అన్వేషించండి

US angry on India: భారత్, EU ట్రేడ్ డీల్‌పై అమెరికా ఆగ్రహం.. మాపై యుద్ధమా అన్న ట్రంప్ సన్నిహితుడు

భారతదేశం, యూరోపియన్ యూనియన్ EU మధ్య ఒప్పందం కుదుర్చుకోవడంపై అమెరికా ఆగ్రహం వ్యక్తం చేసింది. మాపైనే యుద్ధమా అని ట్రంప్ సన్నిహితుడు అన్నారు.

వాషింగ్టన్: భారతదేశం, యూరోపియన్ యూనియన్ (EU) దీర్ఘకాలంగా కొనసాగుతున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA) చర్చలను పూర్తి చేశాయి. భారత్, EU వాణిజ్య ఒప్పందంపై అగ్రరాజ్యం అమెరికా గుర్రుగా ఉంది. ఈయూతో భారత్ ట్రేడ్ డీల్ కోసం చర్చలు జరపడం అమెరికాపై యుద్ధం ప్రకటించడం లాంటిదంటూ అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించడానికి యూరప్ కంటే ఎక్కువ త్యాగాలు చేశామని పేర్కొన్నారు. 

 అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ విధానాలు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలతో వాణిజ్య సంబంధాలలో ఉద్రిక్తతలను పెంచిన సమయంలో ఈయూతో భారత్ డీల్ కుదుర్చుకునేందుకు చర్చలు జరిపింది. ముఖ్యంగా రష్యా నుండి చమురు కొనుగోలు చేసినందుకు భారతదేశంపై అమెరికా తీవ్ర ఆరోపణలు చేసింది.

భారతదేశం- EU FTA కోసం చర్చలు పూర్తి
భారత్, EU మధ్య FTA చర్చలు 2007లో తొలిసారి జరిగాయి. ఇప్పుడు ఒప్పందం చట్టపరంగా పరిశీలనకు సిద్ధంగా ఉందని ఇరుపక్షాలు పేర్కొన్నాయి. యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయన్ ఈ ట్రేడ్ డీల్‌ను "అన్ని ఒప్పందాల తల్లి" లాంటిది అన్నారు. 

రష్యా చమురుపై అమెరికా ఆరోపణలు
భారత్ రష్యా నుండి ముడి చమురును కొనుగోలు చేసి, దానిని శుద్ధి చేసి, ఆపై యూరోపియన్ దేశాలు అదే చమురు ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్నాయని అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెస్సెంట్ పేర్కొన్నారు. ఇది రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి నిధులు సమకూరుస్తోంది. అందుకే భారతదేశంపై అమెరికా 25% సుంకం విధించిందని, తరువా 50 శాతానికి పెంచారని ఆయన పేర్కొన్నారు.

ట్రంప్ కఠినమైన వైఖరి
డొనాల్డ్ ప్రభుత్వం రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించడానికి యూరప్ కంటే ఎక్కువ త్యాగాలు చేశామని పేర్కొంది. యూరప్ తనకు వ్యతిరేకంగా యుద్ధానికి నిధులు సమకూరుస్తోందని అమెరికా ప్రభుత్వం నమ్ముతుంది.

భారతదేశంపై 50% టారిఫ్

అమెరికా భారతదేశంపై మొత్తం 50% సుంకాలు విధించింది. ఈ సుంకంలో 25 శాతం రష్యా నుండి చమురు కొనుగోలు చేసినందుకు వేసింది. ఈ నిర్ణయం 2025 ఆగస్టులో తీసుకున్నారు. డోనాల్డ్ ట్రంప్ భారతదేశ 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా తన శుభాకాంక్షలు తెలిపారు. భారత్, అమెరికా ప్రపంచంలోనే అతిపెద్ద మరియు పురాతన ప్రజాస్వామ్య దేశాలు అని, వాటి సంబంధం చారిత్రాత్మకమైనదని అన్నారు.

ట్రంప్ విధానంతో రిపబ్లికన్లు విభేదిస్తున్నారు
ట్రంప్ సుంకాల విధానం అమెరికాకు హాని కలిగిస్తుందని రిపబ్లికన్ సెనేటర్ టెడ్ క్రూజ్ చెప్పినట్లు తెలుస్తోంది. ఒక మీడియా నివేదిక ప్రకారం, ఇది ఎన్నికల నష్టాలకు, రాజకీయ సంక్షోభానికి దారితీయవచ్చని ఆయన ట్రంప్‌ను హెచ్చరించారు.

