News
News
వీడియోలు ఆటలు
X

Sukesh Letter BRS : బీఆర్ఎస్ కు రూ.75 కోట్లు ఇచ్చా, కలకలం రేపుతున్న సుఖేష్ చంద్రశేఖర్ లేఖ

Sukesh Letter BRS : తీహార్ జైలులో ఉన్న సుఖేష్ చంద్రశేఖర్ సంచలన లేఖ రాశారు. కేజ్రీవాల్ చెప్పినట్లు బీఆర్ఎస్ కు రూ.75 కోట్లు ఇచ్చానని సుఖేష్ లేఖలో తెలిపారు.

FOLLOW US: 
Share:

Sukesh Letter BRS : బీఆర్ఎస్ కు రూ.75 కోట్లు ఇచ్చానని సుఖేష్ చంద్రశేఖర్ లేఖ రాశారు. మనీలాండరింగ్ కేసులో అరెస్టై తీహార్ జైలులో ఉన్న సుఖేష్ చంద్రశేఖర్ సంచలన లేఖ రాశారు. దిల్లీ సీఎం కేజ్రీవాల్ చెప్పినట్లు బీఆర్ఎస్ కు రూ.15 కోట్లు చొప్పున ఐదుసార్లు రూ.75 కోట్లు ఇచ్చానని లేఖలో తెలిపారు. బీఆర్ఎస్ ఆఫీస్ వద్ద పార్క్ చేసిన రేంజ్ రోవర్ కారులో ఉన్న వ్యక్తికి రూ.15 కోట్లు ఇచ్చానని లేఖలో తెలిపారు.  ఈ లేఖ కలకలం రేగుతోంది. త్వరలోనే కేజ్రీవాల్ తో మాట్లాడిన వాట్సాప్ చాట్ బయటపెడతానని సుఖేష్ అన్నారు. త్వరలోనే మరిన్ని అక్రమాలు బయటపెడతానన్నారు. 

2020లో బీఆర్ఎస్ ఆఫీస్ వద్దకు వచ్చి రేంజ్ రోవర్ కారులో ఉన్న ఏపీ అనే వ్యక్తికి రూ.15 కోట్లు ఇచ్చినట్లు సుఖేష్ లేఖలో తెలిపారు. కేజ్రీవాల్ టార్గెట్ గా మరోసారి సుఖేష్ తీవ్ర ఆరోపణలు చేశారు. కేజ్రీవాల్, సత్యేంద్రజైన్ చెప్పినట్లు చెప్పినట్లు డబ్బులు చెల్లించినట్లు చెప్పారు. వారంలో కేజ్రీవాల్ తో చేసిన వాట్సాప్ చాటింగ్ విషయాలు బయటకు వస్తాయన్నారు. చాటింగ్ లో కోడ్ పదాలు వాడారన్నారు. 15 కేజీల నెయ్యి పేరిట రూ.15 కోట్లు తరలించానన్నారు. కేజ్రీవాల్ అవినీతి, అక్రమాలు అన్నీ బయటపెడతానని సుఖేష్ అన్నారు. 

దిల్లీ అరవింద్ కేజ్రీవాల్‌తో తాను చేసిన మొత్తం 700 పేజీల వాట్సాప్, టెలిగ్రామ్ చాట్‌లు చేశానని సుఖేష్ చంద్రశేఖర్ లేఖలో తెలిపారు. కేజ్రీవాల్‌కు 75 కోట్లు డెలివరీ చేసినట్లుగా సుఖేష్ తన లాయర్ ద్వారా ఒక లేఖను విడుదల చేశారు. కేజ్రీవాల్ నేను మీకు 2020కి సంబంధించిన చాట్ ట్రైలర్‌ను చూపించబోతున్నానని లేఖలో రాశారు. మిస్టర్ జైన్ సెట్ చేసిన 15 కిలోల నెయ్యి కోడ్, నేను వ్యక్తిగతంగా డెలివరీ చేశానని, మీ తరపున 15 కోట్ల రూపాయలు చెల్లించానని సుఖేష్ అన్నారు. టీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయం వద్ద మద్యం కేసు నిందితుల్లో ఒకరికి ఈ నగదు ఇచ్చినట్లు తెలిపారు. ఈ 15 కిలోల నెయ్యి హైదరాబాద్‌లో చేరవేయాలని కేజ్రీవాల్ కోరినట్లు లేఖలో సుఖేశ్ ఆరోపించారు. ఇప్పటికే 5 నెయ్యి కేసులు హైదరాబాద్‌కు పంపించినట్లుగా చెప్పారు. హైదారబాద్‌కు మొత్తం రూ.75 కోట్లు చేరవేశామని పేర్కొన్నారు.  ఇటీవల సుఖేష్ చంద్రశేఖర్ ను కోర్టులో హాజరుపరిచినప్పుడు కేజ్రీవాల్ కౌంట్‌డౌన్ స్టార్ట్ అయిందని, ఆయన త్వరలో తీహార్ క్లబ్‌లో వస్తారని జోస్యం చెప్పారు.  

