PM Modi Italy Visit: ఇటలీలో ప్రధానికి ఘన స్వాగతం.. మహాత్ముడికి మోదీ నివాళి
రోమ్ నగరంలో ఉన్న మహాత్మా గాంధీ విగ్రహానికి ప్రధాని నరేంద్ర మోదీ నివాళులు అర్పించారు.
ఇటలీ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ రోమ్ నగరంలోని పియాజ్ గాంధీ ప్రాంతంలో పర్యటించారు. అక్కడ ఉన్న మహాత్మా గాంధీ విగ్రహానికి మోదీ నివాళులర్పించారు. ప్రధాని మోదీకి భారత సంతతి ప్రజలు ఘన స్వాగతం పలికారు. 'మోదీ.. మోదీ' అంటూ నినాదాలు చేశారు. తనను స్వాగతించేందుకు వచ్చిన ప్రజలతో మోదీ కాసేపు ముచ్చటించారు.
#WATCH Sanskrit chants, slogans of 'Modi, Modi' reverberate at Piazza Gandhi in Rome as Prime Minister Narendra Modi interacts with people gathered there
— ANI (@ANI) October 29, 2021
The PM is in Rome to participate in the G20 Summit. pic.twitter.com/G13ptYOAjB
In Rome, I had the opportunity to pay homage to Mahatma Gandhi, whose ideals give courage and inspiration to millions globally. pic.twitter.com/fbaSOYjIr4
— Narendra Modi (@narendramodi) October 29, 2021
జీ20 సమావేశం కోసం ఇటలీ వెళ్లిన ప్రధాని నరేంద్ర మోదీ.. యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు చార్లెస్ మైకేల్, యూరోపియన్ కమిషన్ అధ్యక్షుడు ఉర్సులా వాన్ డెర్ లెయన్‌తో సమావేశమయ్యారు. ఐరోపా, భారత్ మధ్య వ్యాపార సంబంధాలు, వాతావరణ మార్పు, కొవిడ్-19, అంతర్జాతీయ, ప్రాంతీయ అభివృద్ధి తదితర అంశాలపై చర్చించారు.
ఇదే షెడ్యూల్..
ఇటలీ పర్యటనలో భాగంగా వాటికన్ సిటీని సందర్శించనున్న ప్రధాని మోదీ.. అక్కడ పోప్ ఫ్రాన్సిస్‌ను కలవనున్నట్లు సమాచారం.
అక్టోబర్ 30-31 తేదీల్లో జీ20 సమావేశంలో మోదీ పాల్గొంటారు. ఇటలీ ప్రధాని మారియో డ్రాగితో ద్వైపాక్షిక భేటీ కూడా ఉంది. జీ20 సమావేశం అనంతరం గ్లాస్గోలో జరగనున్న కాప్26 వరల్డ్ లీడర్స్ సమిట్‌లోనూ మోదీ పాల్గొంటారు.
Also Read: Corona Cases: దేశంలో కొత్తగా 14,348 కరోనా కేసులు, 805 మరణాలు నమోదు
Also Read: WHO ON Covaxin: భారత్ టీకాలు భేష్.. కొవాగ్జిన్‌కు త్వరలోనే అనుమతి: డబ్ల్యూహెచ్ఓ
Also Read: G20 Summit 2021: రోమ్ చేరుకున్న ప్రధాని.. జీ20, కాప్- 26 సదస్సులతో మోదీ బిజీ
Also read: అష్టఐశ్వర్యాలుగా చెప్పుకునేవి ఇవే
Also read: ఆరుగంటల కన్నా తక్కువ నిద్రపోతున్నారా? అయితే మీ శరీరంలో ఈ మార్పులు తప్పవు