Corona Cases: దేశంలో కొత్తగా 14,348 కరోనా కేసులు, 805 మరణాలు నమోదు
దేశంలో కొత్తగా 14,348 కేసులు నమోదుకాగా 805 మంది మృతి చెందారు.
దేశంలో కరోనా కేసులు మరోసారి 15 వేల కంటే దిగువనే నమోదయ్యాయి. నిన్న 16 వేల కేసులు నమోదుకాగా కొత్తగా 14,348 కేసులు వెలుగుచూశాయి. అయితే మరణాల సంఖ్య మాత్రం పెరిగింది. కొత్తగా 805 మంది మృతి చెందారు. 13,198 మంది కరోనా నుంచి రికవరయ్యారు.
#CoronaVirusUpdates:
— #IndiaFightsCorona (@COVIDNewsByMIB) October 29, 2021
📍Total #COVID19 Cases in India (as on October 29, 2021)
▶98.19% Cured/Discharged/Migrated (3,36,27,632)
▶0.47% Active cases (1,61,334)
▶1.34% Deaths (4,57,191)
Total COVID-19 confirmed cases = Cured/Discharged/Migrated+Active cases+Deaths#StaySafe pic.twitter.com/wcniSxHIfu
యాక్టివ్ కేసుల సంఖ్య 1,61,334కి చేరింది. రికవరీ రేటు 98.20%గా ఉంది. 2020 మార్చి నుంచి ఇదే అత్యధికం. మరోవైపు వ్యాక్సిన్ డోసుల పంపిణీ 105 కోట్లకు చేరింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రి మన్‌సుఖ్ మాండవీయ ట్వీట్ చేశారు.
1️⃣0️⃣5️⃣ Crore Vaccines of Victory!
— Dr Mansukh Mandaviya (@mansukhmandviya) October 29, 2021
Congratulations to the people as India's #COVID19 vaccination drive achieves new accolades. pic.twitter.com/WZuJUEtHtJ
కేరళ..
కేరళలో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. కొత్తగా 9,445 మందికి కరోనా సోకగా 622 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య 49,29,397కు చేరగా మొత్తం మరణాల సంఖ్య 29,977కు పెరిగింది.
మొత్తం 14 జిల్లాల్లో ఎర్నాకులంలో అత్యధికంగా 1,517 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాతి స్థానాల్లో తిరువనంతపురం (1,284), కోజికోడ్ (961), త్రిస్సూర్ (952) ఉన్నాయి.
మహారాష్ట్ర..
మహారాష్ట్రలో కొత్తగా 1,418 కేసులు నమోదయ్యాయి. 36 మంది కరోనాతో మరణించారు.
Also Read: G20 Summit 2021: రోమ్ చేరుకున్న ప్రధాని.. జీ20, కాప్- 26 సదస్సులతో మోదీ బిజీ
Also read: అష్టఐశ్వర్యాలుగా చెప్పుకునేవి ఇవే
Also read: ఆరుగంటల కన్నా తక్కువ నిద్రపోతున్నారా? అయితే మీ శరీరంలో ఈ మార్పులు తప్పవు