సిసోడియాను తలుచుకుని కన్నీళ్లు పెట్టుకున్న కేజ్రీవాల్, మిస్ అవుతున్నానంటూ భావోద్వేగం
Delhi liquor policy: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరెస్ట్ అయిన సిసోడియాను తలుచుకుని కేజ్రీవాల్ కన్నీళ్లు పెట్టుకున్నారు.
Delhi Liquor Policy Case:
కేజ్రీవాల్ భావోద్వేగం..
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కన్నీళ్లు పెట్టుకున్నారు. డిప్యుటీ సీఎం మనీశ్ సిసోడియాను తాను చాలా మిస్ అవుతున్నానంటూ భావోద్వేగానికి గురయ్యారు. ఓ పాఠశాల ప్రారంభోత్సవానికి హాజరైన కేజ్రీవాల్...ఢిల్లీలోని విద్యావ్యవస్థ గురించి మాట్లాడారు. ఈ సందర్భంగానే మనీశ్ సిసోడియాను తలుచుకున్నారు. విద్యార్థులందరికీ మెరుగైన విద్య అందించడానికి సిసోడియా చాలా తపన పడ్డారని, ఆయన తన పక్కన లేకపోవడం బాధగా ఉందని కన్నీటి పర్యంతమయ్యారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో లిక్కర్ స్కామ్ కేసులో సిసోడియా అరెస్ట్ అయ్యారు. అప్పటి నుంచి జైలు శిక్ష అనుభవిస్తున్నారు. బెయిల్ కోసం పిటిషన్‌లు పెట్టుకున్నా...ఊరట లభించడం లేదు. కీలక ఆధారాలు సేకరించేందుకు ప్రయత్నిస్తున్నా..సిసోడియా సహకరించడం లేదని ఈడీ అధికారులు ఆరోపిస్తున్నారు. కేజ్రీవాల్ ఈ ఆరోపణల్ని ఖండిస్తున్నారు. అవన్నీ తప్పుడు ఆరోపణలే అని కొట్టి పారేస్తున్నారు. ఈ క్రమంలోనే స్కూల్ ఓపెనింగ్‌కి వెళ్లిన ఆయన...సిసోడియాను తలుచుకున్నారు. మోదీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు.
"ఇవాళ సిసోడియా ఎందుకో బాగా గుర్తొస్తున్నారు. ఆయనపై తప్పుడు కేసులు పెట్టారు. అందరికీ మెరుగైన విద్య అందించాలన్నది ఆయన కల. కానీ ఆయననే టార్గెట్ చేస్తున్నారు. ఒకవేళ ఆయన విద్యార్థుల గురించి ఆలోచించకుండా ఉండి ఉంటే ఇవాళ జైలుకెళ్లాల్సిన దుస్థితి రాకపోయేది. ఢిల్లీలో విద్యా ఉద్యమాన్ని అణిచివేయాలని చూస్తున్నారు. కానీ అది జరగనివ్వం."
- అరవింద్ కేజ్రీవాల్, ఢిల్లీ ముఖ్యమంత్రి
#WATCH | Delhi CM Arvind Kejriwal gets emotional, as he remembers former education minister Manish Sisodia and his work in the area of education, at the inauguration of an educational institution pic.twitter.com/BDGSSbmpbq
— ANI (@ANI) June 7, 2023
బెయిల్ పిటిషన్ తిరస్కరణ..
ఢిల్లీ మద్యం కుంభకోణంలో జైలు శిక్ష అనుభవిస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. పిటిషన్ను కొట్టివేసిన కోర్టు మనీష్ సిసోడియాపై వచ్చిన ఆరోపణలు చాలా తీవ్రమైనవిగా పేర్కొంది. అయితే మనీష్ సిసోడియా మాత్రం ఢిల్లీ హైకోర్టు నిర్ణయానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నారు. మద్యం కుంభకోణానికి సంబంధించిన సీబీఐ కేసులో ఢిల్లీ హైకోర్టు ఈ మేరకు తీర్పు వెలువరించింది. వాస్తవానికి దిగువ కోర్టు నిర్ణయాన్ని ఆప్ నాయకుడు మనీష్ సిసోడియా సవాలు చేశారు. దానిపై ఢిల్లీ హైకోర్టు అతని పిటిషన్ను కొట్టివేసింది. సిసోడియా పిటిషన్ను తిరస్కరించిన కోర్టు సాక్ష్యాధారాలపై ఆందోళన వ్యక్తం చేసింది. ఈ విషయంలో మనీష్ సిసోడియా తీరు సరికాదని ధర్మాసనం పేర్కొంది. వారు సాక్ష్యాలను ప్రభావితం చేే అవకాశం ఉన్నందున బెయిల్ ఇవ్వడం లేదని వివరించింది. మనీష్ సిసోడియా మద్యం కుంభకోణం కేసులో నిందితుడుగా ఉన్నారు. గత విచారణలో మనీష్ సిసోడియాకు బెయిల్ మంజూరు చేయాలనే అభ్యర్థనను సీబీఐ వ్యతిరేకించింది.
Also Read: Temple Sealed: ఆలయంలోకి దళితుడు, అగ్రవర్ణాల ఆగ్రహం - ఇరువర్గాల ఘర్షణతో ఆలయానికి సీల్