అన్వేషించండి

US Iran War: ఇక పగటిపూటే దాడులు, వచ్చేవారం నుంచి భీకర దాడులు చేస్తామంటూ డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్

US Iran Conflict | దక్షిణ ఇరాన్ పై అమెరికా దాడుల్లో 30 మందికి పైగా పౌరులు మరణించారని ఇరాన్ ప్రభుత్వ ప్రతినిధి ఫాతిమా మొహజెరానీ తెలిపారు. ఇక నుంచి పగటిపూటే దాడులు చేస్తామని ట్రంప్ హెచ్చరించారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ట్రంప్ హెచ్చరిక: శాంతి చర్చలకు సహకరించకుంటే దాడులు తీవ్రతరం.
  • హార్మూజ్, తీర ప్రాంతాలపై అమెరికా దాడుల్లో పౌరులు మరణించారు.
  • బంపూర్ సైనిక స్థావరంపై దాడికి ప్రతీకారం తీర్చుకుంటామన్న ఇరాన్.

US Iran War Latest News: వాషింగ్టన్: శాంతి చర్చలకు టెహ్రాన్ సహకరించకపోతే వచ్చేవారం నుండి సైనిక దాడులను మరింత తీవ్రతరం చేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్  హెచ్చరించారు. వైట్‌హౌస్‌లో ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించిన అనంతరం ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటివరకూ అధికంగా రాత్రిపూట దాడులు చేసిన అమెరికా ఆర్మీ ఇక నుంచి పగటి పూటే దాడులు తీవ్రతరం చేస్తుందన్నారు.

ట్రంప్ ప్రకటన వెలువడిన తరువాత ఇరాన్‌పై అమెరికా మరోసారి దాడులు చేసింది. హర్మూజ్ జలసంధి, ఇరాన్ తీర ప్రాంతాల్లోని టెహ్రాన్ సైనిక మౌలిక సదుపాయాలే లక్ష్యంగా దాడులు చేసినట్లు యూఎస్ సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. అయితే, ఎక్కువగా రాత్రివేళల్లోనే దాడులు చేసిన యూఎస్ ఆర్మీ.. ప్రస్తుతం పగటిపూటనే మిస్సైల్, డ్రోన్ దాడులకు దిగుతోంది. ఇరాన్ రక్షణ, క్షిపణి స్థావరాలను లక్ష్యంగా చేసుకుని గ్రేటర్ తున్బ్ ద్వీపంపై దాడి జరిగింది. తమకు సహకరించకపోతే ఇరాన్ సైనిక సామర్థ్యాలను దెబ్బతీస్తామని ట్రంప్ స్పష్టం చేశారు.

ఇరాన్‌పై దాడులను తీవ్రతరం చేసిన అమెరికా

గత వారం నుంచి ఇరాన్‌పై అమెరికా తన దాడులను మరింత పెంచింది. అమెరికా ఇటీవల జరిపిన దాడిలో 30 మందికి పైగా పౌరులు ప్రాణాలు కోల్పోయారని, దాదాపు 260 మంది గాయపడ్డారని ఇరాన్ వైద్యారోగ్యశాఖ మంత్రి పేర్కొన్నారు. ఆ శాఖ ప్రతినిధి హుస్సేన్ కెర్మన్‌పూర్ మాట్లాడుతూ.. గాయపడిన వారిలో ముగ్గురు మహిళలు, 6 మంది పిల్లలు ఉన్నారని తెలిపారు. చికిత్స అందించిన తర్వాత ఇప్పటివరకు 222 మంది ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ చేశారు.

Also Read: US Iran War: తీవ్ర స్థాయికి అమెరికా, ఇరాన్‌ మధ్య యుద్ధం! 20 యుద్ధనౌకలు, వందలాది ఫైటర్ జెట్‌లతో హోర్ముజ్‌తో రౌండప్‌!

కొన్ని రోజుల కిందట హర్మూజ్‌లో అమెరికాకు చెందిన వాణిజ్య నౌక మీద దాడి తరువాత ఇరాన్‌తో సీజ్ ఫైర్ ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. ఆ తరువాత అమెరికా సైన్యం ఇరాన్ మీద విరుచుకుపడి దాడులు చేస్తోంది. ఇరాన్ సైతం అమెరికా ఆర్మీ బేస్ క్యాంపులపై మిస్సైల్, డ్రోన్లతో ప్రతీకార దాడులు చేసింది. అంతకుముందు బుధవారం ఇరాన్ ప్రభుత్వ ప్రతినిధి ఫాతిమా మొహాజెరానీ.. ఇటీవల దక్షిణ ఇరాన్‌పై అమెరికా జరిపిన దాడుల్లో 30 మందికి పైగా పౌరులు మరణించారని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు మొహాజెరానీ సంతాపం తెలిపారు. ఇరాన్ ప్రభుత్వం ప్రజలకు పూర్తి మద్దతుగా నిలుస్తుందని సోషల్ మీడియా Xలో పోస్ట్ చేశారు. 

అమెరికా దాడుల్లో ఇరాన్ సైనికుల మృతి

మరోవైపు, ఇరాన్ వార్తా సంస్థ తస్నిమ్ ప్రకారం, ఇరాన్‌లోని సిస్తాన్-బలూచిస్తాన్ ప్రావిన్స్‌లోని ఇరాన్‌షహర్ ప్రాంతంలో ఉన్న బంపూర్ బ్యారక్‌పై అమెరికా 13 క్షిపణులను ప్రయోగించింది. ఈ దాడిలో 388వ బ్రిగేడ్‌కు చెందిన ఏడుగురు ఇరాన్ సైనికులు మరణించగా, పలువురు గాయపడ్డారు. సైనిక స్థావరంలో ఉన్న భద్రతా చర్యల కారణంగా మరణాల సంఖ్య అధికం కాకుండా నివారించగలిగామని ఇరాన్ సైన్యం పేర్కొంది.

