Sabarimala Temple: శబరిమల అయ్యప్ప దర్శనాలు ప్రారంభం - ఏ సమయాల్లో దర్శించుకోవచ్చంటే?
Sabarimala Darshan: కేరళ శబరిమల ఆలయం శుక్రవారం సాయంత్రం తెరుచుకుంది. మండలం - మకరవిళక్కు సీజన్‌లో భాగంగా అధికారులు భక్తులను దర్శనాలకు అనుమతించారు.

Sabarimala Ayyappa Temple Opens: మండల - మకరవిళక్కు సీజన్‌లో భాగంగా కేరళలోని శబరిమల ఆలయం (Sabarimala Temple) శుక్రవారం సాయంత్రం తెరుచుకుంది. తొలి రోజే వర్చువల్ బుకింగ్ ద్వారా దాదాపు 30 వేల మంది భక్తులు నమోదు చేసుకున్నట్లు తెలుస్తోంది. భక్తుల రద్దీ దృష్ట్యా ఓ గంట ముందే ఆలయాన్ని తెరిచినట్లు ట్రావెన్ కోర్ దేవస్థానం (Travencore Devasthanam Board) బోర్డు వెల్లడించింది. శనివారం తెల్లవారుజాము నుంచి భక్తులను దర్శనాలకు అనుమతిస్తారు. ఈ సీజన్‌లో దర్శన సమయాలను 18 గంటలకు పొడిగించినట్లు తెలిపింది. శనివారం తెల్లవారుజామున 3 గంటలకు ఆలయ గర్భగుడిని ప్రధాన అర్చకుడు అరుణ్‌కుమార్ నంబూథిరి తెరవనున్నట్లు అధికారులు తెలిపారు.
#WATCH | Kerala: Thousands of devotees of Lord Ayyappa throng Sabarimala temple, as the temple opened today to mark the start of the annual Mandala-Makaravilakku festival, marking the beginning of the annual pilgrimage season. pic.twitter.com/a5coNY2tn4
— ANI (@ANI) November 15, 2024
కాగా, మండల సీజన్ అధికారికంగా శనివారం ప్రారంభమై డిసెంబర్ 26 వరకూ కొనసాగుతుంది. డిసెంబర్ 30వ తేదీ నుంచి మొదలయ్యే మకరవిళక్కు.. జనవరి 20, 2025 వరకూ కొనసాగుతుంది. ప్రతీ రోజూ 18 గంటల పాటు దర్శనాలకు అనుమతిస్తారు. తెల్లవారుజామున 3 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ.. తిరిగి మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకూ భక్తుల దర్శనాలు కొనసాగుతాయి. రోజుకు గరిష్టంగా 80 వేల మందిని మాత్రమే దర్శనానికి అనుమతిస్తామని అధికారులు తెలిపారు. వర్చువల్ బుకింగ్ సమయంలోనే.. యాత్రికులు తమ ప్రయాణ మార్గాన్ని సైతం ఎంచుకునే వెసులుబాటును కల్పించారు. దర్శనాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. అటవీ మార్గంలో అన్నీ సౌకర్యాలు కల్పించినట్లు చెప్పారు. పార్కింగ్ ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు చర్యలు చేపట్టారు.
రూ.5 లక్షల ఉచిత బీమా
మరోవైపు, స్వామి దర్శనం కోసం వచ్చే భక్తులు ఒక్కొక్కరికి రూ.5 లక్షల ఉచిత బీమా కల్పించనున్నట్లు ఇప్పటికే ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు ప్రకటించింది. ప్రమాదవశాత్తు మరణించే భక్తులను వారి స్వస్థలాలకు తరలించే ఏర్పాట్లను చేస్తామని తెలిపింది. ఈసారి 20 లక్షల మంది భక్తులకు సన్నిధానం వద్ద అన్నదానం చేసేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
Also Read: PM Modi: ప్రధాని మోదీ ఎయిర్ క్రాఫ్ట్‌లో సాంకేతిక సమస్య
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

