By: ABP Desam | Published : 15 Sep 2021 04:39 PM (IST)|Updated : 15 Sep 2021 04:39 PM (IST)
Edited By: RamaLakshmibai
Most Eeligible Bachelor
అదిరిపోయే హిట్టుకోసం ఎదురుచూస్తున్న అఖిల్ లేటెస్ట్ మూవీ..మొస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్. రొమాంటిక్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ గా బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కించిన ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్. అక్టోబర్ 8న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ మూవీకి సంబంధించి ప్రమోషన్ స్పీడ్ పెంచింది చిత్ర యూనిట్. ఇందులో భాగంగా లెహరాయి అనే సాంగ్ విడుదల చేశారు.
'లెహరాయి లెహరాయి.. గుండె ఊహలెగిరాయి.. గోరు వెచ్చనైన ఊసులదిరాయి.. గుండెలోని ఆశలన్నీ ఎగిరాయి.. ఇన్నినాళ్ళు ఎంత ఎంత వేచాయి.. కళ్ళలోన దాగి ఉన్న అమ్మాయి.. సొంతమల్లె చేరుతుంటే.. ప్రాణమంత చెప్పలేని హాయి..' అంటూ సాగిన ఈ రొమాంటిక్ సాంగ్ సంగీత ప్రేమికులను అలరిస్తోంది. అఖిల్, పూజా హెగ్డే మధ్య రొమాన్స్ చూసి ప్రేక్షకులు ఫుల్ థ్రిల్‌గా ఫీలవుతున్నారు. శ్రీమణి లిరిక్స్ అందించగా, సిద్ శ్రీరామ్ ఈ పాట ఆలపించారు. గోపి సుందర్ స్వరాలు సమకూర్చారు. రఘు మాస్టర్ ఈ పాటకు కొరియోగ్రఫీ చేశారు.
Also read: బిగ్ బాస్ హౌస్‌లోకి ఆ ఇద్దరూ వైల్డ్ కాల్డ్ ఎంట్రీ.. ఇక కథ వేరే ఉంటదా..!
'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' ఆడియో ఆదిత్య మ్యూజిక్ ద్వారా మార్కెట్లోకి వస్తుందని మేకర్స్ తెలిపారు. ఇప్పటికే విడుదలైన టీజర్ - సాంగ్స్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. 'మనసా మనసా' 'గుచ్చే గులాబీ' 'ఏ జిందగీ' పాటల మాదిరిగానే 'లెహరాయి' కూడా ఆకట్టుకుంటుందని చెబుతున్నారు. అల్లు అరవింద్ సమర్పిస్తున్న 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' సినిమాని జీఏ2 పిక్చర్స్ బ్యానర్ పై బన్నీ వాస్ - వాసు వర్మ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఆమని, ఈషా రెబ్బా , చిన్మయి, వెన్నెల కిషోర్, మురళీశర్మ, జయప్రకాష్ ,ప్రగతి , అమిత్ తివారి, సుడిగాలి సుధీర్ , గెటప్ శ్రీను ఇతర పాత్రల్లో నటించారు.
Also read: యాభై ఏళ్లు దాటాయంటే నమ్మగలరా…ఎవ్వర్ గ్రీన్ బ్యూటీకి హ్యాపీ బర్త్ డే
‘అఖిల్’ అనే సినిమాతో హీరోగా పరిచయం అయిన అఖిల్.. ఆ తర్వాత ‘హలో’, ‘మిస్టర్ మజ్ను’ వంటి సినిమాల్లో నటించినా సరైన సక్సెస్ అందించలేకపోయాయి. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రం పక్కా హిట్ ఇస్తుందనే నమ్మకంతో ఉన్నాడు అఖిల్. ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఏజెంట్ అనే సినిమా చేస్తున్నాడు.
Minister RK Roja: రోజాను సన్మానించిన జబర్దస్త్ టీం - పాత, కొత్త ఆర్టిస్టులతో సందడి!
Mahesh Babu: ఫ్యాన్స్ కి మాస్ ట్రీట్ - స్టేజ్ ఎక్కి డాన్స్ చేసిన మహేష్
NTR30 : ఎన్టీఆర్ స్క్రిప్ట్ లో మార్పులు - మే 20న అప్డేట్ వస్తుందా?
NBK107: 'ఖిలాడి' బ్యూటీతో బాలయ్య మాస్ స్టెప్పులు - కొరియోగ్రాఫర్ ఎవరంటే?
KGF 2: 'కేజీఎఫ్2' ఓటీటీ రిలీజ్ - ఫ్రీగా చూసే ఛాన్స్ లేదు!
Astrology: జూలైలో పుట్టినవారు కష్టాలు పడతారు కానీ మీరు ఓ అద్భుతం అని మీకు తెలుసా!
Google Pixel 6A Price: గూగుల్ పిక్సెల్ ధరలను ప్రకటించిన కంపెనీ - ఏ దేశంలో తక్కువకు కొనచ్చంటే?
Bandi Sanjay About KCR: కేసీఆర్ పాతబస్తీకి పోవాలంటే ఒవైసీ పర్మిషన్ తీసుకోవాలి: సీఎంపై బండి సంజయ్ సెటైర్స్
Sony Xperia Ace III: అత్యంత చవకైన సోనీ 5జీ ఫోన్ వచ్చేసింది - ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?