అన్వేషించండి

Ratan Tata Family Tree: టాటా ఫ్యామిలీ ట్రీ గురించి తెలుసా? నసర్వాన్‌జీ టాటా నుంచి నేటి తరం వరకు ఎవరేం చేశారంటే?

Ratan Tata: టాటా గ్రూప్‌లో మనకు కనిపించేది రతన్ టాటా మాత్రమే. కానీ అదే ఫ్యామిలీకి చెందిన మరికొందరు ఈ సంస్థ ప్రగతిలో భాగస్వాములై ఉన్నారు. టాటా గ్రూప్‌ ఫ్యామిలీ ట్రీ గురించి ఇక్కడ చూడండి.

Tata Family Tree: దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే అతిపెద్ద సంస్థల్లో టాటా గ్రూప్ ఒకటి. దీనికి పెద్ద దిక్కుగా ఉన్న రతన్ టాటా రాత్రి కన్నుమూశారు. దీంతో టాటా గ్రూప్‌ మాత్రమే కాకుండా దేశం కూడా ఓ మహోన్నతమైన వ్యక్తిని కోల్పోయింది 86 ఏళ్ల రతన్ టాటా అనారోగ్య సమస్యలతో ముంబైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. రతన్ టాటా అంత్యక్రియలు ముంబైలోని నేషనల్‌ సెంటర్ ఫర్ ఫెర్ఫార్మింగ్ ఆర్ట్స్‌ వద్ద కాసేపట్లో జరగనున్నాయి. 

రతన్ టాటా ఒక్క వ్యాపారవేత్తంగానే కాకుండా సేవతత్పరతో చాలా దేశ ప్రజల మన్ననలు పొందుతున్నారు. ఆయన తెలివితేటలు, కృషి పట్టుదలతో టాటా గ్రూప్‌ను ప్రపంచస్థాయి వ్యాపార సంస్థగా మార్చారు. సామాన్యుల కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టి వారి మనస్సులో చెరగని ముద్రవేసుకున్నారు. 

ఇంతటి ఘతన సాధించిన రతన్ టాటా కుటుంబం గురించి చాలా కొద్దిమందికే తెలిసి ఉంటుంది. రతన్ టాటా మినహా మిగిలిన వారంతా చాలా సింపుల్‌గా వారి విషయాలు ఎవరికి తెలియకుండానే జీవిస్తుంటారు. కానీ రతన్ టాటా ఫ్యామిలీ అంత చిన్నదేమీ కాదు. చాలా పెద్దది. రతన్ టాటా తండ్రి పేరు నావెల్ టాటా. ఆయనను రతన్‌జీ టాటా దత్తత తీసుకున్నారు. టాటా గ్రూప్ సంస్థలు స్థాపించిన జెమ్‌షెడ్‌జీ టాటా కుమారుడే ఈ రతన్‌జీ టాటా. 

నసర్వాన్‌జీ టాటా
నసర్వాన్‌జీ టాటాను టాటా కుటుంబానికి మూలపురుషుడిగా చెబుతారు.  టాటా వంశం ఆయన నుంచే ప్రారంభమవుతుందని చెబుతారు. నసర్వాన్‌జీ టాటా ఒక పార్సీ పూజారి. వ్యాపార రంగంలోకి అడుగుపెట్టిన మొదటి సభ్యుడు కూడా ఆయనే. అక్కడి నుంచే టాటా కుటుంబం వ్యాపారం మొదలైంది. 

జంషెడ్‌జీ టాటా 
నసర్వాన్‌జీ టాటా కుమారుడే జంషెడ్‌జీ టాటా. ఆయనే టాటా గ్రూప్‌ను  స్థాపించారు. గుజరాత్‌లోని నవ్‌సారిలో ఉండే జంషెడ్‌జీ ముంబై రావడంతో దశ తిరిగింది. 1868లో టాటా గ్రూప్‌ను ట్రేడింగ్ కంపెనీగా స్టార్ట్ చేశారు. 29 ఏళ్ల వయస్సులో 21,000 రూపాయల పెట్టుబడితో ఈ కంపెనీ ప్రారంభించారు. తర్వాత టాటా గ్రూప్ షిప్పింగ్‌లో అడుగు పెట్టింది. 1869 నాటికి వస్త్ర వ్యాపారంలోకి కూడా కాలుమోపారు. ఇలా ఒక్కొక్క వ్యాపారం ప్రారంభించి పెద్ద జంషెడ్జీని భారతీయ పరిశ్రమ పితామహుడిగా పిలుస్తారు. స్టీల్, హోటల్ (తాజ్ మహల్ హోటల్), హైడ్రోపవర్ ఇలా చాలా కంపెనీలను స్టార్ట్ చేశారు. 

దొరాబ్జీ టాటా
జంషెడ్జీ టాటా పెద్ద కుమారుడే దొరాబ్జీ టాటా. టాటా స్టీల్, టాటా పవర్ వంటి కంపెనీల ఏర్పాటు ప్రగతిలో కీలక పాత్ర పోషించారు. జంషెడ్జీ తర్వాత టాటా గ్రూప్‌కు సారథ్యం వహించారు. 

