By: Ram Manohar | Updated at : 07 Jun 2023 12:51 PM (IST)
రాజస్థాన్‌లో ఓ యువకుడు బాలికని బలవంతంగా ఎత్తుకెళ్లి పెళ్లి చేసుకున్న వీడియో వైరల్ అవుతోంది. (Image Credits: Twitter)
Viral Video:
రాజస్థాన్‌లో ఘటన..
రాజస్థాన్‌లో ఓ యువకుడు అమ్మాయిని బలవంతంగా పెళ్లి చేసుకున్న వీడియో వైరల్ అవుతోంది. ఇంటి నుంచి ఆ అమ్మాయిని లాక్కెళ్లాడు. ఎడారికి తీసుకెళ్లి అక్కడే పుల్లలన్నీ ఏరుకొచ్చి మంట పెట్టాడు. అదే హోమం అనుకుని దాని చుట్టూ తిరిగాడు. ఆ అమ్మాయిని ఎత్తుకున్నాడు. ఆ అమ్మాయి "వద్దు" అని గట్టిగా ఏడుస్తున్నా వినలేదు. ఈ తంతునంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వెంటనే వైరల్ అయిపోయింది. అప్పటి నుంచి తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి. రాజస్థాన్‌లోని జైసల్మేర్ ప్రాంతంలో జరిగిందీ ఘటన. ఆప్ నేత నరేశ్ బల్యాన్ ఈ వీడియోని పోస్ట్ చేశారు. "ఇప్పటి వరకూ ఎందుకు శిక్షించలేదు" అని విమర్శించారు. ఆప్ నేతలు చెబుతున్న వివరాల ప్రకారం...జైసల్మేర్‌లోని ఓ గ్రామానికి చెందిన బాలికను జూన్ 1వ తేదీన 15-20 మంది వచ్చి కుటుంబ సభ్యుల్ని బెదిరించి ఎత్తుకెళ్లిపోయారు. "సీఎం అశోక్ గహ్లోట్ ఇలాంటి వాళ్లను కఠినంగా శిక్షించాల్సిందే" అని ఆప్ డిమాండ్ చేస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో పరిస్థితులు ఇంత దారుణంగా ఉన్నాయని విమర్శించింది. ఎన్నాళ్లు అమ్మాయిలు ఇలా భయపడుతూ బతకాలని ప్రశ్నించింది. అయితే...గహ్లోట్ ప్రభుత్వం ఇటీవలే ఓ నిర్ణయం తీసుకుంది. గత నెల దాదాపు అన్ని జిల్లాల్లో నాన్ వయలెన్స్ సెల్స్ (Non Violence Cells)ని ఏర్పాటు చేసింది. దేశంలో ఎక్కడా లేని విధంగా ఈ విభాగాన్ని అందుబాటులోకి తీసుకొచ్చామని గహ్లోట్ వెల్లడించారు. ఆ తరవాతే ఈ ఘటన జరగడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
कुख्यात कांग्रेस कुशासन में जंगलराज कायम!
जैसलमेर में युवती का सरेआम अपहरण कर बंजर वीराने में उसके साथ जबरदस्ती शादी कर ली जाती है। ना कोई पुलिस आई, ना गिरफ्तारी हुई? सत्ता के संरक्षण में ऐसी घटनाओं से राजस्थान शर्मसार है! इन सब पर कब लगाम लगेगी ? कब तक हमारी बहन-बेटियां डर के… https://t.co/aIecGx7e6L pic.twitter.com/4h3omNXgOl— Col Rajyavardhan Rathore (@Ra_THORe) June 6, 2023
ఈ ఘటనపై ఢిల్లీ మహిళా కమిషన్ తీవ్రంగా స్పందించింది. DCW చీఫ్ స్వాతి మలివాల్ దీనిపై అసహనం వ్యక్తం చేశారు. చాలా షాకింగ్‌గా ఉందని మండి పడ్డారు. అందరూ చూస్తుండగానే కిడ్నాప్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
"ఈ వీడియో చూడగానే షాక్‌కి గురయ్యాను. అందరూ చూస్తుండగానే ఆ బాలికను కిడ్నాప్ చేసి తీసుకెళ్లిపోయారు. ఎవరూ లేని ఎడారి ప్రాంతానికి తీసుకెల్లి బలవంతంగా పెళ్లి చేసుకున్నారు. అత్యంత దారుణమైన ఘటన ఇది. అశోక్ గహ్లోట్ జీ..దీనిపై విచారణ జరపండి"
- స్వాతి మలివాల్, ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్
मीडिया द्वारा ये वीडियो जैसलमेर का बताया जा रहा है। रिपोर्ट्स के अनुसार एक लड़की को सरेआम किडनैप करके एक बंजर वीराने में आग जलाकर उसके साथ ज़बरदस्ती शादी कर ली। ये बेहद चौंकाने वाली और डराने वाली घटना है। @AshokGehlot51 जी मामले की जाँच कर कार्यवाही करें। pic.twitter.com/mZee4oJgSy
— Swati Maliwal (@SwatiJaiHind) June 6, 2023
Top Headlines Today: నేడు బాబుకు మద్దతుగా ఐటీ ఉద్యోగుల ర్యాలీ; తెలంగాణలో ఎన్నికల హడావుడి ఎందుకు లేదు? - నేటి టాప్ న్యూస్
ICG Recruitment: ఇండియన్ కోస్ట్ గార్డు ఉద్యోగాల దరఖాస్తు గడువు పొడిగింపు, చివరితేది ఎప్పుడంటే?
IFFCO Notification: ఇఫ్‌కోలో అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్ ట్రైనీ పోస్టులు, ఈ అర్హతలుంటే చాలు
One Nation One Election: కోవింద్ అధ్యక్షతన తొలి భేటీ- పార్టీలు, లా కమిషన్ సూచనలు ఆహ్వానించనున్న ప్యానెల్
అవయవ దానం చేస్తే ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు, స్టాలిన్ సంచలన నిర్ణయం
BRS Leaders For Chandrababu : చంద్రబాబుకు తెలంగాణ బీఆర్ఎస్ నేతల సపోర్ట్ - జగన్ పై విమర్శలు ! రాజకీయం ఉందా ?
Chandrababu Arrest : విశాఖలో టీడీపీ కొవొత్తుల ర్యాలీని అడ్డుకున్న పోలీసులు, పలువురి అరెస్ట్ తో ఉద్రిక్తత
Sintex: తెలంగాణలో రూ.350 కోట్లతో సింటెక్స్ తయారీ యూనిట్, 1000 మందికి ఉద్యోగాలు
కాంగ్రెస్ లో ఉంటే, ఏ పదవీ లేకపోయినా గౌరవంగా బతకొచ్చు: పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి
/body>