News
News
X

Modi Meets Pope Francis: పోప్‌తో ప్రధాని మోదీ భేటీ.. ఇండియాకు రావాలని ఆహ్వానం

పోప్‌ను తాను కలిసినట్లుగా ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. పోప్ ఫ్రాన్సిస్‌తో చక్కని భేటీ జరిగిందని, ఆయన్ని కలిసి ఎన్నో అంశాల గురించి చర్చించామని ట్వీట్‌లో పేర్కొన్నారు.

FOLLOW US: 

ఇటలీ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ శనివారం క్రైస్తవ మత గురువు అయిన పోప్ ఫ్రాన్సిస్‌ను కలిశారు. శనివారం ఆయన వాటికన్ సిటీకి చేరుకున్నారు. ఈ మేరకు పోప్‌ను తాను కలిసినట్లుగా ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. పోప్ ఫ్రాన్సిస్‌తో చక్కని భేటీ జరిగిందని, ఆయన్ని కలిసి ఎన్నో అంశాల గురించి చర్చించామని ట్వీట్‌లో పేర్కొన్నారు. దాదాపు 30 నిమిషాల పాటు భేటీ సాగినట్లు వివరించారు. అంతేకాక, భారత్‌కు రావాలని పోప్ ఫ్రాన్సిస్‌ను ఆహ్వానించినట్లుగా వివరించారు. దీనికి సంబంధించి ఫోటోలను మోదీ ట్వీట్ చేశారు.

Also Read: హిందూ దేవతలపై అభ్యంతరకర పోస్టులు... తొలగించాలని ట్విట్టర్ ను కోరిన దిల్లీ హైకోర్టు

వాటికన్ సిటీలో పోప్‌ను కలిసిన ఐదో భారత ప్రధాని మోదీ కావడం విశేషం. అంతకుముందు మాజీ ప్రధానులుగా ఉన్న నెహ్రూ, ఇందిరా గాంధీ, ఐకే గుజ్రాల్, వాజ్ పేయీ వంటి వారు పోప్‌ను కలిసిన వారిలో ఉన్నారు. 1955లో జులైలో నెహ్రూ ఇటలీకి వెళ్లినప్పుడు పోప్‌ పీయూస్‌తో సమావేశం అయ్యారు. 1981లో ఇందిరా గాంధీ, 1997లో ఐకే గుజ్రాల్, 2000 సంవత్సరంలో వాజ్ పేయీ కూడా ఆ సమయాల్లో ఉన్న పోప్‌లను కలిశారు.

Also read: ఆరుగంటల కన్నా తక్కువ నిద్రపోతున్నారా? అయితే మీ శరీరంలో ఈ మార్పులు తప్పవు

ప్రధాని మోదీ ఐదు రోజుల యూరప్ పర్యటన ప్రస్తుతం సాగుతోంది. శుక్రవారం ఇటలీ రాజధాని రోమ్‌కు ఆయన చేరుకున్నారు. ఇవాల్టి నుంచి రెండు రోజులు జీ-20 సదస్సులో పాల్గొంటారు. ఈ సందర్భంగా కొన్ని దేశాల అధినేతలతో భేటీ అవుతారు. ఇటలీ నుంచి ప్రధాని మోదీ బ్రిటన్ పర్యటనకు వెళ్లనున్నారు. అక్కడ కాప్-26 అనే సదస్సులో మోదీ పాల్గొంటారు.

Also Read: ఇటలీలో ప్రధానికి ఘన స్వాగతం.. మహాత్ముడికి మోదీ నివాళి

Also read:  కూర్చుని - నిల్చునే ఈ టెస్ట్ చెప్పేస్తుంది... వచ్చే అయిదేళ్లలో మీ ఆరోగ్యం గురించి

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 30 Oct 2021 03:17 PM (IST) Tags: PM Modi Modi meets Pope Francis Modi in vatican city Modi Italy tour Modi Italy News

సంబంధిత కథనాలు

Nitin Gadkari: పేదలు ఎక్కువగా ఉన్న ధనిక దేశం మనది, నితిన్ గడ్కరీ కామెంట్స్ నిజమేనా?

Nitin Gadkari: పేదలు ఎక్కువగా ఉన్న ధనిక దేశం మనది, నితిన్ గడ్కరీ కామెంట్స్ నిజమేనా?

RBI Repo Rate Hike: సామాన్యుడిపై వడ్డీల పిడుగు- మరోసారి రెపో రేటు పెంపు!

RBI Repo Rate Hike: సామాన్యుడిపై వడ్డీల పిడుగు- మరోసారి రెపో రేటు పెంపు!

Delhi News: వీళ్లు విద్యార్థులా వీధి రౌడీలా? మరీ ఇలా కొట్టుకుంటున్నారేంటో!

Delhi News: వీళ్లు విద్యార్థులా వీధి రౌడీలా? మరీ ఇలా కొట్టుకుంటున్నారేంటో!

Viral Video: పీక నొక్కుతూ, జుట్టు పట్టుకుని ఈడ్చుకుంటూ- విద్యార్థిపై టీచర్ ప్రతాపం!

Viral Video: పీక నొక్కుతూ, జుట్టు పట్టుకుని ఈడ్చుకుంటూ- విద్యార్థిపై టీచర్ ప్రతాపం!

Congress President Election: కాంగ్రెస్ ప్రెసిడెంట్ రేసులో మరో ట్విస్ట్, చివరి నిముషంలో తెరపైకి మల్లికార్జున్ ఖార్గే పేరు

Congress President Election: కాంగ్రెస్ ప్రెసిడెంట్ రేసులో మరో ట్విస్ట్, చివరి నిముషంలో తెరపైకి మల్లికార్జున్ ఖార్గే పేరు

టాప్ స్టోరీస్

వైసీపీ నేతల ఆశలపై నీళ్లు చల్లిన జగన్

వైసీపీ నేతల ఆశలపై నీళ్లు చల్లిన జగన్

APTET 2022 Result: ఏపీటెట్-2022 ఫలితాలు విడుదల, 58.07 శాతం అర్హత, ఇక్కడ చూసుకోండి!

APTET 2022 Result: ఏపీటెట్-2022 ఫలితాలు విడుదల, 58.07 శాతం అర్హత, ఇక్కడ చూసుకోండి!

Adipurush Teaser Poster : విల్లు ఎక్కుపెట్టిన శ్రీరామునిగా ప్రభాస్ వచ్చాడు - అభిమానులకు పండగ షురూ

Adipurush Teaser Poster : విల్లు ఎక్కుపెట్టిన శ్రీరామునిగా ప్రభాస్ వచ్చాడు - అభిమానులకు పండగ షురూ

KCR National Party: కేసీఆర్ జాతీయ పార్టీ తొలి సభ కరీంనగర్ లోనేనా? కారణం ఏంటంటే

KCR National Party: కేసీఆర్ జాతీయ పార్టీ తొలి సభ కరీంనగర్ లోనేనా? కారణం ఏంటంటే