రాలేదు కానీ.. కావాలసిన వాళ్లు వచ్చారంటూ... రాజుకు రాణి వచ్చిందంటూ.. ఇలా రకరకాల కామెంట్లు సోషల్ మీడియాలో వచ్చాయి. అసలు ఇంకో విషయం విజయ్ భార్య, పిల్లలకు ఆహ్వానం వెళ్లిందా.. వాళ్లని అధికారికంగా ఆహ్వానించారా లేదా అన్న చర్చ కూడా ఉంది. వాళ్లని ఎవరు పిలిచారని వస్తారు అంటూ.. కొంతమంది కామెంట్ చేశారు.
Trisha sad becoz Vijay original family (wife son daughter) missing in d event🤔 pic.twitter.com/lACqOcxAPA
— Naveen (@Beams_Easy) May 11, 2026
పిల్లలు దూరమయ్యారా..?
కొన్ని నెలలుగా విజయ్ సంగీత మధ్య జరుగుతున్న వ్యవహారాలను చూస్తే.. ఆమె వస్తుందని పెద్దగా ఎవ్వరూ అనుకోలేదు. కానీ కనీసం పిల్లలు వస్తారు అని ఆశించినవారున్నారు. విజయ్ కుటుంబానికి దూరం కావడం పిల్లలకు నచ్చలేదని.. వారు కూడా ఆయన్ను ద్వేషిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే.. విజయ్ పిల్లలిద్దరూ పెద్దవారే. తండ్రి విజయం సాధించిన తర్వాత వాళ్లిద్దరూ కనీసం రెస్పాండ్ అవ్వలేదు. ఎన్నికల సమయంలోనూ తండ్రికి మద్దతుగా మాట్లాడలేదు. కనీసం రిజల్ట్స్ వచ్చాక కూడా శుభాకాంక్షలు తెలపలేదు. విజయ్ కుమారుడు సంజయ్.. తన తల్లి విజయ్‌కు నోటీసులు ఇచ్చిన తర్వాత సోషల్‌మీడియాలో తండ్రిని అన్ ఫాలో చేశాడు. తల్లి బాధకు విజయ్‌నే కారణం అనే భావన అతనిలో ఉందని ప్రచారం జరుగుతోంది.
Before You Go
MahuaMoitra: మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|
ట్రెండింగ్ వార్తలు






















