అన్వేషించండి

Defence Ministry: రక్షణశాఖ కీలక నిర్ణయం, రూ.84.5 వేల కోట్లతో నూతన ఆయుధ సమీకరణకు ఆమోదం

Rajnath Singh: భారత సైనిక దళాల పోరాట సామర్థ్యానికి పటిష్టం చేసేందుకు భారీగా ఆయుధ సమీకరణకు కేంద్రం ఆమోదం తెలిపింది. రూ.84,560 కోట్ల విలువైన సైనిక పరికరాలు, సాధన సంపత్తి కొనుగోలుకు పచ్చ జెండా ఊపింది. 

Military Equipment: భారత సైనిక దళాల పోరాట సామర్థ్యానికి పటిష్టం చేసేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. భారీగా ఆయుధ సమీకరణకు (Military Equipment) కేంద్రం (Central Government) ఆమోదం తెలిపింది. రూ.84,560 కోట్ల విలువైన సైనిక పరికరాలు, సాధన సంపత్తి కొనుగోలుకు శుక్రవారం పచ్చ జెండా ఊపింది. కేంద్ర రక్షణ మంత్రి (Defence Minister Of India) రాజ్‌నాథ్‌ సింగ్‌ (Rajnath Singh) అధ్యక్షతన శుక్రవారం ఢిల్లీలో ఆయుధ కొనుగోళ్ల మండలి (డీఏసీ) సమావేశమైంది. కొత్తతరం ట్యాంకు విధ్వంసక మందుపాతరలు, గగనతల రక్షణకు ఉద్దేశించిన కంట్రోల్‌ రాడార్‌, భారీ టోర్పిడోలు, మధ్యశ్రేణి సముద్ర నిఘా, బహుళ ప్రయోజన విమానం, విమానాలకు గగనతలంలోనే ఇంధనం నింపే సాంకేతికత, సాఫ్ట్‌వేర్‌ డిఫైన్డ్‌ రేడియోలను సైనిక దళాల కోసం కొనుగోలు చేయనున్నారు. 

దేశంలోని పెద్ద సముద్ర ప్రాంతాలను మరింత మెరుగ్గా పర్యవేక్షించేందుకు భారత నావికాదళం, కోస్ట్ గార్డ్ కోసం కొత్త విమానాలు, పరికరాలను కొనుగోలుకు ఆమోదం తెలిపినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఇండియన్ నేవీ, ఇండియన్ కోస్ట్ గార్డ్ నిఘా, సామర్థ్యాలను బలోపేతం చేయడం కోసం మధ్యస్థ  రేంజ్ మారిటైమ్ రికనైసెన్స్, మల్టీ - మిషన్ మారిటైమ్ ఎయిర్‌క్రాఫ్ట్‌ కొనుగోలుకు DAC ఆమోదించింది. ‘ఆత్మనిర్భర్‌ భారత్‌’ దిశగా.. స్వదేశీసంస్థల నుంచే పరికరాల కొనుగోలుకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు రక్షణ శాఖ వెల్లడించింది. 

సముద్ర నిఘా కోసం కేటాయించిన సీ-295 ఎయిర్ క్రాఫ్ట్‌లను ఎయిర్ బస్ తయారుచేయనుంది. వీటిని స్పెయిన్, ఇండియాలో తయారవుతాయి. అలాగే సుదూర, కనిపించని లక్ష్యాలను ఛేదించేందుకు ప్రత్యేక వ్యవస్థను కొనుగోలు చేయడానికి కేంద్రం ఆమోదించింది. చిన్న, తక్కువ ఎత్తులో ఎగిరే వాటిపై నిఘా పెట్టేలా వాయు రక్షణను మెరుగుపరిచేందుకు రాడార్ వ్యవస్థ కొనుగోలకు కూడా ఆమోదించింది. ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్‌ను బలోపేతం చేయడానికి.. ముఖ్యంగా నెమ్మదిగా, చిన్న, తక్కువ ఎత్తుఎగిరే లక్ష్యాలను గుర్తించే సామర్థ్యం, వివిధ లక్ష్యాలపై నిఘా, ట్రాకింగ్ కోసం ఎయిర్ డిఫెన్స్ టాక్టికల్ కంట్రోల్ రాడార్‌ను కొనుగోలు చేయడానికి కేంద్రం అంగీకారం తెలిపింది.  

దీనితో పాటుగా ఇండియన్ నేవీ కోసం సముద్రంలో సుదూరంగా ఉన్న జలాంతర్గాములను గుర్తించే అధునాతన సోనార్‌ సాంకేతికతను కొనుగోలు చేయనున్నారు.  శత్రువుల నుంచి వచ్చే ముప్పుల గుర్తించి వాటిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు, భారత నావికాదళ నౌకలను ఒక అడుగు ముందు ఉంచడానికి, శత్రు జలాంతర్గాములను సుదూర శ్రేణిలో గుర్తించడానికి తక్కువ పౌనఃపున్యాలు, వివిధ లోతులలో పనిచేయగల సామర్థ్యం ఉన్న యాక్టివ్ టోవ్డ్ అర్రే సోనార్‌ను కూడా కొనుగోలు చేయనుంది.

