అన్వేషించండి

PM Modi About Olympics: 2036 ఒలింపిక్స్ కు ఆతిథ్యం ఇవ్వడానికి భారత్ సన్నద్ధమవుతోంది: ప్రధాని మోదీ

2036 Olympics in India | 72వ జాతీయ వాలీబాల్ ఛాంపియన్‌షిప్ వారణాసిలో ఆదివారం ప్రారంభమైంది. 2036 ఒలింపిక్స్ నిర్వహణపై ప్రధాని మోదీ ప్రకటన చేశారు.

India likely to Host 2036 olympics | వారణాసి: 2026 ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇచ్చేందుకు భారతదేశం పూర్తిగా సన్నద్ధమవుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) ఆదివారం నాడు (జనవరి 4న) ఈ విషయాన్ని ప్రకటించారు. గత పదకొండున్నర ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం దేశంలో క్రీడా రంగంలో సమూల మార్పులు చేసి, 20కి పైగా ప్రధాన అంతర్జాతీయ టోర్నమెంట్లను నిర్వహించిందని ప్రధాని మోదీ గుర్తు చేశారు. భారత్ 'పూర్తి సన్నద్ధతతో' 2036 ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇచ్చేందుకు సిద్ధమవుతోందని ఆయన అన్నారు.

20కి పైగా అంతర్జాతీయ టోర్నమెంట్స్ నిర్వహించిన భారత్

వారణాసిలో నేడు ప్రారంభమైన 72వ సీనియర్ నేషనల్ వాలీబాల్ ఛాంపియన్‌షిప్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆన్‌లైన్‌లో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ‘గత దశాబ్దంలో ఫిఫా అండర్-17 ప్రపంచ కప్, హాకీ ప్రపంచ కప్ సహా 20కి పైగా ప్రధాన అంతర్జాతీయ టోర్నమెంట్లను దేశంలోని పలు నగరాల్లో నిర్వహించామని తెలిపారు. 2030 కామన్వెల్త్ క్రీడలు కూడా భారత్‌లోనే జరగనున్నాయి. భారత్ పూర్తి సన్నద్ధతతో 2036 ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇవ్వాలని చూస్తోంది. ఎక్కువ మంది క్రీడాకారులకు ఆడేందుకు ఎక్కువ అవకాశాలు కల్పించడం తమ లక్ష్యమని’ చెప్పారు.

క్రీడా రంగంలో సమూల మార్పులు

దేశం ప్రస్తుతం 'రిఫార్మ్ ఎక్స్‌ప్రెస్' పై ప్రయాణిస్తోందని ప్రధాని మోదీ అన్నారు. దేశంలోని ప్రతి రంగం, అభివృద్ధి నిర్వచనం ఈ 'రిఫార్మ్ ఎక్స్‌ప్రెస్' తో ముడిపడి ఉందని, క్రీడలు కూడా అందులో ఒకటని అన్నారు. ‘క్రీడా రంగంలో కూడా కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున సంస్కరణలు చేపట్టింది. నేషనల్ స్పోర్ట్స్ అడ్మినిస్ట్రేషన్ యాక్ట్, ఖేలో ఇండియా పాలసీ 2025... వంటి నిబంధనల ద్వారా సరైన ప్రతిభకు అవకాశం లభిస్తుంది. తద్వారా క్రీడా రంగంలో పారదర్శకత పెరుగుతుంది. అలాగే దేశ యువత క్రీడలు, విద్య రెండింటిలోనూ ఒకేసారి ముందుకు సాగనున్నారు. ఒకవైపు మనం మెరుగైన మౌలిక సదుపాయాలు, నిధుల సమీకరణ యంత్రాంగాన్ని సిద్ధం చేస్తున్నాం. దాంతో పాటు యువతకు అద్భుతమైన జీవితాన్ని క్రీడల ద్వారా అందించడానికి కూడా కృషి చేస్తున్నాం’ అన్నారు.

క్రీడలపై ప్రభుత్వం, సమాజంలో చిన్న చూపు ఉండేది

ఒకప్పుడు క్రీడల పట్ల ప్రభుత్వం, సమాజంలో సైతం ఉదాసీనత ఉండేదని మోదీ అన్నారు. చాలా తక్కువ మంది యువకులు క్రీడలను కెరీర్‌గా ఎంచుకునేవారు. గత దశాబ్దంలో క్రీడల పట్ల ప్రభుత్వం, సమాజం ఆలోచనలలో మార్పు కనిపిస్తోందని మోదీ అన్నారు. క్రీడా రంగంలో తన ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను ప్రస్తావిస్తూ, ‘మేం స్కూల్ స్థాయిలో కూడా క్రీడాకారులకు ఒలింపిక్ అనుభవాన్ని అందించడానికి కృషి చేస్తున్నాం. ఖేలో ఇండియా ప్రచారం వల్ల వందలాది మంది యువకులకు జాతీయ స్థాయిలో ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది. కొద్ది రోజుల కిందట ఎంపీ క్రీడా మహోత్సవం జరిగింది. ఇందులో కూడా దాదాపు కోటి మంది యువకులు పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. ఎంపీ క్రీడా మహోత్సవం సందర్భంగా కాశీకి చెందిన దాదాపు 3 లక్షల మంది యువకులు మైదానంలో సత్తా చాటారు.

