అన్వేషించండి

India EU FTA: భారత్- ఈయూ మధ్య కుదిరిన ట్రేడ్ డీల్.. మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ గా పేర్కొన్న ఈయూ ప్రెసిడెంట్

భారత్- EU మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం మంగళవారం కుదిరింది. ఇది రెండు బిలియన్ల ప్రజలకు స్వేచ్ఛా వాణిజ్య అవకాశాలు సృష్టిస్తుంది. సంతకాలు చేయడానికి 6 నెలలు పడుతుంది.

న్యూఢిల్లీ: భారత్, యూరోపియన్ యూనియన్ మధ్య చారిత్రాత్మకమైన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA) కుదరింది. చాలా కాలం నుంచి పెండింగ్‌లో ఉన్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ముగిసినట్లు మంగళవారం నాడు ప్రకటించారు. యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డెర్ లేయెన్ ఈ ఒప్పందాన్ని అన్ని వాణిజ్య ఒప్పందాలకు తల్లి (Mother Of All Trade Deals) అని అభివర్ణించారు. ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నత స్థాయి సమ్మిట్ కోసం EU అగ్ర నేతలతో సమావేశం నిర్వహించారు.

సమావేశంలో చారిత్రాత్మక ఒప్పందంపై ప్రకటన 

ఈయూ ప్రెడిసెంట్ వాన్ డెర్ లేయెన్, యూరోపియన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ ఆంటోనియో కోస్టాతో భారత ప్రధాని మోదీ చర్చలు జరిపారు. రెండు పక్షాలు ప్రపంచ భౌగోళిక, రాజకీయ అనిశ్చితి వేళ వాణిజ్య సంబంధాలను బలోపేతం చేయడానికి ప్రయత్నించాయి. వాణిజ్య ఒప్పందం అనంతరం ఈయూ ప్రెసిడెంట్ వాన్ డెర్ లేయెన్ మాట్లాడుతూ.. “యూరప్, భారతదేశం ఈ రోజు చరిత్ర సృష్టించాయి. మేం అన్ని ఒప్పందాలకు తల్లిగా ఈ వాణిజ్య ఒప్పందాన్ని భావిస్తున్నాం. మేం 2 బిలియన్ల ప్రజల స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి అవకాశం కల్పించాం.  రెండు వైపులా ప్రయోజనం పొందడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇది ప్రారంభం మాత్రమే. మేం మా వ్యూహాత్మక సంబంధాన్ని మరింత బలోపేతం చేయాలని భావిస్తున్నాం”అని ఆమె అన్నారు.

ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ, ఈ ఒప్పందం కేవలం వాణిజ్య ఒప్పందం మాత్రమే కాదని, ప్రపంచ సరఫరా గొలుసును బలోపేతం చేయడానికి ఒక ప్రధాన అడుగు అన్నారు. భారత విద్యార్థులు, కార్మికులకు కొత్త అవకాశాలను తెరుస్తుందన్నారు. సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో పరస్పర సహకారాన్ని మరింతగా పెంచుతుందని తెలిపారు. భారత రక్షణ కంపెనీలకు ఈయూ సహకారం లభిస్తుందని, సరికొత్త ఆవిష్కరణలు వస్తాయని దీమా వ్యక్తం చేశారు.

EU ఒక ప్రధాన వాణిజ్య భాగస్వామి
భారత్, ఈయూ ట్రేడ్ డీల్ ద్వారా 27 దేశాలతో ఈ FTA రైతులు, చిన్న పరిశ్రమలు, MSME లకు యూరోపియన్ మార్కెట్‌కు అవకాశాలు పెరుగుతాయి. యూరోపియన్ యూనియన్ భారతదేశానికి  ముఖ్యమైన వాణిజ్య భాగస్వామి. ఎందుకంటే మొత్తం వాణిజ్యంలో సుమారు 17 శాతం వాటాను కలిగి ఉంది. వస్తువుల ఎగుమతి, దిగుమతితో పాటు , రెండు వైపులా సేవల రంగంలో కూడా బలమైన భాగస్వామ్యం ఉంది. 2024 లో భారత్- EU సేవలలో వాణిజ్యం $83.10 బిలియన్లకు చేరుకుంది. వీటిలో IT, వ్యాపార సేవలు, టెలికమ్యూనికేషన్లు కీలకంగా మారాయి.

సోమవారం కర్తవ్య పథ్ లో జరిగిన భారతదేశ 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఇద్దరు EU నాయకులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. భారతదేశం, EU FTA చర్చల ముగింపును అధికారికంగా ప్రకటిస్తూ ప్రస్తుతం తాత్కాలిక ఒప్పంద పత్రంపై సంతకం చేశాయి. ఈ ఒప్పందంపై రెండువైపులా చట్టపరమైన పరిశీలన జరగనున్నందున, అధికారికంగా సంతకం చేయడానికి కనీసం 6 నెలలు పట్టవచ్చని అధికారులు తెలిపారు. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై చర్చలు మొదట 2007 లో ప్రారంభమయ్యాయి.  విభేదాల కారణంగా 2013 లో నిలిపివేశారు. జూన్ 2022 లో చర్చలు పునరుద్ధరించారు.

