International Yoga Day 2024 Live: దాల్ సరసు ఒడ్డున ప్రధానమంత్రి మోదీ యోగాసనాలు
International Yoga Day 2024 Live updates: 2024 ఏడాదిలో పదో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. 'ఆత్మ, సమాజం కోసం యోగా' అనేది ఈ ఏడాది యోగాడే థీమ్.
LIVE
Background
International Yoga Day 2024 Celebrations: భారత్‌తోపాటు ప్రపంచంలోని చాలా దేశాల్లో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. 2014లో తొలిసారి ప్రపంచ యోగా దినోత్సవం నిర్వహించారు. ఈ ఏడాదితో ఇది పదేళ్లు పూర్తి చేసుకుంది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో కేంద్రం, రాష్ట్ర మంత్రులు, అధికారులు, వివిధ వర్గాల నిపుణులు కార్యక్రమంలో పాల్గొని యోగాసనాలు వేస్తున్నారు.
జమ్ముకశ్మీర్ రాజధాని శ్రీనగర్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గోనున్నారు. అక్కే దాస్ సరసు ఒడ్డున యోగాసనాలు వేయనున్నారు. మూడోసారి ప్రధానమంత్రి అయిన తర్వాత తొలిసారిగా జమ్ముకశ్మీర్‌లో ఆయన పర్యటిస్తున్నారు. దీని కోసం విస్తృతమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
'ఆత్మ, సమాజం కోసం యోగా' పేరుతో ఈసారి యోగావేడుకలను నిర్వహిస్తున్నారు. ఇది స్వీయ ఆరోగ్యంతోపాటు సమాజ బాగు కోసం మనం ఏం చేయాలో చెప్పేలా ఈసారి కార్యక్రమాలను డిజైన్ చేశారు. శ్రీనగర్‌లోని షేర్-ఎ-కశ్మీర్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ సెంటర్ (ఎస్ కేఐసీసీ)లో జరిగే ఓ కార్యక్రమంలో ప్రధానమంత్రి మోదీ పాల్గొంటారు. దాల్ సరస్సు ఒడ్డున మోదీతోపాటు 7,000 మందికి పైగా ప్రజలు యోగాసనాలు వేయనున్నారు.
ఆరోగ్యం, ప్రజా శ్రేయస్సు కోసం ఏటా జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. 2014లో ఐక్యరాజ్యసమితి జూన్ 21వ తేదీని అంతర్జాతీయ యోగా దినంగా గుర్తించింది. 2014లో ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో మాట్లాడిన మోదీ... యోగా గురించి మాట్లాడి యోగాడే ప్రతిపాదన చేశారు. 2014 డిసెంబర్‌లో ఐక్యరాజ్యసమితి జూన్ 21ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా గుర్తిస్తూ తీర్మానం చేసింది. అప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా యోగాడేను జరుపుకుంటున్నారు.
ఐక్యరాజ్యసమితి యోగాను భారతదేశంలో ఉద్భవించిన శారీరక, మానసిక మరియు ఆధ్యాత్మిక అంశాలతో కూడిన పురాతన వ్యవస్థగా అభివర్ణించింది. 'యోగం' అనే పదం సంస్కృతం నుండి వచ్చింది, అంటే శరీరం మరియు చైతన్యం యొక్క ఏకీకరణను సూచిస్తుంది. ఈ రోజు యోగా భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. యోగా డేకు సంబంధించిన లేటెస్ట్ అప్ డేట్స్ ను కింద ఇచ్చిన కార్డుల్లో చదవొచ్చు.
International Yoga Day 2024 Live: ఆరోగ్యం, సంతోషకరమైన ప్రపంచం కోసం యోగాను స్వీకరిద్దాం: కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
International Yoga Day 2024 Live: ఆరోగ్యం, సామరస్యంతో ఏకం చేసే యోగాను రోజూ ప్రాక్టీస్ చేద్దామన్నారు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు. పదో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆయన ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఆరోగ్యకరమైన, సంతోషకరమైన ప్రపంచం కోసం యోగాను కొనసాగిద్దామన్నారు.
International Yoga Day 2024 Live: ఆర్మీ అధికారుల యోగాసనాలు చూశారా!
International Yoga Day 2024 Live: అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆర్మీ అధికారులు రాజస్థాన్‌లోని ఎడారి ఇసుకుతిన్నెలపై యోగాసనాలు వేశారు.
International Yoga Day 2024 Live: ప్రతి ఒక్కరూ యోగాను జీవితంలో భాగంగా చేసుకోవాలి: సజ్జనార్
International Yoga Day 2024 Live: ప్రజలకు అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు చెప్పిన తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్.... యోగా చేయడం వల్ల ఆరోగ్యాన్ని సంరక్షించుకోవడంతో పాటు మానసిక ఉల్లాసాన్ని పొందవచ్చన్నారు. దీని వల్ల క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం అలవడుతుందని అభిప్రాయపడ్డారు. ప్రతి ఒక్కరు తమ దైనందిన జీవితంలో యోగాను భాగస్వామ్యం చేసుకోవాలని సూచించారు.
International Yoga Day 2024 Live: ప్రజలందరికి అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు చెప్పిన పురందేశ్వరి
International Yoga Day 2024 Live: శారీరక, మానసిక సమతుల్యత కోసం ప్రపంచానికి భారత్ అందించిన వరం యోగా అని అభిప్రాయపడ్డారు ఎంపీ, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి. యోగాను సాధన చేద్దాం... ఆరోగ్యాన్ని కాపాడుకుందాం... అని పిలుపునిచ్చారు.
International Yoga Day 2024 Live: జీరో లైన్ వద్ద బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ సిబ్బంది ఆసనాలు
International Yoga Day 2024 Live: అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా అమృత్‌సర్‌లోని JCP అట్టారి వద్ద జీరో లైన్ వద్ద బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ సిబ్బంది యోగాసనాలు వేశారు.
Punjab: Border Security Force personnel performing Yoga at zero line at JCP Attari, Amritsar on the occasion of International Day of Yoga.
— ANI (@ANI) June 21, 2024
(Source: BSF Punjab Frontier) pic.twitter.com/3i8nSIICRv