హైదరాబాద్ పాఠశాలలో హిందూ విద్యార్థిపై మతపరమైన అంశాలు రుద్దడంపై బండి సంజయ్ తీవ్రంగా మండిపడ్డారు. 'పాతబస్తీ ఎవరి జాగీరు కాదు, ఎవడి తాత ఆస్తి కాదు' అని హెచ్చరించారు. అమాయక విద్యార్థులపై ఇలాంటి మత బోధనలు చేయడం హిందూ ధర్మంపై జరుగుతున్న కుట్ర అని, దీన్ని సహించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఇటువంటి చర్యలతో తెలంగాణ శాంతిని దెబ్బతీయొద్దని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.