Delhi HC on Twitter: హిందూ దేవతలపై అభ్యంతరకర పోస్టులు... తొలగించాలని ట్విట్టర్ ను కోరిన దిల్లీ హైకోర్టు
హిందూ దేవతలపై అభ్యంతరకర పోస్టులను తొలగించాలని ట్విట్టర్ ను దిల్లీ హైకోర్టు కోరింది. ప్రజల ఆచార వ్యవహారాలను గౌరవించాలని సూచించింది.
హిందూ దేవతలపై ట్విట్టర్ లో చేసిన అభ్యంతరకర పోస్టులను తొలగించాలని దిల్లీ హైకోర్టు ట్విట్టర్ ను కోరింది. ప్రజల ఆచార వ్యవహారాలను గౌరవించాలని సూచించింది. ప్రజల కోసం బిజినెస్ చేస్తున్న ట్విట్టర్ వారి ఆచారాలను గౌరవించాలని తెలిపింది. అభ్యంతర అంశాలు తొలగింపుపై ఏ నిర్ణయం తీసుకున్నారో తెలిపాలని ట్విట్టర్ కౌన్సిల్ ను దిల్లీ హైకోర్టు ప్రశ్నించింది.
Also Read: G20 Summit 2021: రోమ్ చేరుకున్న ప్రధాని.. జీ20, కాప్- 26 సదస్సులతో మోదీ బిజీ
రాహుల్ గాంధీ పోస్టులే తొలగించారు
'మీరు ప్రజల కోసం వ్యాపారం చేస్తున్నారు. కాబట్టి సాధారణ ప్రజల మనోభావాలను గౌరవించాలి. వారి మనోభావాలకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలి. ఇలాంటి అభ్యంతర అంశాలను తొలగించాలి’ అని దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీఎన్ పటేల్, జస్టిస్ జ్యోతి సింగ్‌లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. అభ్యంతరకర పోస్టులను తొలగించాలని సూచించింది. రాహుల్‌గాంధీ పోస్టులు డిలీట్ చేసిన విషయాన్ని ధర్మాసనం గుర్తుచేసింది.
Also read: కూర్చుని - నిల్చునే ఈ టెస్ట్ చెప్పేస్తుంది... వచ్చే అయిదేళ్లలో మీ ఆరోగ్యం గురించి
ఉత్తర్వులు జారీ చేస్తే పాటిస్తాం
కోర్టు ఉత్తర్వులు జారీ చేస్తే అందుకు కట్టుబడి ఉంటామని ట్విట్టర్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా పేర్కొన్నారు. ఈ కేసులో తదుపరి విచారణ నవంబర్ 30కి వాయిదా పడింది. @AtheistRepublic పేరుతో ట్విట్టర్ లో హిందూ దేవతలపై అభ్యంతర పోస్టులు పెడుతున్నారని ఆదిత్య సింగ్ దేశ్వాల్ దిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు. కాళి దేవత గురించి అవమానకరంగా వ్యాఖ్యానిస్తున్నారని ఆయన పిటిషన్ లో పేర్కొన్నారు.
Also read: ఆరుగంటల కన్నా తక్కువ నిద్రపోతున్నారా? అయితే మీ శరీరంలో ఈ మార్పులు తప్పవు
ఫిర్యాదు చేసిన తొలగించలేదు
పిటిషనర్ తరఫున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది సంజయ్ పొద్దార్... ఆ పోస్టుల్లో ఉన్న కంటెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (మధ్యవర్తి మార్గదర్శకాలు, డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్)2021 నిబంధనలకు విరుద్ధంగా ఉందని కోర్టుకు తెలిపారు. ఈ మేరకు ట్విట్టర్ గ్రీవియెన్స్ అధికారికి తెలియజేసినట్లు వివరించారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలోని నిబంధనల కింద ట్విట్టర్ చట్టపరంగా ఉన్న నిరోధాన్ని కోల్పోయందని కోర్టుకు వివరించారు. అభ్యంతర పోస్టులపై ట్విట్టర్ కు ఫిర్యాదు చేసినా...ఆ ఖాతాలోని కంటెంట్ చర్య తీసుకునే విధంగా లేదని ఆ పోస్టులను తొలగించేందుకు ట్విట్టర్ తిరస్కరించిందని పిటిషనర్ కోర్టుకు తెలిపారు. హిందూ దేవతలపై ఉన్న అభ్యంతరకర పోస్టులను వెంటనే తొలగించాలని ట్విట్టర్ కు ఆదేశాలు జారీచేయాలని కోర్టును కోరారు. అలాగే సంబంధిత ఖాతాను శాశ్వతంగా సస్పెండ్ చేసేలా ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
Also Read: ఇటలీలో ప్రధానికి ఘన స్వాగతం.. మహాత్ముడికి మోదీ నివాళి