Dog Driving Truck: చలాకీ కుక్క - గొర్రెలు కాస్తుంది, ట్రక్కు కూడా డ్రైవ్ చేస్తుంది, ఇదిగో మీరే చూడండి!
ఈ కుక్క సాధారణమైనది కాదు. దీనికి గొర్రెలను మేపడమే కాదు.. ట్రక్కు డ్రైవ్ చేయడం కూడా తెలుసు.
కుక్కలు డ్రైవింగ్ చేయడాన్ని మీరు ఎప్పుడైనా చూశారా? అయితే, మీరు ఈ వీడియోను తప్పకుండా చూడాల్సిందే విక్లోరియాలోని హామిల్టన్‌కు సమీపంలో విక్టోరియన్ ఫారమ్‌లో నివసిస్తున్న లెక్సీ అనే ఈ కుక్క ఒకప్పుడు గొర్రెల కాపరిగా అందరి దృష్టిని ఆకట్టుకుంది. తాజాగా ఇది తన యజమాని కామ్ జ్షెచ్ వద్ద డ్రైవింగ్ కూడా నేర్చుకుంది.
ABC న్యూస్ వివరాల ప్రకారం.. లెక్సీ అంతకు ముందు గొర్రెలకు కాపలా కాయడంలో శిక్షణ పొందింది. మంద నుంచి ఒక్క గొర్రె కూడా తప్పకుపోకుండా పశువులశాలకు తరలించడం ఈ లెక్సీ ప్రత్యేకత. అయితే ఇటీవల దాని యజమానికి ఓ సరదా ఆలోచన వచ్చింది. లెస్సీని కారులో డ్రైవింగ్ సీట్లో కూర్చోబెట్టి స్టీరింగ్ వీల్ ఇచ్చేశాడు. దానికి బ్రేక్, ఎస్కలేటర్ అందకపోయినా.. స్టీరింగ్ కంట్రోల్ మాత్రం బాగానే చేసింది. అలా అది రోజూ ఆ ట్రక్కులో స్టీరింగ్ పట్టుకుని నిలబడి షికారు చేస్తోంది. అయితే, ఎస్కలేటర్ తొక్కకుండా ఆ కుక్క కారును ఎలా నడుపుతుందనేగా మీ సందేహం?
Also Read: ప్రియుడి కండోమ్‌కు సీక్రెట్‌గా రంథ్రాలు చేసిన మహిళ, ఊహించని శిక్ష విధించిన కోర్టు!
ట్రక్కు వేగంగా కదలకుండా దాని యజమాని ఫస్ట్ గేర్‌లో పెడతాడు. ఆ తర్వాత అతడు ప్యాసింజర్ సీట్లో కూర్చొని దానికి స్టీరింగ్ ఇస్తాడు. ఇప్పటివరకు లెక్సీ ఎలాంటి యాక్సిడెంట్‌లు చేయకుండా ట్రక్కు బాగానే నడిపిందట. అయితే, రోడ్డు మీదకు మాత్రం దాన్ని తీసుకెళ్లలేదు. లెక్సీ ట్రక్కు నడుపుతూ కూడా గొర్రెలను మేపుతోందని, గొర్రెలు ఎటు కదిలితే అటువైపు స్టీరింగ్ తిప్పుతోందని యజమాని తెలిపాడు. కుక్క కారు నడుపుతోందంటే మీకు కూడా నమ్మకం కలగడం లేదు కదూ. అయితే, మీరు తప్పకుండా ఈ వీడియో చూడాల్సిందే.
Also read: షిగెల్లా బ్యాక్టిరియా వల్ల మనదేశంలో తొలి మరణం? జాగ్రత్త ఈ బ్యాక్టిరియా అంటువ్యాధి