Published at : 31 Mar 2023 09:30 PM (IST) Tags: BRS Kejriwal Tihar Jail Letter Sukesh Chandrasekhar

సంబంధిత కథనాలు

GRE New Pattern: జీఆర్‌ఈ ఇకపై రెండు గంటలే, సిలబస్‌లోనూ పలు మార్పులు!

GRE New Pattern: జీఆర్‌ఈ ఇకపై రెండు గంటలే, సిలబస్‌లోనూ పలు మార్పులు!

NCHM JEE: ఎన్‌సీహెచ్‌ఎం జేఈఈ-2023 ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!

NCHM JEE: ఎన్‌సీహెచ్‌ఎం జేఈఈ-2023 ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!

Odisha Train Accident: ఒడిశాలో మరో రైలు విషాదం, బోగీల కింద నలిగి ఆరుగురు మృతి!

Odisha Train Accident: ఒడిశాలో మరో రైలు విషాదం, బోగీల కింద నలిగి ఆరుగురు మృతి!

Maharashtra Clash: మహారాష్ట్ర కొల్హాపూర్‌లో ఇరువర్గాల ఘర్షణ, పోలీసుల లాఠీఛార్జీ

Maharashtra Clash: మహారాష్ట్ర కొల్హాపూర్‌లో ఇరువర్గాల ఘర్షణ,  పోలీసుల లాఠీఛార్జీ

Union Cabinet Decisions: రైతులకు కేంద్రం గుడ్ న్యూస్, పంటలకు మద్దతు ధర పెంపు- BSNLను కాపాడేందుకు మెగా ప్యాకేజ్

Union Cabinet Decisions: రైతులకు కేంద్రం గుడ్ న్యూస్, పంటలకు మద్దతు ధర పెంపు- BSNLను కాపాడేందుకు మెగా ప్యాకేజ్

టాప్ స్టోరీస్

తెలంగాణ రాజకీయాల్లో ‘ధరణి’ దుమారం- తగ్గేదేలే అంటున్న అధికార, ప్రతిపక్ష పార్టీలు!

తెలంగాణ రాజకీయాల్లో ‘ధరణి’ దుమారం- తగ్గేదేలే అంటున్న అధికార, ప్రతిపక్ష పార్టీలు!

YS Viveka Case : వివేకా లెటర్‌కు నిన్ హైడ్రిన్ టెస్టుకు ఓకే - కోర్టు అనుమతి

YS Viveka Case :  వివేకా లెటర్‌కు నిన్ హైడ్రిన్ టెస్టుకు ఓకే - కోర్టు అనుమతి

Dimple Hayathi Case: అరెస్ట్ చేయవద్దని నటి డింపుల్‌ హయతి పిటిషన్, హైకోర్టు ఏం చెప్పిందంటే!

Dimple Hayathi Case: అరెస్ట్ చేయవద్దని నటి డింపుల్‌ హయతి పిటిషన్, హైకోర్టు ఏం చెప్పిందంటే!

10,000 టికెట్లు ఫ్రీ, ‘ఆదిపురుష్’ నిర్మాత కీలక నిర్ణయం - కేవలం వాళ్లకు మాత్రమే!

10,000 టికెట్లు ఫ్రీ, ‘ఆదిపురుష్’ నిర్మాత కీలక నిర్ణయం - కేవలం వాళ్లకు మాత్రమే!