అన్వేషించండి

Ethanol Blending India: ఇథనాల్‌తో జల సంక్షోభం వస్తుందా? ఒక లీటర్ కోసం ఎంత నీరు ఖర్చు అవుతుంది? 

Ethanol Blending India: భారత్‌ ఇంధన దిగుమతులను తగ్గించుకోవడానికి ఇథనాల్‌ బ్లెండింగ్‌ వేగవంతం చేసింది. అయితే ఇథనాల్ ఉత్పత్తిపై చాలా అనుమానాలు ఉన్నాయి. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • భారత్ ఇంధన అవసరాల కోసం ముడి చమురు దిగుమతి తగ్గింపు ప్రయత్నిస్తోంది.
  • ఇథనాల్ ఉత్పత్తికి వరి, చెరకు, మొక్కజొన్న వంటి పంటలపై ఆధారపడుతుంది.
  • ఒక లీటర్ ఇథనాల్ ఉత్పత్తికి వేల లీటర్ల నీరు అవసరమవుతుంది.
  • ఇథనాల్ ఉత్పత్తి నీటి కొరతను, పర్యావరణ కాలుష్యాన్ని పెంచుతుంది.

Ethanol Blending India: భారత్‌ తన ఇంధన అవసరాల కోసం విదేశీ ముడి చమురుపై ఎక్కువ ఆధారపడి ఉంది. దీనిని తగ్గించుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా మొక్కల ఆధారిత ఇథనాల్ కలపడం ద్వారా కాలుష్యాన్ని తగ్గించవచ్చని, విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేయవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. కానీ ఈ హరిత ఇంధన ప్రయాణంలో భారత్‌ ఒక భారీ మూల్యాన్ని చెల్లించబోతోందని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. 

వరి, చెరకు, మొక్కజొన్న నుంచి ఇథనాల్ తయారీ

ఇథనాల్ ఉత్పత్తికి భారత్ ప్రధానంగా వరి, చెరకు, మొక్కజొన్న వంటి పంటలపై ఆధారపడాల్సి ఉంటుంది. అయితే ఈ పంటల అత్యధికంగా నీటిని వినియోగించుకునేవి కావడమే ఇప్పుడు ప్రధాన సమస్యగా మారుతుందని అంటున్నారు. 

లీటర్ ఇథనాల్ తయారీకి 0,790 లీటర్లు నీరు ఖర్చు 

ఒక లీటర్ ఇథనాల్‌ను వరి నుంచి  ఉత్పత్తి చేయడానికి దాదాపు 10,790 లీటర్లు నీరు అవసమవుతుంది. ఇందులో పంట సాగుకు అవసరమయ్యే సాగునీరు కూడా కలిసి ఉంది. ఒక కేజీ వరి పండించడానికి మూడు వేల నుంచి ఐదు వేల లీటర్ల నీరు అవసరమైతే, ఒక లీటరు ఇథనాల్‌ తయారు చేయడానికి సుమారు 2.5 నుంచి 3కేజీల వరి అవసరం అవుతుంది. మొక్కజొన్న నుంచి ఒక లీటరు ఇథనాల్‌ ఉత్పత్తికి దాదాపు 4, 670 లీటర్ల నీరు ఖర్చు అవుతుంది. చెరకు నుంచి ఒక లీటర్ ఇథనాల్‌ పొందడానికి 3,630 లీటర్ల నీరు అవసరం అవుతుంది. 

ఇథనాల్‌ ఉత్పత్తికి ప్రయత్నాలు

ప్రభుత్వం తన ఇథనాల్ బ్లెండింగ్ లక్ష్యాలను సాధించడానికి ఆహార ధాన్యాల కేటాయింపును భారీగా పెంచుతోంది. 2024-25లో 52 లక్షల టన్నుల బియ్యాన్ని ఇథనాల్‌ ఉత్పత్తికి కేటాయించగా, 2025-26 నాటికి ఈ లక్ష్యాన్ని 90 లక్షల టన్నులకు పెంచాలని నిర్ణయించింది. పేదలకు పంపిణీ చేసే రేషన్ బియ్యంలో నూకల వాటాను 25 శాతం నుంచి పది శాతానికి తగ్గించి, మిగిలిన నిల్వలను నేరుగా డిస్టిలరీలకు తరలించడం ద్వారా ఇథనాల్‌ ఉత్పత్తిని పెంచాలని ప్రభుత్వం యోచిస్తోంది. 

