Doctor Strange: ప్రభుత్వాసుపత్రిలో వైద్యుడు లేకపోతే అంతే మరి- పేషెంట్ బంధువులు చేసిన పనికి బిత్తరపోయిన డాక్టర్
వైద్యుడు చికిత్స బాగుందంటే రోగులు ఎంత దూరమైనా వెళ్తారు. ఎంతైనా ఖర్చు పెడతారు. ఛత్తీస్‌గఢ్‌లో జరిగింది మాత్రం చాలా అంటే చాలా విడ్డూరంగా ఉంది.
శుక్రవారం ఛత్తీస్‌గఢ్‌లోని కొరియాలోని బైకుంత్‌పూర్‌లోని జిల్లా ఆసుపత్రికి సీరియస్‌గా ఉందని ఓ రోగిని తీసుకొచ్చారు బంధువులు. అప్పటికే ఓపీ సేవలు మూసివేశామని మూడు గంటల తర్వాత డాక్టర్ వస్తారని అక్కడి స్టాఫ్ చెప్పారు. సివిల్ సర్జన్ ఎల్ ధృవ్ ఉన్నారా అని ఆ పేషెంట్ బంధువులు అడిగారు. ఆయన ఇంటికెళ్లిపోయారని.. ఇప్పట్లో రారని చెప్పారు.
సైలెంట్‌గా అక్కడి నుంచి వెళ్లిపోయిన ఆ పేషెంట్ బంధువులు... అక్కడే ఉన్న ఆసుపత్రిలో ఉన్న ఓ స్ట్రెచర్‌ను తీసుకున్నారు. ఆ రోగిని దానిపై పడుకోబెట్టి తోసుకుంటూ వైద్యుడికి ఇంటికి వచ్చేశారు. వైద్యుడు ఇంటి డోర్ కొట్టి అసలు విషయం చెబితే ఆ డాక్టర్ షాక్ తిన్నాడు.
Also Read: ‘టాస్’ వేసి ఎన్నికల్లో విజేతను నిర్ణయించారు, ఎక్కడో తెలుసా?
బైకుంత్‌పూర్‌లో కేఎల్ ధృవ్ చాలా ఫేమస్ డాక్టర్. చాలా మంది ఆయన హస్తవాసి మంచిదని చెబుతుంటారు. అందుకే ఏ పేషెంట్ వచ్చినా ఆయనే వైద్యం చేయాలని కోరుకుంటారు. వీళ్లు కూడా అదే అనుకున్నారు. ఆయన లేడని తెలిసే సరికి ఏకంగా స్ట్రెచర్‌పై వైద్యుడి ఇంటికే రోగిని తీసుకెళ్లిపోయారు.
Also Read: పెళ్లి చేసుకోరా నాయనా- ఏడాదికి 3 సార్లు హైక్ నీకే వాత్సాయనా!
దీనిపై ధ్రువ్ మాట్లాడుతూ "ఈ దృశ్యం చూసి చాలా బాధనిపించింది. రోగి బంధువులు మధ్యాహ్నం 1.30 గంటలకు ఆసుపత్రికి వచ్చారు. బైకుంత్‌పూర్‌లోని ప్రముఖ వైద్యుడు ధ్రువ్ ఎక్కడున్నారని అడిగారు. లేరని చెప్పడంతో వాళ్లు ఎవరికీ చెప్పాపెట్టకుండా రోగిని స్ట్రెచర్‌పై నా నివాసానికి వచ్చేశారు." అని ధ్రువ్ చెప్పారు. "ప్రాథమిక చికిత్స చేసిన తర్వాత అతన్ని ఆసుపత్రిలో చేర్పించాలని చెప్పాను. ఇప్పుడు ఆ రోగి ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నాడు." అన్నారాయన.
Also Read: చలాకీ కుక్క - గొర్రెలు కాస్తుంది, ట్రక్కు కూడా డ్రైవ్ చేస్తుంది, ఇదిగో మీరే చూడండి!
ఈ సంఘటన గురించి ఆసుపత్రి సిబ్బందికి ఎవరికీ తెలియదని... ఓపీడీ మూసివేసినప్పుడు ఈ రోగి వచ్చాడని.. వివరాలు కనుక్కొని అక్కడి నుంచి వెళ్లిపోయారని వివరించారు.
Also Read: ప్రియుడి కండోమ్‌కు సీక్రెట్‌గా రంథ్రాలు చేసిన మహిళ, ఊహించని శిక్ష విధించిన కోర్టు!
"ఇది మధ్యాహ్నం 1.30 గంటలకు జరిగింది. OPD మధ్యాహ్నం 1 గంటలకు మూసివేస్తారు. నేను మధ్యాహ్నం 2.30 గంటలకు ఆసుపత్రి నుంచి బయల్దేరి వచ్చేశాను. దాని గురించి ఎవరూ నాకు తెలియజేయలేదు" అని ధృవ్ చెప్పారు.
Also Read: శవపేటిక నుంచి శబ్దం, తెరిచి చూస్తే శవం లేచి కూర్చొంది, సంతోషించే లోపే మళ్లీ విషాదం
ఇదిలా ఉండగా, ఉత్తర్‌ప్రదేశ్‌లోని బల్లియాలో అంబులెన్స్ రాలేదని రోగిని నాటుబండిపై ఆసుపత్రికి తీసుకెళ్లారు. పెట్రోల్ లేకపోవడంతో రోగిని తీసుకెళ్లడానికి అంబులెన్స్ సిబ్బంది నిరాకరించడంతో వీళ్లు ఆ పని చేశారు.
Also Read: భూమి తిరగడం ఆగిపోతే అంత భయానకంగా ఉంటుందా? షాకింగ్ న్యూస్ చెప్పిన ఖగోళ శాస్త్రవేత్త