టాప్ హెడ్ లైన్స్

Rahul Gandhi INDIA Alliance: ఇండియా కూటమి సారథిగా రాహుల్ గాంధీ - అఖిలేష్, మమతల వైఖరిలో మార్పు - మోదీని ఢీకొట్టే ఏకైక నాయకుడేనా?
ఇండియా కూటమి సారథిగా రాహుల్ గాంధీ - అఖిలేష్, మమతల వైఖరిలో మార్పు - మోదీని ఢీకొట్టే ఏకైక నాయకుడేనా?
nstant Justice Encounters Vs Rule of Law : తక్షణ న్యాయం వర్సెస్ చట్టబద్ధ పాలన - ఎన్‌కౌంటర్లకు మద్దతు వెనుక సమాజం ఆలోచించాల్సిన నిజాలు ఉన్నాయా ?
తక్షణ న్యాయం వర్సెస్ చట్టబద్ధ పాలన - ఎన్‌కౌంటర్లకు మద్దతు వెనుక సమాజం ఆలోచించాల్సిన నిజాలు ఉన్నాయా ?
EPFO WhatsApp services: ఈపీఎఫ్‌ఓ గుడ్‌న్యూస్‌.. ఇకపై వాట్సప్‌లోనే సేవలు, ఆటోమేటిక్‌ సెటిల్‌మెంట్‌!
ఈపీఎఫ్‌ఓ గుడ్‌న్యూస్‌.. ఇకపై వాట్సప్‌లోనే సేవలు, ఆటోమేటిక్‌ సెటిల్‌మెంట్‌!
UP Politics BJP Challenges: యూపిలో బిజెపికి గడ్డు కాలం - ఎస్పీ జోరుకు యోగి బ్రేకులు వేయగలరా?
యూపిలో బిజెపికి గడ్డు కాలం - ఎస్పీ జోరుకు యోగి బ్రేకులు వేయగలరా?

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Virat Kohli  Storm: అభిమానుల‌కు బ‌ర్త్ డే కానుక ఇచ్చిన‌ కోహ్లీ.. ఫిఫ్టీతో విధ్వంసం.. తొలి వ‌న్డేలో కివీస్ పై భార‌త్ ఘ‌న విజ‌యం
అభిమానుల‌కు బ‌ర్త్ డే కానుక ఇచ్చిన‌ కోహ్లీ.. ఫిఫ్టీతో విధ్వంసం.. తొలి వ‌న్డేలో కివీస్ పై భార‌త్ ఘ‌న విజ‌యం
Ongole Mayor Result: కూటమి ఖాతాలోకి ఒంగోలు కార్పొరేషన్.. మేయర్‌గా టీడీపీ అభ్యర్థి నల్లమల్లి శ్రీశిల్ప విజయం
కూటమి ఖాతాలోకి ఒంగోలు కార్పొరేషన్.. మేయర్‌గా టీడీపీ అభ్యర్థి నల్లమల్లి శ్రీశిల్ప విజయం
RTC Conductor Dies: ఆర్టీసీ కండక్టర్ ప్రవళిక మృతి.. ప్రభుత్వ ఉద్యోగం, ఇందిరమ్మ ఇల్లు.. కోటి పరిహారం
ఆర్టీసీ కండక్టర్ ప్రవళిక మృతి.. ప్రభుత్వ ఉద్యోగం, ఇందిరమ్మ ఇల్లు.. కోటి పరిహారం
Diwali Reddit Story : ఇదే నా చివరి దీపావళి కావచ్చు.. కంటతడి పెట్టిస్తోన్న 21 ఏళ్ల యువకుడి పోస్ట్, మీరు ఆ తప్పు చేయకండి
ఇదే నా చివరి దీపావళి కావచ్చు.. కంటతడి పెట్టిస్తోన్న 21 ఏళ్ల యువకుడి పోస్ట్, మీరు ఆ తప్పు చేయకండి
ముంచెత్తిన వరద.. ప్రాణాలకు తెగించి ముగ్గురు మహిళలను కాపాడిన చిలకలూరిపేట సీఐ
ముంచెత్తిన వరద.. ప్రాణాలకు తెగించి ముగ్గురు మహిళలను కాపాడిన చిలకలూరిపేట సీఐ
Medical College Ragging: కామారెడ్డి మెడికల్‌ కాలేజీలో ర్యాగింగ్‌.. 14 మంది సీనియర్ విద్యార్థులపై సస్పెన్షన్‌!
కామారెడ్డి మెడికల్‌ కాలేజీలో ర్యాగింగ్‌.. 14 మంది సీనియర్ విద్యార్థులపై సస్పెన్షన్‌!
మహాభారతంపై తొలి MA డిగ్రీ: చరిత్ర సృష్టించిన సెంట్రల్ సంస్కృత్ యూనివర్శిటీ!
మహాభారతంపై తొలి MA డిగ్రీ: చరిత్ర సృష్టించిన సెంట్రల్ సంస్కృత్ యూనివర్శిటీ!
KTR Help: మాట నిలబెట్టుకున్న కేటీఆర్.. మస్కట్‌లో చిక్కుకున్న కొడంగల్ మహిళకు సాయం
మాట నిలబెట్టుకున్న కేటీఆర్. మస్కట్‌లో చిక్కుకున్న కొడంగల్ మహిళకు సాయం
Embed widget