వాణిజ్యం, రక్షణ, వ్యూహాత్మక సహకారం

EU భారతదేశానికి అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. 2024–25 ఆర్థిక సంవత్సరంలో ద్వైపాక్షిక వాణిజ్యం సుమారు USD 136 బిలియన్లుగా ఉంది. ఇందులో భారత్ ఎగుమతులు USD 76 బిలియన్లు కాగా, దిగుమతులు USD 60 బిలియన్లుగా ఉన్నాయి. వాణిజ్యంతో పాటు, ఈ సమ్మిట్ రక్షణ, భద్రతా సహకారం, వాతావరణ చర్య, టెక్నాలజీ అంశాలను బలోపేతం చేయడంపై దృష్టి సారించింది. FTA తో పాటు, రెండు పక్షాలు రక్షణ ఫ్రేమ్‌వర్క్ ఒప్పందం, విస్తృత వ్యూహాత్మక ఎజెండాను ఆవిష్కరించనున్నాయి. 

రక్షణ, భద్రతా ఒప్పందాలు

భారతదేశం, EU 2004 నుండి వ్యూహాత్మక భాగస్వాములుగా ఉన్నాయి. ప్రతిపాదిత భద్రత, రక్షణ భాగస్వామ్యం (SDP) రక్షణ, భద్రతలో సహకారాన్ని మరింత పెంచుతుందని,  EU SAFE (యూరప్ కోసం భద్రతా చర్య) కార్యక్రమం కింద భారత కంపెనీలకు అవకాశాలను తెరుస్తుందని అధికారులు తెలిపారు. SAFE చొరవ అనేది EU సభ్య దేశాలలో రక్షణ సన్నద్ధతను పెంచడానికి చేపట్టిన యూరో 150 బిలియన్ల ఆర్థిక సాధనం.

సమాచార ఒప్పందం భద్రత (SOIA) కోసం చర్చలను ప్రారంభించాలని కూడా 2 పక్షాలు భావిస్తున్నాయి. ఇది పారిశ్రామిక రక్షణ సహకారాన్ని బలోపేతం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. భారత కార్మికుల యూరప్‌కు వలసలను సులభతరం చేసే ఒక ఒప్పందంపై సంతకం చేసే అవకాశం ఉంది. ఇది EU సభ్య దేశాల ద్వారా మెరుగైన కార్యక్రమాలకు ఒక ఫ్రేమ్‌వర్క్‌ను అందిస్తుంది.

ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ ఇప్పటికే భారతదేశంతో వలసలు, ఇతర అంశాలపై భాగస్వామ్యాన్ని కలిగి ఉన్నాయి. రష్యా-ఉక్రెయిన్ యుద్దం సహా ప్రధాన ప్రపంచ సవాళ్లపై నేతలు అభిప్రాయాలను షేర్ చేసుకోనున్నారు. పలు ఇతర రంగాలలో కూడా ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం ఉంది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

NMMSS Scholarship 2026-27 : NMMSS స్కాలర్‌షిప్ రిజిస్ట్రేషన్ ప్రారంభం, ఆగస్టు 31 వరకు దరఖాస్తు చేసుకోండి
NMMSS స్కాలర్‌షిప్ రిజిస్ట్రేషన్ ప్రారంభం, ఆగస్టు 31 వరకు దరఖాస్తు చేసుకోండి
Dharmendra Pradhan: విద్యార్థుల భవిష్యత్ కంటే మంత్రి పదవులు ముఖ్యం కాదు: Gen Z గురించి ధర్మేంద్ర ప్రధాన్ ఏమన్నారు
విద్యార్థుల భవిష్యత్ కంటే మంత్రి పదవులు ముఖ్యం కాదు: Gen Z గురించి ధర్మేంద్ర ప్రధాన్ ఏమన్నారు
CM Vijay Delimitation Meeting: తమిళనాడు సీఎం విజయ్‌కు బిగ్ షాక్! డీలిమిటేషన్ మీటింగ్‌ను బహిష్కరించిన 37 మంది ఎంపీలు
తమిళనాడు సీఎం విజయ్‌కు బిగ్ షాక్! డీలిమిటేషన్ మీటింగ్‌కు 37 మంది ఎంపీలు డుమ్మా!
Breaking News: పోక్సో కేసులో తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి పృధ్వీశ్వర్ రెడ్డిపై బీఫ్ఐ సస్పెన్షన్!
పోక్సో కేసులో తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి పృధ్వీశ్వర్ రెడ్డిపై బీఫ్ఐ సస్పెన్షన్!

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KCR: దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
Rajahmundry Medico Passes Away: రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
AP CM Chandrababu: ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
Rajahmundry Medico Priyanka: మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
Rahane -Jaiswal Incident:  గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. స్మార్ట్ మూవ్ తో యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన అజింక్య‌.. 
గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన సీనియర్
Rukmini Vasanth : అందాల రుక్మిణి వసంతమ్ - టాక్సిక్ బ్యూటీ స్టైలిష్ మెస్మరైజ్ లుక్
అందాల రుక్మిణి వసంతమ్ - టాక్సిక్ బ్యూటీ స్టైలిష్ మెస్మరైజ్ లుక్
ఈ నెలలో Kia కారు కొంటే రూ.లక్షల్లో ఆదా.. ఏ కారుపై ఎంత డిస్కౌంట్‌ ఉందంటే?
కియా కారు కొనేవాళ్లకు సర్‌ప్రైజ్‌ - రూ.లక్షన్నర మిగిలినట్లే!, ఈ డబ్బుతో మంచి బైక్‌ కొనొచ్చు
Mouneesha Chowdary: బిగ్ బాస్ 10 తెలుగులోకి స్నో అక్క.. జోరుగా ప్రచారం.. మౌనీషా చౌదరి రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
బిగ్ బాస్ 10 తెలుగులోకి స్నో అక్క.. మౌనీషా చౌదరి రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు!
Embed widget