Sonu Sood: మళ్లీ మీ ముందుకు వచ్చేశా.. కాలమే అన్నింటికీ సమాధానం చెబుతుంది.. ఐటీ దాడులపై సోనూసూద్
ఐటీ దాడులపై నటుడు సోనూసూద్ స్పందించారు. సంజాయిషీ ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
వరుసగా నాలుగు రోజులు.. నటుడు సోనూసూద్ పై ఐటీ దాడులు జరిగాయి. అయితే ఈ విషయంపై సంజాయిషీ ఇవ్వాల్సిన అవసరం లేదని.. కాలమే అన్నింటికీ సమాధానం చెబుతుందని సోనూసూద్ అన్నారు.
‘ఏ విషయంలోనైనా ప్రతిసారీ నువ్వు సంజాయిషీ ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు. కాలమే అన్నింటికీ సమాధానం చెబుతుంది. మంచి మనస్సుతో భారతదేశ ప్రజలందరికీ నా వంతు సాయం చేయాలని ప్రతిజ్ఞ చేసుకున్నాను. సాయం కోసం చూసే ప్రజలతోపాటు ఒక విలువైన ప్రాణాన్ని కాపాడటం కోసమే నా సంస్థలోని ప్రతి రూపాయీ ఎదురుచూస్తోంది. నేను ప్రచారకర్తగా వ్యవహరించినందుకుగాను వచ్చే పారితోషికాన్ని మానవసేవ కోసం వినియోగించాలని ఇప్పటికే ఎన్నో సందర్భాల్లో ఆయా బ్రాండ్ సంస్థలకు తెలిపాను. అందుకే మా ప్రయాణం కొనసాగుతోంది. నాలుగు రోజుల నుంచి వ్యక్తిగత పనుల్లో బిజీగా ఉండటంతో మీకు అందుబాటులో లేను. మళ్లీ సేవలందించేందుకు ఇప్పుడు మీ ముందుకు వచ్చేశాను’ అని సోనూ ట్వీట్ చేశారు.
పన్ను ఎగవేత ఆరోపణలతో.. నాలుగు రోజులపాటు ఐటీ అధికారులు సోనూసూద్ కు సంబంధించిన ఇళ్లలో తనిఖీలు చేశారు. సోనూసూద్ ఇళ్లు, అతడికి సంబంధించిన వ్యక్తుల నివాసాల్లో తనిఖీలు చేసినప్పుడు పన్ను ఎగవేసినట్లు గుర్తించామని చెప్పారు. ముంబయి, లక్నో, కాన్పూర్, జైపూర్, ఢిల్లీ, గురుగ్రామ్ సహా 28 ప్రాంతాల్లో తనిఖీలు చేసినట్లు ఐటీ అధికారులు తెలిపారు. సోనూసూద్ 20 కోట్లకు పైగా.. పన్ను ఎగవేసినట్లు ఐటీ శాఖ తెలిపింది.
అయితే ఆమ్ ఆద్మీ పార్టీ, శివసేన పార్టీలు సోనూసూద్ పై ఐడీ దాడుల చేయడాన్ని ఖండించాయి. కేంద్రంపై విమర్శలు చేశాయి. కరోనా కష్టకాలంలో ఎంతో మందికి సేవ చేసిన సోనూసూద్ ను లక్ష్యంగా చేసుకుని దాడులు చేశారని ఆరోపించారు.
ఇటీవలే ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ను కలిశాడు సోనూసూద్. ఢీల్లి ప్రభుత్వం ఆయనను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించింది. అయితే ఈ క్రమంలో సోనూసూద్ రాజకీయాల్లోకి వస్తున్నాడంటూ పుకార్లు వచ్చాయి. అంతకు ముందు ఏకంగా ముంబయి మేయర్‌గా కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలోకి దింపుతున్నారంటూ కూడా ప్రచారం జరిగింది. అయితే, వాటన్నిటిపై స్పందించేందుకు సోనూసూద్ నిరాకరించాడు. తాజాగా ఇవాళ.. ఐటీ దాడులపై స్పందించాడు.
Also Read: Sonu Sood: సోనూసూద్ ఇంటిపై ఐటీ దాడులు..
Also Read: KTR Vs Revanth Reddy: రేవంత్‌పై కేటీఆర్ పరువు నష్టం దావా, మంత్రి ట్వీట్‌కి రేవంత్ రెడ్డి ఘాటు రిప్లై
Also Read: Child Marriage: ఆ సందర్భంలో చైల్డ్ మ్యారేజ్ చెల్లుతుంది.. వారికి విడాకులు ఇలా.. హైకోర్టు కీలక తీర్పు