Sonu Sood: సోనూసూద్ ఇంటిపై ఐటీ దాడులు..
కరోనా సమయంలో ఎంతోమంది వలస కార్మికులకు, పేద ప్రజలకు సాయం చేస్తూ రియల్ హీరో అనిపించుకున్నాడు సోనూసూద్.
కరోనా సమయంలో ఎంతోమంది వలస కార్మికులకు, పేద ప్రజలకు సాయం చేస్తూ రియల్ హీరో అనిపించుకున్నాడు సోనూసూద్. వలస కార్మికుల బాధలు చూడలేక తన సొంత డబ్బుతో వారిని స్వస్థలాలకు చేర్చారు. దేశవ్యాప్తంగా తన సేవా కార్యక్రమాలు నిర్వహించారు. కష్టమని ఎవరు ట్వీట్ చేసినా.. వెంటనే స్పందించేవారు. తన టీమ్ ని అలర్ట్ చేసి కష్టాల్లో ఉన్నవారిని ఆదుకున్నారు. అతడిని దేవుడిలా భావించారు ప్రజలు. సోనూ సేవను గుర్తించిన చాలా మంది దాతలు ముందుకొచ్చి సోనూసూద్ ఫౌండేషన్ కి విరాళాలు అందించారు.
Also Read : Abijeet : బిగ్‌బాస్ సీజన్ 4 విజేతకు ఏమైంది.. ఆ ట్వీట్‌తో అబిజిత్ హెల్త్‌పై అనేక అనుమానాలు..
ఇదిలా ఉండగా.. బుధవారం(సెప్టెంబర్ 15) నాడు ముంబైలో ఆయన కార్యాలయాన్ని ఆదాయపు పన్ను శాఖా వారు తనిఖీ చేసినట్లు అధికారులు తెలిపారు. ముంబై ఆఫీస్ తో పాటు ఆయనకు చెందిన మరో ఆరు స్థలాల్లో కూడా ఏకకాలంగా తనిఖీలు చేపట్టినట్లు సమాచారం. ఈ రైడ్స్ కి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సివున్నాయి. ఇటీవల ఢిల్లీ ప్రభుత్వం సోనూసూద్ ని పాఠశాల విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన మెంటార్‌షిప్ ప్రొగ్రామ్‌కి బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించింది. ఈ క్రమంలో ఆయన రాజకీయాల్లోకి వస్తున్నాడంటూ వార్తలు పుట్టుకొచ్చాయి.
కానీ సోనూసూద్ మాత్రం తనకు రాజకీయాల్లో ఆసక్తి లేదని ఇప్పటికే పలు మార్లు మీడియాలో చెప్పారు. బాలీవుడ్ లో నటుడిగా కెరీర్ మొదలుపెట్టిన సోనూ.. సౌత్ భాషల్లో కూడా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం తెలుగులో 'ఆచార్య' లాంటి క్రేజీ ప్రాజెక్ట్ లలో నటిస్తున్నారు. అలానే బాలీవుడ్ లో 'పృథ్వీ రాజ్' అనే పీరియాడిక్ డ్రామాలో నటిస్తున్నారు. దీంతో పాటు కోలీవుడ్ లో 'తమిళరసన్' అనే సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
Also Read : 'కలర్ ఫోటో' బ్యూటీ.. గ్లామర్ షోలో నో లిమిట్స్..
Also Read : వేసవికే ఫిక్స్ అయిన రాజమౌళి.. మరి నిర్మాత ఏం చేస్తారో..
Also Read : 'ఏంది నీ లొల్లి..' కాజల్ పై శ్రీరామచంద్ర ఫైర్.. విశ్వను ఛీ కొట్టిన రవి..
Also Read : 'మగాడివైతే ఆడుదువ్ రా..' ప్రియా వర్సెస్ సన్నీ..
Also Read : ’కళ్ళలోన దాగి ఉన్న అమ్మాయి సొంతమల్లె చేరుతుంటే ప్రాణమంత చెప్పలేని హాయి' మళ్లీ మ్యాజిక్ చేసిన సిద్ శ్రీరాం