ఇరాన్ సైన్యం ప్రకారం, అమెరికా దాడుల లక్ష్యం వీలైనంత ఎక్కువ నష్టం కలిగించడం, అందుకోసం సైనిక స్థావరాలు,  సెక్యూరిటీ పోస్టులు, వారిని నివాస సౌకర్యాలను లక్ష్యంగా చేసుకున్నారు. ఈ దాడి కేవలం సైనిక స్థావరానికి నష్టం కలిగించడానికే పరిమితం కాలేదని, ఎక్కువ మంది ప్రజలకు నష్టం కలిగించడమే లక్ష్యమని ఇరాన్ సైన్యం పేర్కొంది.

 దాడులకు దీటైన జవాబిస్తాం: IRGC

ఆగ్నేయ ఇరాన్‌లోని బంపూర్ గారిసన్ ఆర్మీ బేస్ క్యాంపుపై జరిగిన దాడికి అమెరికా మీద ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ సైన్యం పేర్కొంది. ఈ దాడిని పిరికిపంద చర్యగా అభివర్ణించిన ఇరాన్ సైన్యం, సరైన సమయంలో దాడులు చేస్తామని హెచ్చరించింది. 

Frequently Asked Questions

శాంతి చర్చలకు సహకరించకపోతే అమెరికా ఏ చర్యలు తీసుకుంటుందని ట్రంప్ హెచ్చరించారు?

శాంతి చర్చలకు సహకరించకపోతే వచ్చే వారం నుండి సైనిక దాడులను మరింత తీవ్రతరం చేస్తామని ట్రంప్ హెచ్చరించారు. పగటిపూట కూడా దాడులు ఉంటాయని ఆయన తెలిపారు.

ఇటీవల అమెరికా దాడుల్లో ఇరాన్‌లో ఎంతమంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు?

ఇరాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం, ఇటీవల అమెరికా జరిపిన దాడుల్లో 30 మందికి పైగా పౌరులు మరణించారు. దాదాపు 260 మంది గాయపడ్డారు.

అమెరికా ఇరాన్‌పై దాడులను ఎందుకు తీవ్రతరం చేసింది?

హర్మూజ్‌లో అమెరికా వాణిజ్య నౌకపై దాడి జరిగిన తరువాత అమెరికా సీజ్ ఫైర్ ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. ఆ తర్వాత ఇరాన్‌పై దాడులను తీవ్రతరం చేసింది.

అమెరికా దాడులపై ఇరాన్ సైన్యం ఎలా స్పందించింది?

బంపూర్ గారిసన్ ఆర్మీ బేస్ క్యాంపుపై జరిగిన దాడిని పిరికిపంద చర్యగా అభివర్ణించిన ఇరాన్ సైన్యం, సరైన సమయంలో ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించింది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

US Iran War: ధరలు పెరిగినా సరే పెట్రోల్ కోనుగోలు చేయండి.. అమెరికన్లకు ట్రంప్ హుకుం
ధరలు పెరిగినా సరే పెట్రోల్ కోనుగోలు చేయండి.. అమెరికన్లకు ట్రంప్ హుకుం
Breaking News:ఎర్రకోటపై 13వ సారి జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రధానమంత్రి మోదీ
ఎర్రకోటపై 13వ సారి జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రధానమంత్రి మోదీ
Breaking News:
"నన్ను జైల్లో అవమానించారు" కర్నూలు పర్యటనలో జగన్ విమర్శలు 
Breaking News: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసిన మంత్రి నారాయణ.. రాజధాని ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి ఆహ్వానం
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసిన మంత్రి నారాయణ.. రాజధాని ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి ఆహ్వానం
Advertisement

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Padikkal Permanent Slot: సాయి సుదర్శన్ వచ్చినా పడిక్కల్ కే నంబర్ 3 ప్లేస్.. అతనిలో అద్భుత నైపుణ్యముంది.. మాజీ క్రికెట‌ర్ ప్రశంసలు!
సాయి సుదర్శన్ వచ్చినా పడిక్కల్ కే నంబర్ 3 ప్లేస్.. అతనిలో అద్భుత నైపుణ్యముంది.. మాజీ క్రికెట‌ర్ ప్రశంసలు!
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
TTD Online Booking: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
భారత్‌లో చిన్న కార్ల టైమ్‌ వచ్చిందా? మిడ్‌సైజ్‌ SUVల జోరు తగ్గుతుందా?
SUVల హవాకు చెక్.. ఇక చిన్న కార్లదే జోరు, ట్రెండ్‌ మారుతోందా?
సింగిల్‌ ఛార్జ్‌తో హైదరాబాద్‌ నుంచి విజయవాడ వెళ్లొచ్చు - Avore EX2 ధర, బ్యాటరీ, ఫీచర్లపై పూర్తి వివరాలు!
సింగిల్‌ ఛార్జ్‌తో ఏకంగా 255km ప్రయాణం.. Avore EX2 కొనే ముందు ఈ 5 విషయాలు తెలుసుకోండి!
Deputy CM Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి
జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి
Devdutt Padikkal Historic Ton: కోహ్లీ సరసన నిలిచి, ఎలైట్ లిస్ట్‌లోకి పడిక్కల్.. మెయిడిన్ టెస్టు సెంచరీతో సత్తా చాటిన దేవదత్
కోహ్లీ సరసన నిలిచి, ఎలైట్ లిస్ట్‌లోకి పడిక్కల్.. మెయిడిన్ టెస్టు సెంచరీతో సత్తా చాటిన దేవదత్
Embed widget