ఇప్పటికే దేశంలో పలు ప్రాంతాల్లో నీటి కొరత 

ఈ ఇథనాల్‌ విప్లవం దేశంలో ఇప్పటికే ఉన్న నీటి ఎద్దడిని మరింత తీవ్రం చేసే అవకాశం ఉంది. నీతి అయోగ్‌ నివేదిక ప్రకారం 2039 నాటికి ఢిల్లీ, బెంగళూరు, చెన్నై వంటి 21 ప్రధాన నగరాల్లో భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటిపోయే ప్రమాదం ఉంది. భారత్‌ ప్రస్తుతం 1822 కోట్ల లీటర్ల ఇథనాల్‌ ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఈ ప్లాంట్లు ఎక్కువగా మహారాష్ట్ర(396కోట్ల), ఉత్తర్‌ప్రదేశ్‌, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో కేంద్రీకృతమై ఉన్నాయి. విచిత్రమేంటంటే ఈ ప్రాంతాలు ఇప్పటికే  తీవ్రమైన నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నాయి. 

కేవలం నీటి వినియోగమే కాకుండా, ఇథనాల్ మిల్లుల నుంచి వెలువడే వ్యర్థాలు కూడా పర్యావరణానికి ముప్పుగా మారుతున్నాయి. వీటిని సరిగ్గా శుద్ధి చేయకపోతే ఉపరితల జలాలు, భూగర్భ జలాలు కలుషితం అయ్యే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒక రైతు ఒక కేజీ వి పండిస్తూ 3000 లీటర్ల నీటిని వాడుతుంటే, వనరుల వృథా అంటున్న వ్యక్తులు అదే పంటను ఉపయోగించి ఇండస్ట్రీ ఒక లీటరు ఇథనాల్‌ కోసం  పదివేల లీటర్ల నీటిని వాడుతుంటే, దానిని గ్రీన్ ఎనర్జీ అని పిలుస్తున్నారని నిపుణులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. 

ఇంధన భద్రత కోసం భారత్ చేస్తున్న ప్రయత్నాలు ప్రశంసనీయమే అయినా అవి నీటి భద్రతను పణంగా పెట్టి జరగకూడదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. నీటి ఎద్దడి ఎక్కువగా ఉండే వరి, చెరకు వంటి పంటల కంటే తక్కువ నీటితో పండే ప్రత్యామ్నాయ వనరులను అన్వేషించాలని సూచిస్తున్నారు. లేని పక్షంలో వాహనాలు నడపడానికి ఇంధనం ఉండొచ్చు కానీ మనుషులు తాగడానికి నీరు ఉండదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

Frequently Asked Questions

భారతదేశం ఇథనాల్ ఉత్పత్తికి ఏ పంటలపై ఎక్కువగా ఆధారపడుతోంది?

భారతదేశం ఇథనాల్ ఉత్పత్తికి ప్రధానంగా వరి, చెరకు, మొక్కజొన్న వంటి పంటలపై ఆధారపడుతోంది. ఈ పంటలకు అధిక మొత్తంలో నీరు అవసరం అవుతుంది.

ఒక లీటర్ ఇథనాల్ ఉత్పత్తికి ఎంత నీరు అవసరం అవుతుంది?

వరి నుంచి ఒక లీటర్ ఇథనాల్ ఉత్పత్తికి సుమారు 10,790 లీటర్ల నీరు అవసరమవుతుంది. మొక్కజొన్నకు 4,670 లీటర్లు, చెరకుకు 3,630 లీటర్లు నీరు అవసరం.

ఇథనాల్ ఉత్పత్తి లక్ష్యాలను సాధించడానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటోంది?

ప్రభుత్వం తన ఇథనాల్ బ్లెండింగ్ లక్ష్యాలను సాధించడానికి ఆహార ధాన్యాల కేటాయింపును పెంచుతోంది. రేషన్ బియ్యంలో నూకల వాటాను తగ్గించి, మిగిలిన నిల్వలను డిస్టిలరీలకు తరలించాలని యోచిస్తోంది.

ఇథనాల్ ఉత్పత్తి వల్ల నీటి కొరతపై ఎలాంటి ప్రభావం ఉంటుంది?

ఇథనాల్ ఉత్పత్తికి అధిక నీటి వినియోగం దేశంలో ఇప్పటికే ఉన్న నీటి ఎద్దడిని మరింత తీవ్రతరం చేసే అవకాశం ఉంది. 2039 నాటికి 21 ప్రధాన నగరాల్లో భూగర్భ జలాలు అడుగంటిపోయే ప్రమాదం ఉంది.

