Corona Cases: దేశంలో కొత్తగా 10 వేల లోపే పాజిటివ్ కేసులు, కరోనాతో మరో 119 మంది మృతి

Covid Cases India Updates : కరోనా థర్డ్ వేవ్ భారత్‌లో తగ్గుతోంది. గడిచిన 24 గంటల్లో దేశంలో 10 వేల లోపే కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

FOLLOW US: 

Corona Cases In India: దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి క్రమంగా తగ్గుతోంది. తాజాగా పది వేల లోపే పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.  గడిచిన 24 గంటల్లో కరోనా పాజిటివ్ కేసులు భారత్‌లో 8,013 (8 వేల 13) మందికి కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. డైలీ పాజిటివిటీ రేటు 1.11 శాతానికి దిగొచ్చింది. కొవిడ్ 19 రికవరీ రేటు ఏకంగా 98 కంటే ఎక్కువ అయింది. దేశంలో ప్రస్తుతం 1,02,601 (1 లక్షా 2 వేల 6 వందల 1) మంది కరోనాకు చికిత్స (Active Corona Cases In India) తీసుకుంటున్నారు.

తాజాగా 119 మంది మృతి 
ఆదివారం ఒక్కరోజులో 16,765 (16 వేల 765) మంది కరోనా మహమ్మారిని జయించారు. వారితో కలిపితే భారత్‌లో కరోనా బారి నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,23,07,686 (4 కోట్ల 23 లక్షల 7 వేల 686)కు చేరింది. కొవిడ్ తో పోరాడుతూ తాజాగా 119 మంది మరణించారని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ సోమవారం ఉదయం హెల్త్ బులెటిన్‌లో తెలిపింది. కిందటి రోజుతో పోల్చితే కరోనా పాజిటివ్ కేసులతో పాటు మరణాలు భారీగా తగ్గాయి. దేశంలో కరోనా మరణాల సంఖ్య 5,13,843 (5 లక్షల 13 వేల 843)కు చేరినట్లు అధికారులు వెల్లడించారు. 

మహారాష్ట్రలో 782 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారించగా.. మొత్తం కేసుల సంఖ్య 78,65,298కి చేరుకున్నాయి. ఇదే రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 4,629కు చేరగా దాపు 90 శాతం మంది డిశ్చార్జ్ అయ్యారు. కేరళలో 2,524 కేసులు నమోదయ్యాయి, దీంతో కేరళలో మొత్తం కేసుల సంఖ్య 64,97,204కి చేరుకుంది. రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 65,223కు పెరిగింది. 

177.50 కోట్ల డోసుల వ్యాక్సిన్..
గత ఏడాది జనవరి (2021)లో కరోనా వ్యాక్సిన్ ప్రారంభించినప్పటి నుంచి సోమవారం ఉదయం వరకు దేశంలో 177 కోట్ల 50 లక్షల డోసుల కొవిడ్ టీకాలు పంపిణీ చేశారు. నిన్న ఒక్కరోజు 7,23,828 శాంపిల్స్ కు కరోనా టెస్టులు నిర్వహించగా పదివేల లోపే పాజిటివ్ కేసులు వచ్చాయి. ఇప్పటివరకూ 76,74,81,346 (76 కోట్ల 74 లక్షల 81 వేల 346) శాంపిల్స్ పరీక్షించినట్లు తెలిపారు. ప్రస్తుతం యాక్టివ్ కేసులు కేవలం 0.24 శాతం ఉన్నాయి.

Also Read: Yadlapati Venkatarao: టీడీపీ నేత, మాజీ మంత్రి యడ్లపాటి వెంకట రావు కన్నుమూత, 102 ఏళ్ల వయసులో

Also Read: Ukraines Lifestyle: ఉక్రెయిన్లో ఒక నెల ఖర్చు ఎంత తక్కువో తెలుసా? మనం హ్యాపీగా బతికేయచ్చు

Published at : 28 Feb 2022 11:08 AM (IST) Tags: coronavirus covid19 India India Corona Cases covid cases in india CoronaVirus Cases In India

సంబంధిత కథనాలు

Drone Shot Down: జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రదాడికి యత్నం,  బాంబులతో వచ్చిన డ్రోన్ కథువాలో కూల్చివేత

Drone Shot Down: జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రదాడికి యత్నం, బాంబులతో వచ్చిన డ్రోన్ కథువాలో కూల్చివేత

Mann Ki Baat: అక్కడ చెత్త వేయడం ఆపండి, మన గౌరవాన్ని కాపాడండి - మన్ కీ బాత్‌లో ప్రధాని విజ్ఞప్తి

Mann Ki Baat: అక్కడ చెత్త వేయడం ఆపండి, మన గౌరవాన్ని కాపాడండి - మన్ కీ బాత్‌లో ప్రధాని విజ్ఞప్తి

Vijayashanthi: విజయశాంతి - వీకే శశికళ రహస్య భేటీ! మూడేళ్ల క్రితం సాధ్యంకానిది ఇప్పుడవుతుందా?

Vijayashanthi: విజయశాంతి - వీకే శశికళ రహస్య భేటీ! మూడేళ్ల క్రితం సాధ్యంకానిది ఇప్పుడవుతుందా?

Viral Video Impact : సోషల్ మీడియా పవర్, బిహార్ బాలికకు కృత్రిమ కాలు

Viral Video Impact : సోషల్ మీడియా పవర్, బిహార్ బాలికకు కృత్రిమ కాలు

Tamilnadu News : అప్పుల భారంతో భార్య, బిడ్డలను హత్య చేసిన వ్యాపారి, ఆ పై ఆత్మహత్య!

Tamilnadu News : అప్పుల భారంతో భార్య, బిడ్డలను హత్య చేసిన వ్యాపారి, ఆ పై ఆత్మహత్య!

టాప్ స్టోరీస్

Nepal Plane Missing: నేపాల్‌లో విమానం మిస్సింగ్, ATCతో సిగ్నల్స్ కట్ - లోపల ఉన్న 22 మందిలో భారతీయులు కూడా

Nepal Plane Missing: నేపాల్‌లో విమానం మిస్సింగ్, ATCతో సిగ్నల్స్ కట్ - లోపల ఉన్న 22 మందిలో భారతీయులు కూడా

IPL 2022, GT vs RR Final: బట్లర్‌ మరో సెంచరీకి అడ్డుగా టైటాన్స్‌ 'మాంత్రికుడు'! మిల్లర్‌కూ ఓ కిల్లర్‌ ఉన్నాడోచ్‌!

IPL 2022, GT vs RR Final: బట్లర్‌ మరో సెంచరీకి అడ్డుగా టైటాన్స్‌ 'మాంత్రికుడు'! మిల్లర్‌కూ ఓ కిల్లర్‌ ఉన్నాడోచ్‌!

బెట్, ఈ రాష్ట్ర ప్రజల్లా మనం ఉండగలమా? ఇలా మారాలంటే ఈ జీవితం సరిపోదేమో!

బెట్, ఈ రాష్ట్ర ప్రజల్లా మనం ఉండగలమా? ఇలా మారాలంటే ఈ జీవితం సరిపోదేమో!

Crocodile vs Lions: వీడియో - ఒక మొసలి, మూడు సింహాలు - వామ్మో, ఫైట్ మామూలుగా లేదు!

Crocodile vs Lions: వీడియో - ఒక మొసలి, మూడు సింహాలు - వామ్మో, ఫైట్ మామూలుగా లేదు!