అన్వేషించండి

AP Corona Deaths: ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్

ఆంధ్రప్రదేశ్‌లో 12 కొవిడ్ కేసులు నమోదవగా, నలుగురు మృతి చెందారని వైద్యశాఖ అధికారులు తెలిపారు. ఆసుపత్రుల్లో వీటీఎం, పీపీఈ కిట్ల కొరత, ఆక్సిజన్ ప్లాంట్లు నిరుపయోగంగా మారడం ఆందోళన కలిగిస్తోంది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ఆంధ్రప్రదేశ్‌లో 12 కొవిడ్ కేసులు; నలుగురు మరణించారు.
  • కడపలో ముగ్గురు, కాకినాడలో ఒకరు మృతి; సహ-వ్యాధులతో.
  • వైరస్ జన్యు విశ్లేషణకు పుణెకు ఐదు నమూనాలిచ్చారు.
  • ఆసుపత్రులకు మార్గదర్శకాలు; వైద్య సామాగ్రి కొరతపై ప్రశ్నలు.

అమరావతి: భారత్‌లో మరోసారి కరోనా కేసులు నమోదవుతున్నాయి. మరణాలు కూడా సంభవిస్తుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో 12 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కాగా, వీరిలో నలుగురు బాధితులు మృతి చెందారని వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి జి.వీరపాండియన్ గురువారం ఒక ప్రకటనలో వెల్లడించారు. 

కడపలో ముగ్గురు, కాకినాడలో ఒక్కరు మృతి
కరోనా బారిన పడిన మరణించిన వారిలో వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన ముగ్గురు, కాకినాడ జిల్లాకు చెందిన ఒకరు ఉన్నారని, వారంతా ఇదివరకే తీవ్రమైన ఇతర ఆరోగ్య సమస్యలతో (కో-మార్బిడిటీస్) బాధపడుతున్నారని వీరపాండియన్ స్పష్టం చేశారు. వైరస్ జన్యు క్రమ స్వరూపాన్ని  విశ్లేషించేందుకు 5 శాంపిల్స్ సేకరించి పుణెలోని జాతీయ వైరాలజీ ల్యాబ్‌కు పంపినట్లు తెలిపారు. 

కడపలో అత్యధిక కరోనా కేసులు

ఏపీలో నమోదైన మొత్తం కోవిడ్19 కేసుల్లో అత్యధికంగా వైఎస్సార్ కడప జిల్లాలో 8 కేసులు, గుంటూరులో 2, విశాఖపట్నం, కాకినాడ జిల్లాల్లో ఒక్కో కేసు నమోదయ్యాయి. ప్రజలెవరూ ఆందోళన చెందకుండా తగిన ముందు జాగ్రత్తలు తీసుకోవాలని, లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించి చికిత్స తీసుకోవాలని  ఆయన సూచించారు.

మరోవైపు, రాష్ట్ర సర్వైలెన్స్ విభాగం ఇప్పటికే అన్ని బోధనాసుపత్రులు, జీజీహెచ్‌లు, డీఎంహెచ్‌వోలకు అత్యవసర మార్గదర్శకాలు జారీ చేసింది. ఆక్సిజన్ సిలిండర్లు, కరోనా మందులు, ఆర్టీపీసీఆర్ కిట్లను సిద్ధం చేసుకోవాలని ఆదేశించింది.  క్షేత్రస్థాయిలో రోగుల నుంచి కరోనా పరీక్షల కోసం స్వాబ్ నమూనాలను సేకరించేందుకు అవసరమైన వీటీఎం కిట్లు, వైద్య సిబ్బంది ధరించే పీపీఈ కిట్లు ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుబాటులో ఉన్నాయా అని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. 

