Venkaiah Naidu : మనవరాలి స్నాతకోత్సవానికి హాజరైన ఉపరాష్ట్రపతి వెంకయ్య
ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తన మనవరాలి స్నాతకోత్సవానికి హాజరయ్యారు. సాధారణ వ్యక్తిలా.. విద్యార్థుల కుటంబ సభ్యులతోపాటు వేదిక కింద కూర్చున్నారు.
తన మనవరాలి స్నాతకోత్సవానికి హాజరయ్యారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాడు దంపతులు. శనివారం నోయిడాలోని అమిటీ విశ్వవిద్యాలయంలో తన కుమార్తె దీపావెంకట్ కూతురైన ఇమ్మణ్ని సుష్మ చౌదరి స్నాతకోత్సవాన్ని వేదికపై నుంచి కాకుండా ఇతర విద్యార్థుల కుటుంబసభ్యుల్లాగే వేదిక కిందే కూర్చుని తిలకించారు. నిజాయితీగా ఉంటూ.. ఇతరులపట్ల సత్ప్రవర్తన కనబర్చినందుకు వెంకయ్య మనవరాలికి శ్రీ బల్జిత్ శాస్త్రి అవార్డును అందుకున్నారు. ఉపరాష్ట్రపతి దంపతులు చప్పట్లతో అభినందించారు.
అనంతరం విశ్వవిద్యాలయ అధికారుల విజ్ఞప్తి మేరకు.. స్నాతకోత్సవానికి హాజరైన విద్యార్థులు, అధ్యాపకులను ఉద్దేశించి మాట్లాడారు. తన మనవరాలు డిగ్రీతోపాటు అవార్డును అందుకోవడం తనకెంతో ఆనందంగా ఉందన్నారు. సమాజంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావడం విద్య ద్వారానే సాధ్యమవుతుందని ఉపరాష్ట్రపతి అన్నారు. భారతదేశం విశ్వగురుగా ప్రపంచానికి దిశానిర్దేశం చేసిన విషయాన్ని గుర్తుచేస్తూ.. కాలానుగుణంగా జరిగిన దండయాత్రలు, దురాక్రమణల అనంతరం అదే వలసవాద ధోరణిని మనవాళ్లు కూడా అలవర్చుకున్నారని అన్నారు. బలమైన, సమృద్ధితో కూడిన ఆనందకరమైన భారతదేశ నిర్మాణానికి నేటి యువతరం సిద్ధం కావాలని ఉపరాష్ట్రపతి ఆకాంక్షించారు.
భారతదేశాన్ని మరోసారి విశ్వగురు చేయాల్సిన బాధ్యత ప్రతి భారతీయుడిపైనా ఉందన్న ఉపరాష్ట్రపతి ఇందుకోసం మన విద్యావిధానమే మరొకమారు క్రియాశీలకంగా మారాల్సిన అవసరం ఉందన్నారు. నూతన జాతీయ విద్యావిధానం–2020ని ఓ దార్శనిక పత్రంగా అభివర్ణించిన ఉపరాష్ట్రపతి.. ఈ విధానం భారతీయ విద్యావ్యవస్థలో సానుకూల మార్పులు తీసుకొస్తుందని అన్నారు.
విద్యార్థులు ఉన్నతమైన కలలను కనడంతోపాటు వాటి సాకారానికి అహోరాత్రులు శ్రమించాలని ఉపరాష్ట్రపతి సూచించారు. భారతదేశ భవిష్యత్ యువత చేతుల్లోనే ఉందని.. అలాంటి యువత తమ బాధ్యతలను గుర్తుంచుకుని వ్యవహరిస్తే వీలైనంత త్వరగా ‘ఆత్మనిర్భర భారత’ నిర్మాణం సాధ్యం అవుతుందన్నారు.
Also Read: Pakistan: కరాచీలోని ప్రైవేట్ బ్యాంక్ లో భారీ పేలుడు... 12 మంది మృతి, మరో 11 మందికి గాయాలు
Also Read: Marriage: పెళ్లిలో రూ.10 లక్షలు డిమాండ్ చేసిన వరుడు.. వీపు విమానం మోత మోగించిన వధువు కుటుంబం
Also Read: ఆ ఇద్దరు స్టాండప్ కమెడియన్లకు కేటీఆర్ ఆఫర్ ! బెంగళూరు గాలి తీసేశారుగా !?
Also Read: Omicron Cases: తెలంగాణలో విస్తరిస్తోన్న ఒమిక్రాన్... కొత్తగా 12 కేసులు
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి