News
News
X

Child Marriage: ఆ సందర్భంలో చైల్డ్ మ్యారేజ్ చెల్లుతుంది.. వారికి విడాకులు ఇలా.. హైకోర్టు కీలక తీర్పు

18 ఏళ్ల లోపు ఉన్న యువతిని ఓ వ్యక్తి గతంలో వివాహం చేసుకోగా.. కొన్నేళ్ల తర్వాత వారికి పరస్ఫర విడాకులు కావాలని కోరుతూ లుథియాలోని ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు.

FOLLOW US: 

మైనర్‌గా ఉన్నప్పుడు యువతికి వివాహమై, తర్వాత కొన్నాళ్లకి భర్త నుంచి విడిపోవాలనుకుంటే అది విడాకుల ద్వారానే సాధ్యమవుతుందని పంజాబ్ అండ్ హరియాణా హైకోర్టు స్పష్టం చేసింది. ఆమె మైనారిటీ తీరాక కూడా తనకు జరిగిన పెళ్లిని ఆమోదించిన సందర్భంలో కచ్చితంగా విడాకులు తీసుకొనే వేరు పడాలని ధర్మాసనం తేల్చి చెప్పింది. ఇంతకుముందు లుథియానాలోని ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పుపై భార్యాభర్తలు హైకోర్టుకు అప్పీలుకు వెళ్లగా ద్విసభ్య ధర్మాసనం ఈ నిర్ణయం వెలువరించింది. 

18 ఏళ్ల లోపు ఉన్న యువతిని ఓ వ్యక్తి గతంలో వివాహం చేసుకోగా.. కొన్నేళ్ల తర్వాత వారికి పరస్ఫర విడాకులు కావాలని కోరుతూ లుథియాలోని ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు. దీంతో లుథియానాలోని ఫ్యామిలీ కోర్టు వారి వివాహం చెల్లదని తీర్పునిచ్చింది. అలాంటప్పుడు ఆ జంటకు వారు కోరుకున్న విడాకులు ఇవ్వలేమని స్పష్టం చేసింది. దీంతో ఆ భార్యాభర్తలు పంజాబ్ అండ్ హరియాణా హైకోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్‌ను విచారణ జరిపిన హైకోర్టు జస్టిస్ రీతు బాహ్రీ, జస్టిస్ అరున్ మోంగాతో కూడిన ద్విసభ్య ధర్మాసనం హిందూ వివాహ చట్టం 1955లోని సెక్షన్ 13-బి ప్రకారం పరస్ఫర విడాకులు సాధ్యమేనని స్పష్టం చేసింది. ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం ఈ మేరకు వారికి విడాకులు మంజూరు చేసింది.

Also Read: Sangareddy: ఈ నిమజ్జనం చూసి రోడ్డుపై అవాక్కైన జనం.. మరీ ఇలా వచ్చేస్తాడా..!

ఈ జంటకు 2009 ఫిబ్రవరిలో పెళ్లి జరిగింది. అప్పటికి వధువు వయసు 18 ఏళ్ల లోపే ఉంది. వరుడికి 23 ఏళ్ల వయసు. ఆ తర్వాత 2010లో వారికి ఓ శిశువు కూడా జన్మించింది. గతేడాది జూన్ 22న ఈ భార్యాభర్తలు తమ వివాహాన్ని రద్దు చేయాలని కోరుతూ లుథియానా ఫ్యామిలీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కోర్టు.. హిందూ వివాహ చట్టం 1955లోని సెక్షన్ 5(iii) ఉటంకిస్తూ.. పెళ్లి కుమార్తెకు కచ్చితంగా 18 సంవత్సరాలు ఉండాలనే నిబంధనను గుర్తు చేసింది. ఆ సమయానికి ఆమెకు 18 ఏళ్లు లేవు కాబట్టి ఆ పెళ్లి చట్టప్రకారం చెల్లబోదని స్పష్టం చేసింది.

News Reels

Also Read: KCR Temple For Sale : కేసీఆర్‌ గుడిని అమ్మేస్తున్న భక్తుడు ! దేవుడు కరుణించలేదా? పూజారి కనికరించ లేదా?