గతంలో భారీగా కొనుగోలు చేసిన పీపీఈ కిట్లలో వ్యాలిడిటీ ముగిసిపోవడంతో దాదాపు 45 లక్షల కిట్లు వృథాగా మారాయి. ప్రస్తుతం పలు ప్రభుత్వ ఆసుపత్రుల్లోని ఆక్సిజన్ ప్లాంట్లు కూడా నిరుపయోగంగా మారడంతో తక్షణం దీనిపై చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని అధికారులు భావిస్తున్నారు. కరోనా కేసులు, నివారణ చర్యలు, వైద్యశాఖ చేపట్టాల్సిన చర్యలపై ఏపీ ప్రభుత్వం త్వరలోనే నిర్ణయం తీసుకోనుంది.

Frequently Asked Questions

ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుత కరోనా కేసుల సంఖ్య, మరణాలు ఎన్ని?

ఆంధ్రప్రదేశ్‌లో 12 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ కేసులలో నలుగురు బాధితులు మరణించారు.

మరణించిన కరోనా బాధితులు ఏ జిల్లాకు చెందినవారు, వారికి ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా?

మరణించిన వారిలో కడప జిల్లాకు చెందిన ముగ్గురు, కాకినాడ జిల్లాకు చెందిన ఒకరు ఉన్నారు. వారంతా ఇదివరకే ఇతర తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు ఎక్కువగా ఏ జిల్లాలో నమోదయ్యాయి?

ఆంధ్రప్రదేశ్‌లో నమోదైన మొత్తం కోవిడ్19 కేసుల్లో అత్యధికంగా వైఎస్సార్ కడప జిల్లాలో 8 కేసులు నమోదయ్యాయి. గుంటూరులో 2, విశాఖపట్నం, కాకినాడ జిల్లాల్లో ఒక్కో కేసు నమోదయ్యాయి.

కరోనా కేసుల పెరుగుదల దృష్ట్యా ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

ప్రజలెవరూ ఆందోళన చెందకుండా తగిన ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించి చికిత్స తీసుకోవాలి.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Amaravati Projects Budget: అమ‌రావ‌తిలో మొత్తం 119 ప‌నుల‌కు 66,802 కోట్లు ఖ‌ర్చు.. సభలో వెల్లడించిన మంత్రి నారాయణ
అమ‌రావ‌తిలో మొత్తం 119 ప‌నుల‌కు 66,802 కోట్లు ఖ‌ర్చు.. సభలో వెల్లడించిన మంత్రి నారాయణ
AP Assembly Session: ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభం, మండలిలో మెగా డీఎస్సీపై వైసీపీ ప్రశ్నలు!
ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభం, మండలిలో మెగా డీఎస్సీపై వైసీపీ ప్రశ్నలు!
Breaking News: ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభం
ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభం
TDP Janasena Social Media War: క్షేత్రస్థాయిలో పాలనలో సమన్వయం .. సోషల్ మీడియాలో సెల్ఫ్ గోల్ ! కూటమి సోషల్ వార్‌ను అరికట్టడం ఎలా?
క్షేత్రస్థాయిలో పాలనలో సమన్వయం .. సోషల్ మీడియాలో సెల్ఫ్ గోల్ ! కూటమి సోషల్ వార్‌ను అరికట్టడం ఎలా?
Advertisement

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sanathnagar MCRTIMS: సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
Andhra Pradesh Assembly Sessions: ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నేటి నుంచే! మెగా డీఎస్సీ, బీసీ రిజర్వేషన్లు, అమరావతిపై కీలక చర్చలు!
ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నేటి నుంచే! మెగా డీఎస్సీ, బీసీ రిజర్వేషన్లు, అమరావతిపై కీలక చర్చలు!
APPSC Group 1 Scam: గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
Bhogapuram Airport: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు ప్రారంభం! హైదరాబాద్‌ నుంచి తొలి విమానం రాక! ముగిసిన విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలకు భావోద్వేగ వీడ్కోలు!  
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు ప్రారంభం! హైదరాబాద్‌ నుంచి తొలి విమానం రాక! ముగిసిన విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలకు భావోద్వేగ వీడ్కోలు!  
Addanki Ganja News: అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
Gavaskar Comments : జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
Embed widget