భారతదేశం వైపు కెనడా కూడా మొగ్గు 
అమెరికా కఠినమైన వాణిజ్య విధానం కారణంగా, కెనడా కూడా భారత్‌తో తన సంబంధాన్ని పునరుద్ధరిస్తోంది. ప్రధాన మంత్రి మార్క్ కార్నీ నాయకత్వంలో, కెనడా భారతదేశాన్ని కీలకమైన వ్యూహాత్మక, వాణిజ్య భాగస్వామిగా భావిస్తోంది. కెనడాపై భారీ సుంకాలు విధించాలని అమెరికా కూడా బెదిరించింది. యూరోపియన్ యూనియన్, కెనడాతో సంబంధాలను బలోపేతం చేయడం వల్ల భారతదేశానికి ప్రయోజనం చేకూరుతుందని నిపుణులు భావిస్తున్నారు. ఇది భారతదేశానికి ఇంధన భద్రత, కొత్త మార్కెట్లు, US టారిఫ్ ఒత్తిడి నుండి కొంత ఉపశమనం కల్పిస్తుందని భావిస్తున్నారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

US Airstrikes On Iran: ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
Temple Dating: దేవాలయాల్లో డేటింగ్ క్యాంపులు జనాభాను పెంచుతాయా? ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడిదే డిస్కషన్!
దేవాలయాల్లో డేటింగ్ క్యాంపులు జనాభాను పెంచుతాయా? ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడిదే డిస్కషన్!
US Iran War: ఇక పగటిపూటే దాడులు, వచ్చేవారం నుంచి భీకర దాడులు చేస్తామంటూ డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్
ఇక పగటిపూటే దాడులు, వచ్చేవారం నుంచి భీకర దాడులు చేస్తామంటూ డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్
Breaking News:ఏపీ ప్రభుత్వం అద్భుతంగా పని చేస్తోంది--కళ్లు నెత్తికెక్కే ఓడిపోయాం- కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
ఏపీ ప్రభుత్వం అద్భుతంగా పని చేస్తోంది--కళ్లు నెత్తికెక్కే ఓడిపోయాం- కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Corona Deaths: ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
Rains In AP And Telangana: అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీలో ఈ జిల్లాల్లో మోస్తరు వర్షాలు.. తెలంగాణలో పలుచోట్ల తేలికపాటి జల్లులు
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీలో ఈ జిల్లాల్లో మోస్తరు వర్షాలు.. తెలంగాణలో పలుచోట్ల తేలికపాటి జల్లులు
US Airstrikes On Iran: ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
Telangana Congress Crisis: తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
Re-NEET UG 2026 Result: నీట్‌ రీటెస్ట్ 2026 ఫలితాలు విడుదల! 11.21 లక్షల మంది అభ్యర్థులు అర్హత!  
నీట్‌ రీటెస్ట్ 2026 ఫలితాలు విడుదల! 11.21 లక్షల మంది అభ్యర్థులు అర్హత!  
Asifabad Forest Officials Attack Case: సార్సాల అటవీ అధికారులపై దాడి కేసు.. మాజీ జెడ్పీ వైస్ చైర్మన్‌ సహా 8 మందికి జైలు శిక్ష
సార్సాల అటవీ అధికారులపై దాడి కేసు.. మాజీ జెడ్పీ వైస్ చైర్మన్‌ సహా 8 మందికి జైలు శిక్ష
Rohit Sharma Retirement: రోహిత్‌శర్మ రిటైర్మెంట్‌ న్యూస్! లార్డ్స్ వన్డే తర్వాత ఆటకు వీడ్కోలు! వరల్డ్‌కప్ ప్లాన్స్‌లో లేడని తేల్చి చెప్పిన బీసీసీఐ!
రోహిత్‌శర్మ రిటైర్మెంట్‌ న్యూస్! లార్డ్స్ వన్డే తర్వాత ఆటకు వీడ్కోలు! వరల్డ్‌కప్ ప్లాన్స్‌లో లేడని తేల్చి చెప్పిన బీసీసీఐ!
Supreme Court On Third Language: 9వ తరగతిలో మూడో భాష వద్దు - కేంద్రానికి సుప్రీంకోర్టు కీలక సూచన!
9వ తరగతిలో మూడో భాష వద్దు - కేంద్రానికి సుప్రీంకోర్టు కీలక సూచన!
Embed widget