రతన్ జీ టాటా
దొరాబ్జీ, జంషెడ్జీ సోదరుడే రతన్‌జీ టాటా. వస్త్ర వ్యాపారాల్లో ప్రత్యేక గుర్తింపు సాధించారు. వాటితోపాటు టాటా గ్రూప్‌లోని ఇతర వ్యాపారాల  అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు.

JRD టాటా
రతన్‌జీ టాటా కుమారుడు JRD టాటా. పూర్తి పేరు జహంగీర్ రతన్‌జీ దాదాభాయ్ టాటా. JRD టాటా తల్లి ఫ్రెంచ్ మహిళ. ఆమె పేరు సుజానే బ్రియర్. JRD టాటా భారతదేశపు మొదటి కమర్షియల్ పైలెట్‌గా కుర్తింపు పొందారు. JRD టాటా 50 సంవత్సరాలకుపైగా (1938-1991) టాటా గ్రూప్‌కు ఛైర్మన్‌గా ఉన్నారు. పైలెట్ అయిన JRD టాటా విమానయాన సంస్థలు స్థాపించారు. తర్వాత దానిని ప్రభుత్వం జాతీయం చేసుకొని ఎయిర్ ఇండియాగా పేరు మార్చారు. ఇప్పుడు మళ్లీ నష్టాల్లో ఉన్న ఎయిర్ ఇండియాను టాటా వాల్లే కొనుకున్నారు. టాటా గ్రూప్‌ను మల్టీ నేషనల్ కంపెనీగా మార్చడంలో JRD టాటా పాత్ర చాలా ముఖ్యమైంది. 

నావల్ టాటా
రతన్‌జీ టాటా దత్తపుత్రుడే నావల్ టాటా. టాటా గ్రూప్‌నకు ప్రత్యేక గుర్తింపు తెచ్చారు. టాటా గ్రూప్‌ను అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషించారు. 

రతన్ నావల్ టాటా
రతన్ టాటా 8 డిసెంబర్ 1937న జన్మించారు. తండ్రి పేరు నావల్ టాటా తల్లి పేరు సునీ టాటా. 1991 నుండి 2012 వరకు టాటా గ్రూప్‌కు ఛైర్మన్‌గా ఉన్నారు. అక్టోబర్ 2016 నుంచి ఫిబ్రవరి 2017 వరకు తాత్కాలిక ఛైర్మన్‌గా పని చేశారు. 2017 నుంచి టాటా గ్రూప్ ఛారిటబుల్ ట్రస్ట్‌ అధిపతిగా ఉన్నారు. రతన్ టాటా టాటా గ్రూప్‌ను అంతర్జాతీయ బ్రాండ్‌గా మార్చింది ఈయనే. JRD టాటా ప్రారంభించిన ఎయిర్ ఇండియాను ప్రభుత్వం నుంచి కొనుగోలు చేశారు. 

ఫోర్డ్ లగ్జరీ కార్ బ్రాండ్లు ల్యాండ్ రోవర్, జాగ్వార్‌ను టాటా అకౌంట్‌లో వేయడంలో రతన్ టాటాదే ప్రధాన పాత్ర. 2008లో రతన్ టాటాకు దేశ రెండో అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్ లభించింది. 2000లో పద్మభూషణ్‌ వరించింది. 

జిమ్మీ టాటా
జిమ్మీ టాటా రతన్ టాటా సవతి సోదరుడు. ఆయన కూడా బ్రహ్మచారి. ఆయన ఎప్పుడూ మిడియాకు దూరంగా ఉంటారు. జిమ్మీ టాటా కూడా వివిధ టాటా సంస్థల్లో పని చేసి 90వ దశకంలో పదవీ విరమణ చేశారు. టాటా సన్స్, అనేక ఇతర టాటా కంపెనీల్లో వాటాదారుగా ఉన్నారు. ఆయన మొబైల్ ఫోన్‌ వాడరట. వార్తాపత్రికలు చదివి మాత్రమే అప్‌డేట్ అవుతుంటారు. 

నోయెల్ టాటా
నోయల్ టాటా రతన్ టాటాకు సవతి సోదరుడు. నోయెల్ టాటా 1957లో జన్మించారు. అతను టాటా ఇంటర్నేషనల్ చైర్మన్ ఇతర టాటా గ్రూప్ కంపెనీల్లో భాగస్వామి కూడా. 

రతన్ టాటా తర్వాత ఎవరు?
నోయెల్ టాటా ఆలూ మిస్త్రీని వివాహం చేసుకున్నారు. వీళ్లకు నెవిల్లే, లియా, మాయా టాటా అనే ముగ్గురు పిల్లలు ఉన్నారు. కిర్లోస్కర్ గ్రూప్ సభ్యురాలు మానసి కిర్లోస్కర్‌ను నెవిల్ వివాహం చేసుకున్నారు. వీళ్లంతా టాటా గ్రూప్ వ్యాపారాల్లో పని చేస్తున్నారు. ఇప్పుడు వీళ్లలో ఎవరు టాటా గ్రూప్‌ బాధ్యతలు తీసుకుంటారు వారసులు ఎవరనే చర్చ జరుగుతోంది. 

