By: ABP Desam | Updated at : 15 Sep 2021 03:50 PM (IST)
ప్రియా వర్సెస్ సన్నీ..
బిగ్ బాస్ షో మొదలై పది రోజులవుతోంది. అప్పుడే హౌస్ లో ఒకరినొకరు టార్గెట్ చేసుకోవడాలు, తిట్టుకోవడాలు, కొట్టుకోవడాలు లాంటివి జరుగుతున్నాయి. దానికి తగ్గట్లే బిగ్ బాస్ కెప్టెన్సీ కోసం ఫిజికల్ టాస్క్ ను ఇచ్చారు. ఈ ఛాన్స్ కోసం ఎదురుచూస్తోన్న హౌస్ మేట్స్ అంతా రెచ్చిపోయి ఆడేస్తున్నారు. ఆడ, మగ అనే తేడా లేకుండా ఒకరిపై ఒకరు పడిపోతూ.. కుమ్మేసుకుంటూ ఆడేస్తున్నారు. నిన్నటి ఎపిసోడ్ లో మొదలైన ఈ టాస్క్ ఈరోజు కూడా కంటిన్యూ అవుతుంది.
ఈరోజు ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. ఈ ప్రోమోను చూస్తుంటే నిన్నటి కంటే ఇంకా ఎక్కువగా గొడవపడ్డారనిపిస్తుంది. ముందుగా రవి, శ్రీరామచంద్రల మధ్య గొడవ మొదలైంది. 'నువ్ సేఫ్ గేమ్ ఆడాలనుకుంటే ఆడు' అని శ్రీరామ్.. రవితో చెబుతుండగా దానికి రవి.. 'ఇది నా గేమ్ బ్రో నా ఇష్టం' అని చెప్పాడు. దానికి శ్రీరామ్ 'నీ గేమ్ నువ్ ఆడు కానీ నాతో మైండ్ గేమ్స్ ఆడొద్దు' అని రవికి వార్నింగ్ ఇచ్చాడు.
Also Read : 'ఏంది నీ లొల్లి..' కాజల్ పై శ్రీరామచంద్ర ఫైర్.. విశ్వను ఛీ కొట్టిన రవి..
ఆ తరువాత మానస్ పై ఫైర్ అయ్యాడు శ్రీరామ్. 'వాళ్లకు వీళ్లకు చెప్పడం కాదు.. నీకు నాతో ప్రాబ్లమ్ ఉంటే నాతో చెప్పు' అని శ్రీరామ్.. మానస్ కి వార్నింగ్ ఇస్తుండగా.. 'నువ్ వినే పొజిషన్ లో లేవు' అంటూ మానస్ కూడా వాయిస్ రైజ్ చేసి చెప్పాడు. 'నువ్ ఇంకా చిన్నపిల్లోడివి' అని శ్రీరామ్.. 'నీ ఏజ్ ఎక్కువ ఉన్న మెచ్యూరిటీ చూడు ఎలా ఉందో' అంటూ మానస్ ఒకరిపై ఒకరు సెటైర్లు వేసుకున్నారు.
అనంతరం రవి తమ టీమ్ తో కూర్చొని గేమ్ ప్లాన్ చెబుతున్నాడు. ముందుగా ఒక్కొక్కరిని టార్గెట్ చేద్దాం అని రవి చెబుతుండగా.. దానికి 'ఊ..' కొడుతూ కనిపించింది కాజల్. 'దేహ బలం తక్కువ ఉంది కాబట్టి కొంచెం మైండ్ తో ఆడదాం' అంటూ శ్రీరామచంద్ర తన టీమ్ తో చెబుతూ కనిపించాడు. గేమ్ మధ్యలో శ్రీరామచంద్ర 'పగిలిపోద్ది చెప్తున్నా' అంటూ సన్నీకి వార్నింగ్ ఇచ్చాడు.
ఆ తరువాత సిరి.. శ్వేతాను రెచ్చగొడుతూ కామెంట్ చేయడంతో ఆమె సిరి పైకి దూసుకెళ్లింది. అది చూసిన యానీ మాస్టర్ 'శ్వేతా నువ్ వెరీ వెరీ వైల్డ్' అని కామెంట్ చేసింది.. 'సాయంత్రం అయ్యేసరికి దెయ్యం పూనుతాది' అంటూ ప్రియా కూడా సెటైర్ వేసింది. ఇక ప్రోమో చివర్లో సన్నీని ఉద్దేశిస్తూ.. 'మగాడివైతే ఆడుదువ్ రా..' అంటూ ప్రియా రెచ్చగొట్టగా.. 'మీరు మగాడు గిగాడు మాటలు వద్దు' అంటూ వేలి చూపిస్తూ వార్నింగ్ ఇచ్చాడు సన్నీ.
Captaincy task just went up to next level 🔥 🔥 .. Who will make it ? #BiggBossTelugu5 today at 10 PM on #StarMaa #FiveMuchFun pic.twitter.com/zJjMT55IBN
— starmaa (@StarMaa) September 15, 2021
Vishnu Priya Manas New Song : నల్లంచు చీరెదాన, నకిలీసు పెట్టేదానా - విష్ణుప్రియ, మానస్ మళ్లీ దుమ్మురేపారుగా
BB Jodi Grand finale: ‘BB జోడీ’ గ్రాండ్ ఫినాలే - రూ.25 లక్షల ప్రైజ్ మనీ కోసం 5 జంటల మధ్య పోటీ, గెలిచేదెవరు?
Monkey Selfie With Abijeet: అభిజీత్తో కోతి సెల్ఫీ - ఆ ఫొటో కోతే తీసిందట!
Archana Gautam: ప్రియాంక గాంధీ పీఏపై బిగ్ బాస్ కంటెస్టెంట్ సంచలన ఆరోపణలు, కేసు నమోదు చేసిన పోలీసులు
Gangavva on Nagarjuna: కల నెరవేర్చుకున్న గంగవ్వ, కొత్త ఇంటి కోసం నాగార్జున ఎంత సాయం చేశారంటే?
Jagan G 20: ప్రతి ఒక్కరికీ ఇల్లు కల్పించాలన్నది మా ఉద్దేశం - విశాఖ జి-20 సదస్సులో సీఎం జగన్
TSLPRB Exam: కానిస్టేబుల్ టెక్నికల్ ఎగ్జామ్ హాల్టికెట్లు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?
Taapsee Pannu: నటి తాప్సి పన్నుపై కేసు నమోదు - హిందువుల మనోభావాలు దెబ్బతీసిందని ఫిర్యాదు
TDP Manifesto : ప్రతి పేదవాడి జీవితం మారేలా మేనిఫెస్టో, కసరత్తు ప్రారంభించిన టీడీపీ!