News
News
వీడియోలు ఆటలు
X

G20 Summit 2021: రోమ్ చేరుకున్న ప్రధాని.. జీ20, కాప్- 26 సదస్సులతో మోదీ బిజీ

ఇటలీ పర్యటనలో భాగంగా రోమ్ నగరాన్ని చేరుకున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. జీ20 సదస్సు సహా పలు ద్వైపాక్షిక చర్చల్లో మోదీ పాల్గొంటారు.

FOLLOW US: 
Share:

జీ20 సదస్సు, కాప్-26 ప్రపంచ నేతల సదస్సులో పాల్గొనేందుకు ఇటలీ చేరుకున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. అయితే రోమ్‌ చేరుకున్న మోదీ.. ప్రపంచ ఆర్థిక స్థితిగతులు, కరోనా సంక్షోభం అనంతరం వైద్య రంగం పరిస్థితులపై గ్లాస్‌గౌలో జరగనున్న సమావేశంలో చర్చించనున్నట్లు తెలిపారు. 

ఇదే షెడ్యూల్..

ఇటలీ ప్రధాని మారియో డ్రాగీ ఆహ్వనం మేరకు రోమ్, వాటికన్ సిటీలో అక్టోబర్ 29-31 వరకు ప్రధాని మోదీ పర్యటిస్తారు. అనంతరం బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఆహ్వానం మేరకు గ్లాస్గో నగరాన్ని సందర్శించనున్నారు.

" రోమ్‌లో జరిగే 16వ జీ20 సదస్సులో నేను పాల్గొంటాను. కరోనా సంక్షోభం అనంతరం ప్రపంచ ఆర్థికం, వైద్య రంగం స్థితిగతులపై చర్చించనున్నాం. వాతావరణ మార్పులు, సుస్థిర అభివృద్ధి అంశాలపై కూడా చర్చిస్తాను.                                           "
-ప్రధాని నరేంద్ర మోదీ

నిన్న రాత్రి దిల్లీ నుంచి ప్రధాని మోదీ ఇటలీ బయలుదేరిన సమయంలో ప్రధాన మంత్రి కార్యాలయం ఓ ట్వీట్ చేసింది. 

ఇటలీ పర్యటనలో భాగంగా వాటికన్ సిటీని సందర్శించనున్న ప్రధాని మోదీ.. అక్కడ పోప్ ఫ్రాన్సిస్‌ను కలవనున్నట్లు సమాచారం. 

అక్టోబర్ 30-31 తేదీల్లో జీ20 సమావేశంలో మోదీ పాల్గొంటారు. ఇటలీ ప్రధాని మారియో డ్రాగితో ద్వైపాక్షిక భేటీ కూడా ఉంది. జీ20 సమావేశం అనంతరం గ్లాస్గోలో జరగనున్న కాప్26 వరల్డ్ లీడర్స్ సమిట్​లోనూ మోదీ పాల్గొంటారు.

Also read:  అష్టఐశ్వర్యాలుగా చెప్పుకునేవి ఇవే

Published at : 29 Oct 2021 12:27 PM (IST) Tags: Narendra Modi Prime Minister climate change G20 summit pandemic Covid-19 G20 Meet

సంబంధిత కథనాలు

Chandrababu: అరెస్టులు చేయకపోతే ప్రభుత్వానికి పొద్దు గడవట్లేదు - చంద్రబాబు ట్వీట్

Chandrababu: అరెస్టులు చేయకపోతే ప్రభుత్వానికి పొద్దు గడవట్లేదు - చంద్రబాబు ట్వీట్

ITBP Head Constable Posts: ఐటీబీపీలో 81 హెడ్ కానిస్టేబుల్ పోస్టులు, అర్హతలివే!

ITBP Head Constable Posts: ఐటీబీపీలో 81 హెడ్ కానిస్టేబుల్ పోస్టులు, అర్హతలివే!

Nirmal News: తడిచిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలి, ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన ఏలేటి మహేశ్వర్ రెడ్డి

Nirmal News: తడిచిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలి, ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన ఏలేటి మహేశ్వర్ రెడ్డి

ABP Desam Top 10, 6 June 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

ABP Desam Top 10, 6 June 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Kakinada MP Vanga Geetha: వైసీపీ ఎంపీ వంగా గీత నుంచి ప్రాణహాని! స్పందనలో కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన ఆడపడుచు

Kakinada MP Vanga Geetha: వైసీపీ ఎంపీ వంగా గీత నుంచి ప్రాణహాని! స్పందనలో  కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన ఆడపడుచు

టాప్ స్టోరీస్

Odisha Train Accident: రైలు ప్రమాదంలో మృతుల సంఖ్యపై ఒడిశా ప్రభుత్వం కీలక ప్రకటన, మళ్లీ పాత మాటే!

Odisha Train Accident: రైలు ప్రమాదంలో మృతుల సంఖ్యపై ఒడిశా ప్రభుత్వం కీలక ప్రకటన, మళ్లీ పాత మాటే!

Naga Shaurya: హీరో నాగశౌర్య సీరియస్, అలిగి వెళ్లిపోయిన అనంత్ శ్రీరామ్ - ఇంటర్వ్యూ వీడియో వైరల్

Naga Shaurya: హీరో నాగశౌర్య సీరియస్, అలిగి వెళ్లిపోయిన అనంత్ శ్రీరామ్ - ఇంటర్వ్యూ వీడియో వైరల్

GDS Results: ఏపీ, తెలంగాణ జీడీఎస్ 2023 ఫలితాలు విడుదల, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎప్పుడంటే?

GDS Results: ఏపీ, తెలంగాణ జీడీఎస్ 2023 ఫలితాలు విడుదల, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎప్పుడంటే?

తెలుగు రాష్ట్రాల్లో 'ఆదిపురుష్' ప్రీ రిలీజ్ బిజినెస్ - ఎన్ని కోట్లో తెలుసా!

తెలుగు రాష్ట్రాల్లో 'ఆదిపురుష్' ప్రీ రిలీజ్ బిజినెస్ - ఎన్ని కోట్లో తెలుసా!