Temple Sealed: ఆలయంలోకి దళితుడు, అగ్రవర్ణాల ఆగ్రహం - ఇరువర్గాల ఘర్షణతో ఆలయానికి సీల్
Temple Sealed: ఆలయంలోకి దళితుడు వచ్చాడని అగ్రవర్ణాలు అభ్యంతరం వ్యక్తం చేయడంతో వివాదం ముదిరి ఆలయం మూసేయాల్సి వచ్చింది.
Tamil Nadu Temple Sealed:
ద్రౌపది ఆలయానికి తాళం..
తమిళనాడులోని విల్లుపురంలో ద్రౌపది అమ్మన్ ఆలయాన్ని సీల్ చేయడం సంచలనమవుతోంది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచే ఊళ్లో గొడవలు జరుగుతున్నాయి. తమను గుడిలోకి రానివ్వకుండా అగ్రవర్ణాలు అడ్డుకుంటున్నాయని దళితులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు. రెండు వర్గాల మధ్య చాలా రోజులుగా వాగ్వాదం నడుస్తోంది. ఇవి రానురాను ముదిరాయి. పరిస్థితులు అదుపు తప్పేలా ఉన్నాయని భావించిన అధికారులు వెంటనే...ఆ ఆలయాన్ని సీల్ చేశారు. సమస్య పరిష్కారానికి కలిసి రావాలని అధికారులు ఎంత చెప్పినా ఇరు వర్గాలూ వెనక్కి తగ్గలేదు. ఏం చేయాలో తెలియక గుడినే మూసేశారు. Hindu Religious and Charitable Endowments కింద నడిచే ఈ ఆలయానికి తాళం వేసి సీల్ చేశారు. పోలీసులు చెబుతున్న వివరాల ఆధారంగా చూస్తే..ఈ ఏడాది ఏప్రిల్‌లో ఓ దళితుడు గుడికి వచ్చాడు. దీనిపై అగ్రవర్ణాలు భగ్గుమన్నాయి. దళితులెవ్వరూ గుడిలోకి రావడానికి వీల్లేదని తేల్చిచెప్పారు. అప్పుడు మొదలైన వివాదం...ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే ఈ ఘర్షణలపై 4 FIRలు నమోదు చేసిన పోలీసులు..శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అందులో భాగంగానే అధికారులు ఆలయాన్ని మూసేశారు. ఇప్పటికే కొంత మంది పోలీసులు గ్రామంలో మొహరించారు. కులంతో సంబంధం లేకుండా భక్తులందరూ గుడిలోకి వచ్చేలా అనుమతినివ్వాలని దళిత నేతలు స్థానిక కలెక్టర్‌కి మెమొరాండం ఇచ్చారు.
#WATCH | Tamil Nadu | Viluppuram District Revenue Commissioner Ravichandran orders to seal Dharmaraja Draupadi Amman Temple at Melpathi village over the issue between dominant caste members and Dalits, regarding entry to the temple.
— ANI (@ANI) June 7, 2023
An official notice pasted on the gates of the… pic.twitter.com/HxXSXHlBU9
అధికారం మాదే..
అగ్రవర్ణమైన వన్నియర్ కమ్యూనిటీ ప్రజలు దళితులు ఆలయంలోకి రానివ్వకుండా అడ్డుకుంటున్నారు. ఇది తమ "కుల దేవత" ఆలయమని, కేవలం తాము మాత్రమే పూజించేందుకు అధికారం ఉందని తేల్చి చెబుతున్నారు. అంతే కాదు. అసలు ఈ ఆలయానికి ఎండోమెంట్ డిపార్ట్‌మెంట్‌కి సంబంధమే లేదని వాదిస్తున్నారు. ప్రభుత్వం ఈ విషయంలో జోక్యం చేసుకోవడానికి వీల్లేదని హెచ్చరిస్తున్నారు. అటు ఎండోమెంట్ డిపార్ట్‌మెంట్ మాత్రం ఈ ఆలయం 45 ఏళ్లుగా తమ అధీనంలోనే ఉందని చెబుతోంది.
Also Read: Viral Video: బాలికను ఎత్తుకెళ్లిన యువకుడు, ఎడారిలో బలవంతంగా పెళ్లి - మహిళా కమిషన్ సీరియస్