Ratan Tata: అవినీతిపై బిలియనీర్ అడిగిన ప్రశ్నకు నవ్వుతూనే దిమ్మదిరిగే సమాధానం చెప్పిన రతన్ టాటా
Ratan Tata: అవినీతిని ఎలా అధిగమిస్తారు... అని బిలియనీర్ అడిగిన ప్రశ్నకు రతన్ టాటా దిమ్మదిరిగే సమాధానం చెప్పారు. నవ్వుతూనే ఇజ్జత్ తీశారు.
Ratan Tata: వ్యాపారవేత్తగా వందకుపైగా సంస్థలు ఏర్పాటు చేసిన రతన్ టాటా లంచాలు ఇవ్వకుండానే పనులు చేయించుకున్నారట. తను చేసిన మంచి వివరించి అధికారులతోకానీ, ప్రభుత్వాలతో కానీ పని చేయించుకునే వాళ్లు. ఇదే విషయంపై ఓ జాతీయ న్యూస్ ఛానల్ ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన చర్చ గురించి వివరించారు.
ఓ బిలియనీద్ తన వద్దకు వచ్చి ఓ వ్యాపార ఒప్పందం కోసం మంత్రికి 15 కోట్లు ఇవ్వాలని రతన్ టాటాకు సూచన చేశారట. దానిని సున్నితంగా రతన్ టాటా తిరస్కరించారు. దానికి ఆ బిలియనీర్ పారిశ్రామికవేత్త రతన్ టాటాను ఓ ప్రశ్న వేశారు. అవినీతిని ఎలా అధిగమిస్తారని క్వశ్చన్ చేశారట.
బిలియనీర్ అడిగిన ప్రశ్నకు రతన్ టాటా నవ్వుతూ విచిత్రమైన సమాధానం చెప్పారు. అందతా స్వీయ నియంత్రణపై ఆధారపడి ఉంటుంది మీకు అర్థం కాదులే అంటూ నవ్వి ఊరుకున్నారు. అదే ఇంటర్వ్యూలో రతన్ టాటా మాట్లాడుతూ... ప్రతి రోజు పడుకునే ముందు నేను ఆ పని(అవినీతి) చేయలేదు కదా అని నిద్రపోతాను అని చెప్పుకొచ్చారు.
తన సంస్థలను స్థాపించడంలోనే కాదు వాటిని నిజాయితీ ప్రజలకు సేవల చేస్తూ నడిపించడంలో ఆదర్శంగా నిలిచారు రతన్ టాటా. అందుకే ప్రతి భారతీయులు టాటా సంస్థలతో భావోధ్వేగమైన సంబంధం కలిగి ఉంటారు. ఆవిష్కరణ, దాతృత్వం కలిసిన ప్రత్యేకమైన వ్యక్తి రతన్ టాటా. తన 'టాటా సంస్థ విలువల'పై ఎప్పుడూ రాజీ పడలేదు. అదే టైంలో యువత చేసే ప్రయోగాలను ప్రోత్సహించడంలో ఎప్పుడూ ముందు ఉంటారు. గడ్చిరోలి వంటి మారుమూల ప్రాంతాల్లోని యువతను కూడా ప్రోత్సహించాలనే సంకల్పం ఉన్న వ్యక్తి. అక్కడి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి ఒక ఇన్నోవేషన్ సెంటర్ ప్రారంభించారు.
కొత్తకొత్త ఐడియాలతో వచ్చే స్టార్టప్ కంపెనీలను ప్రోత్సహించే వాళ్లు. అలాంటివి 40 పైగా సంస్థలు నేడు లైమ్‌లైట్‌లో ఉన్నాయి ప్రజలకు సేవలు అందిస్తున్నాయి. ఐడియా నచ్చింది అంటే వారిని ఆర్థికంగా రతన్ టాటా ఆదుకునే వాళ్లు. టాలెంట్ ఉన్న వాళ్లు వెనుకబడితే దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుందని నమ్మిన వ్యక్తి రతన టాటా. ఆయనకు భేషజాలు ఉండేవి కావట. తన వయసులో చిన్న వాళ్లతోనైనా ఇట్టే కలిసిపోతారు. అలాంటి కలిసిపోయే వ్యక్తి కాబట్టి శాంతను నాయుడు అనే కుర్రాడు రతన్ టాటాకు బెస్ట్ ఫ్రెండ్ అయ్యారు. ఆయనకు మేనేజర్‌గా ఉన్నారు.
Also Read:రతన్ టాటాకు భారత రత్న ఇవ్వాలని తీర్మానం చేసిన మహారాష్ట్ర మంత్రిమండలి
వ్యాపారవేత్తలు ఎవరైనా లాభాలు గురించి ఆలోచిస్తారు. రతన్ టాటా మాత్రం సామాన్యుడిని ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలను దృష్టిలో పెట్టుకొని బిజినెస్ చేస్తారు. అందుకే టాటాల వస్తువులన్నీ తక్కువ ధరల్లో ఉండేలా చూస్తారు. క్రోమా, జూడియో, వెస్ట్‌సైడ్, టెట్లీ టీ, నానో కారు, ఇండికా కారు ఇలా అన్ని కూడా వారిని దృష్టిలో పెట్టుకొని తీర్చిదిద్దిన ఉత్పత్తులే. ఏం చేసినా మిడిల్ క్లాస్ పీపుల్ బాగుపడాలన్నదే ఆయన వ్యాపార సూత్రం.
Also Read: రతన్ టాటా వారసుల రేస్‌లో మాయా, నెవిల్లే , లియా- ఎవరు ఎందులో గొప్ప!