టాప్ హెడ్ లైన్స్

Reliance Industries 1977 IPO: ధీరూభాయ్ అంబానీ సామాన్యులను అభివృద్ధిలో భాగస్వాములు ఎలా చేశారు
రిలయన్స్ ఇండస్ట్రీస్ 1977 IPO: ధీరూభాయ్ అంబానీ సామాన్యులను అభివృద్ధిలో భాగస్వాములు ఎలా చేశారు
CM Vijay And Chandrababu Meeting: చంద్రబాబుతో తమిళనాడు సీఎం విజయ్ భేటీ.. దక్షిణాది రాష్ట్రాల్లో ఉత్కంఠ, చర్చించిన అంశాలివే
చంద్రబాబుతో తమిళనాడు సీఎం విజయ్ భేటీ.. దక్షిణాది రాష్ట్రాల్లో ఉత్కంఠ, చర్చించిన అంశాలివే
CM Vijay: సీఎం హోదాలో తొలిసారి ఏపీకి.. విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న విజయ్‌
సీఎం హోదాలో తొలిసారి ఏపీకి.. విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న విజయ్‌
Delhi Protest: అక్టోబర్ 20 వరకు సాయుధ బలగాలను ఇక్కడే మోహరించండి... కేంద్రానికి ఢిల్లీ పోలీసుల లేఖ
అక్టోబర్ 20 వరకు సాయుధ బలగాలను ఇక్కడే మోహరించండి... కేంద్రానికి ఢిల్లీ పోలీసుల లేఖ

వీడియోలు

Dussehra in Telangana and Andhra Pradesh | బతుకమ్మ కేవలం తెలంగాణలోనే ఎందుకు చేస్తారు?
Uses of GPS Vests Worn by Cricket Players | ప్లేయర్స్ వేసుకునే జీపీఎస్ జాకెట్ తో లాభం ఏంటి?
400-Year History of Mysore Dussehra 2026 | ప్రపంచ ప్రసిద్ధ మైసూర్ దసరా ప్రత్యేకత
Virat Kohli Test Retirement & Ajit Agarkar | కోహ్లీ రిటైర్మెంట్‌పై వసీం జాఫర్ సంచలన వ్యాఖ్యలు
Tilak Varma Fist Bump Runout vs West Indies | వెస్టిండీస్‌పై తిలక్ వర్మ మైండ్ బ్లాంక్ రనౌట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: భయపడొద్దు, పెట్టుబడులు పెట్టండి- 2034 నాటికి ట్రిలియన్ డాలర్ ఎకానమీ: సీఎం రేవంత్ రెడ్డి
భయపడొద్దు, పెట్టుబడులు పెట్టండి- 2034 నాటికి ట్రిలియన్ డాలర్ ఎకానమీ: సీఎం రేవంత్ రెడ్డి
YS Jagan Cases: జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం.. రోజువారీ విచారణకు సీబీఐ కోర్టు నిర్ణయం
జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం.. రోజువారీ విచారణకు సీబీఐ కోర్టు నిర్ణయం
UP Blue Drum Case: మీరట్ బ్లూ డ్రమ్ హత్య కేసు.. భార్య, ప్రియుడికి మరణశిక్ష.. కోర్టులో 'మహాభారత' ప్రస్తావన!
మీరట్ బ్లూ డ్రమ్ హత్య కేసు.. భార్య, ప్రియుడికి మరణశిక్ష.. కోర్టులో 'మహాభారత' ప్రస్తావన
Imanvi Esmail: ప్రభాస్ 'ఫౌజీ' హీరోయిన్ ఇమాన్వీ బర్త్ డే సెలబ్రేషన్ ఫోటోలు
ప్రభాస్ 'ఫౌజీ' హీరోయిన్ ఇమాన్వీ బర్త్ డే సెలబ్రేషన్ ఫోటోలు
మిడిల్ క్లాస్‌ బడ్జెట్‌లోనే లగ్జరీ కార్‌ ఫీచర్లు.. క్రెటా కంటే తక్కువ ధరలో వస్తున్న హ్యుందాయ్ బేయాన్!
మిడిల్‌క్లాస్‌ కోసం ప్రీమియం కారు.. లాంచ్‌కు సిద్ధమైన Hyundai Bayon.. ఈ కారుతో మీరు మాట్లాడవచ్చు!
 TDP Janasena: కూటమిలో  కుంపటి..  మాకు 40శాతం సీట్లు కావాల్సిందే...! టీడీపీకి జనసేన కొత్త టెన్షన్‌  పవన్‌ వ్యూహమేంటి?
 కూటమిలో  కుంపటి..  మాకు 40శాతం సీట్లు కావాల్సిందే...! టీడీపీకి జనసేన కొత్త టెన్షన్‌  పవన్‌ వ్యూహమేంటి?
Jailer 2: 'జైలర్ 2'కు అనిరుధ్ రివ్యూ... రజనీకాంత్ సినిమాకు 3 స్టార్స్?
'జైలర్ 2'కు అనిరుధ్ రివ్యూ... రజనీకాంత్ సినిమాకు 3 స్టార్స్?
Janasena Seat Sharing: ఏపీ స్థానిక ఎన్నికలు..కూటమి ముందు జనసేన భారీ డిమాండ్.. 2,091 స్థానాలు కేటాయించాలని ప్రతిపాదన
ఏపీ స్థానిక ఎన్నికలు..కూటమి ముందు జనసేన భారీ డిమాండ్.. 2,091 స్థానాలు కేటాయించాలని ప్రతిపాదన
Embed widget