Abijeet : బిగ్‌బాస్ సీజన్ 4 విజేతకు ఏమైంది.. ఆ ట్వీట్‌తో అబిజిత్ హెల్త్‌పై అనేక అనుమానాలు..
'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు అభిజిత్. అయితే ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.
'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు అభిజిత్. అయితే ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. దీంతో అభిజిత్ కి పెద్దగా అవకాశాలు రాలేదు. కొన్నాళ్లకు బిగ్ బాస్ సీజన్ 4లో కంటెస్టెంట్ గా పాల్గొని పాపులర్ అయ్యారు. మధ్యలో కొన్ని సినిమాలు చేసినా రాని పాపులారిటీ బిగ్ బాస్ షోతో సంపాదించాడు. సీజన్ 4కి విన్నర్ గా నిలిచి ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్నాడు.
Also Read : Chandini Chowdary Photos: 'కలర్ ఫోటో' బ్యూటీ.. గ్లామర్ షోలో నో లిమిట్స్..
అయితే ఆ క్రేజ్ ను అభిజిత్ సరిగ్గా వాడుకోలేకపోతున్నాడు. బిగ్ బాస్ ఐదో సీజన్ కూడా మొదలైంది. కానీ అభిజిత్ నుంచి మాత్రం కొత్త సినిమా ప్రకటనలు రాలేదు. ఆయనతో పాటు బిగ్ బాస్ హౌస్ లో కనిపించిన అఖిల్, మెహబూబ్, మోనాల్, హారిక, అరియనా, దివి వంటి వారు కెరీర్ పరంగా దూసుకుపోతుంటే.. అభిజిత్ మాత్రం ఇంకా ఒక్క సినిమాను కూడా అనౌన్స్ చేయలేదు. ఆ మధ్య మూడు సినిమాలకు సంబంధించిన స్క్రిప్ట్ లు వింటున్నానని తెలిపారు.
మూడు కథలు మూడు డిఫరెంట్ జోనర్ లో ఉంటాయని చెప్పారు. కానీ ఇప్పటివరకు ఒక్క సినిమాకు కూడా ప్రకటించలేదు. దానికి కారణం.. మధ్యలో అభిజిత్ ఆరోగ్యం సహకరించలేదట. కాలు సర్జరీకి సంబంధించిన రిపోర్టులు కూడా పెట్టారు. అలా ఇప్పుడు కూడా అభిజిత్ ఆరోగ్య సమస్యలతోనే సతమతమవుతున్నట్లు కనిపిస్తోంది. ముందుగా తన ఆరోగ్యాన్ని కాపాడుకోవడమే తనకు ముఖ్యమని అభిజిత్ ట్వీట్ మరిన్ని అనుమానాలకు తావిస్తోంది.
రీసెంట్ గా అభిమానులతో ముచ్చటించిన అభిజిత్ ను నెటిజన్లు.. పలు రకాల ప్రశ్నలు అడిగారు. కొత్త సినిమా ప్రకటన ఎప్పుడు ఉంటుందని అభిజిత్ ని ఒకరి తరువాత ఒకరు ప్రశ్నిస్తూనే ఉన్నారు. దానికి స్పందించిన ఈ నటుడు 'ముందు ఆరోగ్యమే తనకు ముఖ్యమని' అన్నారు. అంటే తన ఆరోగ్యం సెట్ అయ్యేవరకు అభిజిత్ సినిమాలు అనౌన్స్ చేయరన్నమాట..!
Guys, thanks so much for coming. It’s really difficult to see all your tweets but I can tell you that I have tried very much to reply to everyone.
— Abijeet (@Abijeet) September 12, 2021
I only have one thing to say right now, my body is my only priority. Health is wealth 🙏🏽
Also Read :RRR Release Date: వేసవికే ఫిక్స్ అయిన రాజమౌళి.. మరి నిర్మాత ఏం చేస్తారో..
Also Read : 'ఏంది నీ లొల్లి..' కాజల్ పై శ్రీరామచంద్ర ఫైర్.. విశ్వను ఛీ కొట్టిన రవి..