వారణాసిలో వివిధ క్రీడలకు సంబంధించిన స్టేడియాలు నిర్మిస్తున్నాం. కొత్త క్రీడా సముదాయంలో చుట్టుపక్కల జిల్లాల క్రీడాకారులకు కూడా శిక్షణ పొందే అవకాశం లభిస్తోంది. మెగా టోర్నీలకు వారణాసి సిద్ధమవుతుండటంతో నాకు సంతోషంగా ఉంది. వాలీబాల్ జాతీయ పోటీల ద్వారా దేశ క్రీడల్లో నగరం స్థానం సంపాదించుకుంటుందని’ ప్రధాని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

National Saras Mela Droupadi Murmu: విజయవాడలో జాతీయ సరస్ మేళా 2026 - లఖ్‌పతి కాదు.. మహిళలను కరోడ్‌పతి దీదీలుగా మార్చాలి – రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పిలుపు!
విజయవాడలో జాతీయ సరస్ మేళా 2026 - లఖ్‌పతి కాదు.. మహిళలను కరోడ్‌పతి దీదీలుగా మార్చాలి – రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పిలుపు!
Actor Imran Khan Leave India Notice : అమెరికా సిటిజన్ అయి ఉండి కాక్రోచ్ నిరసనల్లో పాల్గొంటారా - అమీర్ ఖాన్ మేనల్లుడికి భారత్‌ను వీడాలని నోటీసులు!
అమెరికా సిటిజన్ అయి ఉండి కాక్రోచ్ నిరసనల్లో పాల్గొంటారా - అమీర్ ఖాన్ మేనల్లుడికి భారత్‌ను వీడాలని నోటీసులు!
Aurora Venkateswara Swamy Temple Mass Shooting Plot: అమెరికాలో వెంకటేశ్వరస్వామి ఆలయంలో మారణకాండకు కుట్ర - 19 ఏళ్ల శ్వేతజాతి ఉన్మాది అరెస్ట్!
అమెరికాలో వెంకటేశ్వరస్వామి ఆలయంలో మారణకాండకు కుట్ర - 19 ఏళ్ల శ్వేతజాతి ఉన్మాది అరెస్ట్!
Modi Cabinet Expansion | దీపావళికి ముందే మోదీ క్యాబినెట్ ప్రక్షాళన!  తెలంగాణ, ఏపీ కోటాలో మార్పులు?
Modi Cabinet Expansion | దీపావళికి ముందే మోదీ క్యాబినెట్ ప్రక్షాళన!  తెలంగాణ, ఏపీ కోటాలో మార్పులు?

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Local Body Elections : స్థానిక పోరులో బలమైన వ్యూహం - సీట్ల కేటాయింపుతో ఆగని టీడీపీ-జనసేన రగడ.. ఓటు బదిలీ సాధ్యమేనా?
స్థానిక పోరులో బలమైన వ్యూహం - సీట్ల కేటాయింపుతో ఆగని టీడీపీ-జనసేన రగడ.. ఓటు బదిలీ సాధ్యమేనా?
National Saras Mela Droupadi Murmu: విజయవాడలో జాతీయ సరస్ మేళా 2026 - లఖ్‌పతి కాదు.. మహిళలను కరోడ్‌పతి దీదీలుగా మార్చాలి – రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పిలుపు!
విజయవాడలో జాతీయ సరస్ మేళా 2026 - లఖ్‌పతి కాదు.. మహిళలను కరోడ్‌పతి దీదీలుగా మార్చాలి – రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పిలుపు!
Vijay Deverakonda Rashmika : పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విరోష్ కపుల్ - సత్యసాయి సన్నిధిలో ప్రత్యేక పూజలు
పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విరోష్ కపుల్ - సత్యసాయి సన్నిధిలో ప్రత్యేక పూజలు
Actor Imran Khan Leave India Notice : అమెరికా సిటిజన్ అయి ఉండి కాక్రోచ్ నిరసనల్లో పాల్గొంటారా - అమీర్ ఖాన్ మేనల్లుడికి భారత్‌ను వీడాలని నోటీసులు!
అమెరికా సిటిజన్ అయి ఉండి కాక్రోచ్ నిరసనల్లో పాల్గొంటారా - అమీర్ ఖాన్ మేనల్లుడికి భారత్‌ను వీడాలని నోటీసులు!
Jailer 2 Review - 'జైలర్ 2' రివ్యూ: 600 కోట్లు సినిమాకు సీక్వెల్... రజనీ మళ్ళీ బ్లాక్ బస్టర్ కొట్టారా?
'జైలర్ 2' రివ్యూ: 600 కోట్లు సినిమాకు సీక్వెల్... రజనీ మళ్ళీ బ్లాక్ బస్టర్ కొట్టారా?
Today OTT Movies : గురువారం ఓటీటీ మూవీస్ - ఒక్క రోజే 11 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి అస్సలు మిస్ కావొద్దు
గురువారం ఓటీటీ మూవీస్ - ఒక్క రోజే 11 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి అస్సలు మిస్ కావొద్దు
IAS Vikrant Marmat Transfer: బెంగళూరు పబ్ ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్.. ఐఏఎస్ అధికారి విక్రాంత్ మర్మత్‌పై బదిలీ వేటు!
బెంగళూరు పబ్ ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్.. ఐఏఎస్ అధికారి విక్రాంత్ మర్మత్‌పై బదిలీ వేటు!
CM Chandrababu: సీఎం చంద్రబాబు కేసుల బదిలీ పిటిషన్ పై హైకోర్టులో విచారణ.. ఈ నెల 26కి వాయిదా!
సీఎం చంద్రబాబు కేసుల బదిలీ పిటిషన్ పై హైకోర్టులో విచారణ.. ఈ నెల 26కి వాయిదా!
Embed widget