Sangareddy: ఈ నిమజ్జనం చూసి రోడ్డుపై అవాక్కైన జనం.. మరీ ఇలా వచ్చేస్తాడా..!
ఖైరతాబాద్ గణపతి ఇప్పటికే హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం అయిన సంగతి తెలిసిందే. ఇంకా హైదరాబాద్‌లో మరెన్నో వినాయక విగ్రహాలు నిమజ్జనానికి లైన్ కట్టాయి.
వినాయక నిమజ్జన కార్యక్రమం తెలుగు రాష్ట్రాల్లో వైభవంగా సాగుతోంది. తొమ్మిది రోజులుగా పూజలు అందుకుంటున్న వినాయక విగ్రహాలు నిమజ్జనం కోసం చెరువులు, కుంటల వద్ద బారులు తీరుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనే ఎంతో ప్రాముఖ్యం సంపాదించుకున్న ఖైరతాబాద్ గణపతి ఇప్పటికే హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం అయిన సంగతి తెలిసిందే. ఇంకా హైదరాబాద్‌లో మరెన్నో వినాయక విగ్రహాలు నిమజ్జనానికి లైన్ కట్టాయి. ముందుగా కేటాయించిన టోకెన్ల వారీగా నిమజ్జన కార్యక్రమం ట్యాంక్ బండ్ వద్ద కొనసాగుతోంది. ఈ సందర్భంగా అక్కడ రెండ్రోజుల నుంచి సందడి వాతావరణం నెలకొంది.
ఇదిలా ఉంటే.. ఓ భక్తుడు మాత్రం వినూత్న రీతిలో నిమజ్జనం చేసేందుకు ముందుకు వచ్చాడు. సంగారెడ్డి జిల్లాకు చెందిన ఆయన గణపతి విగ్రహాన్ని హైదరాబాద్‌లో ట్యాంక్ బండ్‌లో నిమజ్జనం చేసేందుకు వచ్చాడు. ఇందులో విచిత్రం ఏముందని అనుకుంటున్నారా? ఆయన ప్రత్యేక ఏర్పాట్లతో వినాయక విగ్రహాన్ని తన శరీరానికే కట్టుకొని స్కేటింగ్ బూట్లు వేసుకొని, సంగారెడ్డి నుంచి స్కేటింగ్ చేసుకుంటూ వచ్చాడు. సంగారెడ్డి జిల్లాలోని వావిలాల గ్రామానికి చెందిన ఓ భక్తుడు ఇలా వినూత్న రీతిలో వినాయక నిమజ్జనానికి బయలుదేరి వచ్చాడు. ఈ ఘటన గణనాథుడిని ట్యాంక్ బండ్‌లో నిమజ్జనం చేయడానికి వెరైటీకగా బయలుదేరి వచ్చాడు.
ఈ నిమజ్జన దృశ్యం చూసిన వారంతా అవాక్కయ్యారు. సంగారెడ్డి జిల్లా వావిలాల గ్రామానికి చెందిన భక్తుడు లక్ష్మణ్ ఇలా వినూత్నంగా తన భక్తిని చాటుకున్నాడు. స్కేటింగ్ షూస్ వేసుకుని అంత దూరం నుంచి వినాయకుడిని తన శరీరానికి అంటి పెట్టుకుని రావడం సవాలే. అదీ రహదారిపై స్కేటింగ్ చేస్తూ రావడం అందరి దృష్టినీ ఆకర్షించింది.
Also Read: White Challenge : డ్రగ్స్ కేసుల చుట్టూ తిరుగుతున్న తెలంగాణ రాజకీయాలు ! వైట్ చాలెంజ్‌లో గెలుపెవరిది?
అయితే, లక్ష్మణ్ ఇలా నిమజ్జనం కోసం రావడం ఇదే తొలిసారి కాదు. గత 5 సంవత్సరాలుగా సంగారెడ్డి జిల్లా వావిలాల గ్రామం నుంచి వినాయకుడ్ని అదే రీతిలో తీసుకువస్తున్నాడు. తన తండ్రి, గ్రామ సర్పంచ్, స్థానికుల సహకారంతో ప్రతి సంవత్సరం వినాయక విగ్రహాన్ని స్కేటింగ్ చేస్తూ తీసుకువచ్చి ట్యాంక్‌బండ్‌కు చేరుకుంటానని లక్ష్మణ్ విలేకరులతో చెప్పాడు. ఉదయం 7 గంటలకు బయలుదేరి సాయంత్రం 4 గంటల లోపు ట్యాంక్ బండ్‌కు చేరుకుంటానని చెప్పాడు. కరోనా మహమ్మారి పూర్తిగా తొలగిపోవాలని, ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని వినాయకుడిని కోరుకున్నట్లుగా లక్ష్మణ్ వెల్లడించారు.
Also Read: RMP Doctor: ఒక్క ముద్దుకు రూ.25 వేలు, ఆస్పత్రి రెంట్ కూడా.. ఆర్ఎంపీ డాక్టర్‌కు ఆఫర్.. చివరికి..