Also Read: KTR Vs Revanth Reddy: రేవంత్‌పై కేటీఆర్ పరువు నష్టం దావా, మంత్రి ట్వీట్‌కి రేవంత్ రెడ్డి ఘాటు రిప్లై

Also Read: Photos: నిమజ్జనం వేళ Hyd విహంగ వీక్షణం, మెట్రో ఒంపుసొంపులతో అందమైన సిటీని పైనుంచి చూడండి

Published at : 20 Sep 2021 11:16 AM (IST) Tags: Punjab and Haryana High Court Child Marriage Minor marriage Verdict of Punjab Haryana High Court

సంబంధిత కథనాలు

Christmas Tree: క్రిస్మస్‌ పండుగలో క్రిస్మస్‌ చెట్టును ఎందుకు ఉంచుతారో తెలుసా ?

Christmas Tree: క్రిస్మస్‌ పండుగలో క్రిస్మస్‌ చెట్టును ఎందుకు ఉంచుతారో తెలుసా ?

Success of Parachute Oil: ప్యారాచూట్‌ ఆయిల్‌ సక్సెస్‌కు ఎలుకలు కారణమా ! దాని వెనుక అంత కథ ఉందా

Success of Parachute Oil: ప్యారాచూట్‌ ఆయిల్‌ సక్సెస్‌కు ఎలుకలు కారణమా ! దాని వెనుక అంత కథ ఉందా

Assam News: ర్యాగింగ్ భరించలేక బిల్డింగ్‌ పైనుంచి దూకేసిన విద్యార్థి- ఘటనపై సీఎం సీరియస్!

Assam News: ర్యాగింగ్ భరించలేక బిల్డింగ్‌ పైనుంచి దూకేసిన విద్యార్థి- ఘటనపై సీఎం సీరియస్!

Rajasthan Congress Crisis: 'ఆ విభేదాల ప్రభావం జోడో యాత్రపై ఉండదు- అదే నా లక్ష్యం'

Rajasthan Congress Crisis: 'ఆ విభేదాల ప్రభావం జోడో యాత్రపై ఉండదు- అదే నా లక్ష్యం'

Bhagat Singh Koshyari: రాజీనామాకు సిద్ధమైన మహారాష్ట్ర గవర్నర్- వరుస వివాదాలతో ఉక్కిరిబిక్కిరి!

Bhagat Singh Koshyari: రాజీనామాకు సిద్ధమైన మహారాష్ట్ర గవర్నర్- వరుస వివాదాలతో ఉక్కిరిబిక్కిరి!

టాప్ స్టోరీస్

వైఎస్ షర్మిల అరెస్ట్ తర్వాత ఏం జరగబోతుంది?

వైఎస్ షర్మిల అరెస్ట్ తర్వాత ఏం జరగబోతుంది?

ఒక సిఎం కుర్చీకి ఎంతమంది అభ్యర్థులు? వచ్చే ఎన్నికల్లో ఏపీలో ఏం జరగబోతుంది?

ఒక సిఎం కుర్చీకి ఎంతమంది అభ్యర్థులు? వచ్చే ఎన్నికల్లో ఏపీలో ఏం జరగబోతుంది?

CM KCR : యాదాద్రి ప్లాంట్ నుంచి హైదరాబాద్ కు కనెక్టివిటీ, 2023 డిసెంబర్ నాటికి విద్యుత్ ఉత్పత్తి స్టార్ట్ చేయాలి- సీఎం కేసీఆర్

CM KCR : యాదాద్రి ప్లాంట్ నుంచి హైదరాబాద్ కు కనెక్టివిటీ, 2023 డిసెంబర్ నాటికి విద్యుత్ ఉత్పత్తి స్టార్ట్ చేయాలి- సీఎం కేసీఆర్

సుప్రీం కోర్టు తీర్పుతో వైసీపీలో జోష్‌- స్వాగతించిన నేతలు, మంత్రులు

సుప్రీం కోర్టు తీర్పుతో వైసీపీలో జోష్‌- స్వాగతించిన నేతలు, మంత్రులు