Also Read: అవినీతిపై బిలియనీర్‌ అడిగిన ప్రశ్నకు నవ్వుతూనే దిమ్మదిరిగే సమాధానం చెప్పిన రతన్ టాటా

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Ratan Tata: రతనా టాటా పార్థీవ దేహానికి సీఎం చంద్రబాబు, నారా లోకేశ్ నివాళి
రతనా టాటా పార్థీవ దేహానికి సీఎం చంద్రబాబు, నారా లోకేశ్ నివాళి
KTR: మంత్రి కొండా సురేఖపై కేటీఆర్ పరువు నష్టం దావా - క్రిమినల్ చర్యలు తీసుకోవాలని పిటిషన్
మంత్రి కొండా సురేఖపై కేటీఆర్ పరువు నష్టం దావా - క్రిమినల్ చర్యలు తీసుకోవాలని పిటిషన్
Andhra BJP : ఇద్దరు గుంటూరు బీజేపీ నేతల నీలి పనులు - రేపోమాపో పార్టీ నుంచి సస్పెండ్ ?
ఇద్దరు గుంటూరు బీజేపీ నేతల నీలి పనులు - రేపోమాపో పార్టీ నుంచి సస్పెండ్ ?
Rafael Nadal Retirement: రిటైర్మెంట్ ప్రకటించిన స్పెయిన్ బుల్ - టెన్నిస్‌లో ముగిసిన ఒక శకం
రిటైర్మెంట్ ప్రకటించిన స్పెయిన్ బుల్ - టెన్నిస్‌లో ముగిసిన ఒక శకం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ratan Tata News: అంత పెద్ద రతన్ టాటాకు చిన్న కుర్రాడే బెస్ట్ ఫ్రెండ్Ratan Tata: రతన్ టాటా మృతిపై స్పందించిన మాజీ గర్ల్‌ ఫ్రెండ్Ratan Tata Last Post: సోషల్ మీడియాలో రతన్ టాటా లాస్ట్ పోస్ట్ ఇదేRatan Tata News: మధ్యతరగతి వాడి కోసం ఆలోచించిన ఏకైక వ్యాపారవేత్త రతన్ టాటా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ratan Tata: రతనా టాటా పార్థీవ దేహానికి సీఎం చంద్రబాబు, నారా లోకేశ్ నివాళి
రతనా టాటా పార్థీవ దేహానికి సీఎం చంద్రబాబు, నారా లోకేశ్ నివాళి
KTR: మంత్రి కొండా సురేఖపై కేటీఆర్ పరువు నష్టం దావా - క్రిమినల్ చర్యలు తీసుకోవాలని పిటిషన్
మంత్రి కొండా సురేఖపై కేటీఆర్ పరువు నష్టం దావా - క్రిమినల్ చర్యలు తీసుకోవాలని పిటిషన్
Andhra BJP : ఇద్దరు గుంటూరు బీజేపీ నేతల నీలి పనులు - రేపోమాపో పార్టీ నుంచి సస్పెండ్ ?
ఇద్దరు గుంటూరు బీజేపీ నేతల నీలి పనులు - రేపోమాపో పార్టీ నుంచి సస్పెండ్ ?
Rafael Nadal Retirement: రిటైర్మెంట్ ప్రకటించిన స్పెయిన్ బుల్ - టెన్నిస్‌లో ముగిసిన ఒక శకం
రిటైర్మెంట్ ప్రకటించిన స్పెయిన్ బుల్ - టెన్నిస్‌లో ముగిసిన ఒక శకం
Hyderabad: తెలంగాణలో సద్దుల బతుకమ్మ సంబరాలు - ట్యాంక్ బండ్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు
తెలంగాణలో సద్దుల బతుకమ్మ సంబరాలు - ట్యాంక్ బండ్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు
Milton update: హుదూద్‌ కంటే వంద రెట్ల విధ్వంసం సృష్టించిన మిల్టన్ - ఫ్లోరిడా పరిస్థితి ఎలా ఉందో చూశారా ?
హుదూద్‌ కంటే వంద రెట్ల విధ్వంసం సృష్టించిన మిల్టన్ - ఫ్లోరిడా పరిస్థితి ఎలా ఉందో చూశారా ?
Ratan Tata: భారత ఆటోమార్కెట్‌కు ఎంతో చేసిన రతన్ టాటా - ఈ ఐదు ఘనతలు హైలెట్!
భారత ఆటోమార్కెట్‌కు ఎంతో చేసిన రతన్ టాటా - ఈ ఐదు ఘనతలు హైలెట్!
Nara Rohit : నారా కుటుంబంలో పెళ్లి సందడి -  హీరోయిన్‌తో రోహిత్ నిశ్చితార్థం ఖరారు ?
నారా కుటుంబంలో పెళ్లి సందడి - హీరోయిన్‌తో రోహిత్ నిశ్చితార్థం ఖరారు ?
Embed widget