Ukraines Lifestyle: ఉక్రెయిన్లో ఒక నెల ఖర్చు ఎంత తక్కువో తెలుసా? మనం హ్యాపీగా బతికేయచ్చు
రష్యా- ఉక్రెయిన్ యుద్ధ నేపథ్యంలో అందరి దృష్టి ఉక్రెయిన్ పైనే పడింది.
ఉక్రెయిన్లో మన దేశ విద్యార్థులు వేల సంఖ్యలో ఉన్నారు. ఒక్క మనదేశమే కాదు వివిధ దేశాల ప్రజలు, విద్యార్థులు అక్కడ ఉద్యోగాలు చేస్తూ చదువులు పూర్తిచేస్తున్నారు. ముఖ్యంగా వైద్య విద్య కోసమే అక్కడికి చాలా మంది వెళతారు. అమెరికా, బ్రిటన్, చైనా లాంటి దేశాలను విడిచిపెట్టి చిన్న యూరప్ దేశమైన ఉక్రెయిన్ కు ఎందుకు విద్యార్థులు వరుస కడుతున్నారు? దానికి కారణం అక్కడ జీవనవ్యయం తక్కువ. దాదాపు మన దేశంలో అయినంతే అవుతుంది. కానీ అమెరికా, బ్రిటన్లో చదవాలంటే మాత్రం లక్షలు లక్షలు కావాలి. అందుకే ఎక్కువ మంది వైద్య విద్య చదివేందుకు ఉక్రెయిన్ బాట పడుతున్నారు.తక్కువ ఖర్చుతోనే విదేశాల్లో చదివామన్న గుర్తింపు కూడా వస్తుంది. పెద్ద పెద్ద ఆసుపత్రులలో ఉద్యోగాలూ వస్తాయి. అక్కడ్నించి అమెరికా, బ్రిటన్ వంటి ఆసుపత్రుల్లో ఉద్యోగాలూ సంపాదించవచ్చు. ఇక స్వదేశానికి వస్తే కార్పొరేట్ ఆసుపత్రులు స్వాగతం పలుకుతాయి. అందుకే ఉక్రెయిన్లో విదేశీ విద్యార్థుల సంఖ్య అధికంగా ఉంటుంది.
ఉక్రెయిన్ కరెన్సీ...
ఉక్రోయిన్ కరెన్సీని ‘హరీన్వియా’ అని పిలుస్తారు. ఒక హరీన్వియా రెండు రూపాయల 51 పైసలకు సమానం. అంటే మనం ఇక్కడ వంద రూపాయలు ఖర్చుపెడితే అక్కడ దాదాపు 300రూపాయలతో సమానం. అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా వంటి దేశాల కరెన్సీతో పోల్చుకుంటే ఇది తక్కువ తేడానే.
నెలకు ఖర్చయ్యేది...
ఒక వ్యక్తి ఆహారానికి నెలకు దాదాపు రూ.10,000 దాకా ఖర్చువుతుంది. ఇండియాలో కూడా అంతకన్నా తక్కువేమీ కాదు. కాబట్టి పెద్ద తేడా లేదనే చెప్పాలి. ఇక ఇంటి రెంట్ల విషయానికి వస్తే సింగిల్ బెడ్ రూమ్ రూ.16,000 వరకు ఉంటుంది. ఎలాగూ మన విద్యార్థులు నలుగురైదుగురు కలిసి ఇల్లు అద్దెకు తీసుకుంటారు కనుక వారికి పెద్ద ఖర్చు కాదు. మరీ లగ్జరియస్ అపార్ట్ మెంట్, సిటీకి మధ్యలో కావాలంటే మాత్రం అధికంగా పెట్టాల్సి వస్తుంది. ఇక కరెంటు బిల్లు, గ్యాస్ బిల్లు కలిపి రూ.1100 వరకు ఉంటుంది. నీటికోసం 1300 రూపాయలు ఖర్చుపెట్టాలి. బస్ ఛార్జీలు కూడా అక్కడే తక్కువే. విద్యార్థికి నెలకు రూ.1000 కంటే కాకపోవచ్చు.
ఆహారం రేట్లు ఇలా...
లీటరు పాలు ఉక్రెయిన్లో రూ.42 ఉంటుంది. అలాగే డజను గుడ్లు రూ.72 కు అమ్ముతారు. మంచినీళ్లు లీటర్ బాటిల్ ధర 31రూపాయలు. బియ్యం కిలో రూ.73 వరకు ఉంటుంది. టమాటోలు, బంగాళాదుంప, ఆపిళ్లు, అరటిపండ్లు అన్నీ కిలోల లెక్కనే అమ్ముతారు. వీటి ధరలు కూడా కిలో రూ.100 దాటకుండా ఉంటాయి.
View this post on Instagram