అన్వేషించండి

CJI BR Gavai Attacker: ‘దేవుడు శాసించాడు.. నేను పాటించాను’ CJI గవాయిపై దాడికి యత్నంపై లాయర్ వింత రియాక్షన్

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయిపై షూ విసిరినందుకు జైలుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నానని.. కానీ తనకు ఎలాంటి పశ్చాత్తాపం లేదని రాకేష్ కిషోర్ తెలిపారు.

Attack on CJI | న్యూఢిల్లీ: భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) బి.ఆర్. గవాయ్ మీద సుప్రీంకోర్టులో న్యాయవాది రాకేష్ కిషోర్ షూ విసిరే ప్రయత్నం చేయడం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. విష్ణుమూర్తి విగ్రహం ఏర్పాటుకు సంబంధించి సీజేఐ ఇటీవల చేసిన వ్యాఖ్యలతో లాయర్ రాకేష్ ఆవేశానికి లోనై దాడికి యత్నించారు. అయితే జరిగిన ఘటనపై సుప్రీంకోర్టు లాయర్ రాకేష్ కిశోర్ ఆశ్చర్యకరమైన ప్రకటన చేశారు. దీనిపై తనకు ఎలాంటి పశ్చాత్తాపం లేదని అన్నారు. రాకేష్ కిషోర్ ఎందుకు అలా చేశారో కూడా చెప్పారు.

ఖజురహోలోని ఒక దేవాలయంలో విష్ణువు విరిగిన విగ్రహాన్ని పునరుద్ధరించడానికి సంబంధించిన పిటిషన్ CJI బీఆర్ గవాయ్ విచారణ చేస్తున్నారు. 'హిందుస్థాన్ టైమ్స్' నివేదిక ప్రకారం, లాయర్ రాకేష్ కిషోర్ మాట్లాడుతూ.. ''ఒక దైవిక శక్తి నన్ను అలా దాడి చేయాలని సూచించింది. నేను జైలుకు వెళ్ళి ఉంటే బాగుండేది, నా కుటుంబం నేను చేసిన పనితో సంతోషంగా లేదు. వారు నన్ను అర్థం చేసుకోలేకపోతున్నారు'' దేవుడు శాసించాడు.. నేను పాటించాను అనే తరహాలో లాయర్ రాకేష్ కిశోర్ చెప్పిన మాటలు విని అంతా ఆశ్చర్యపోతున్నారు. కానీ తన చర్యపై ఎలాంటి పశ్చాత్తాపం లేదని చెప్పారు.

 రాకేష్ కిషోర్‌ను సస్పెండ్ చేసిన బార్ కౌన్సిల్

సోమవారం నాడు భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) బిఆర్. గవాయిపై షూ విసిరే ప్రయత్నం చేసిన కేసులో నిందితుడైన న్యాయవాది రాకేష్ కిషోర్‌ను బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (BCI) తక్షణమే సస్పెండ్ చేసింది. ఈ సంఘటన అక్టోబర్ 6 ఉదయం 11:35 గంటలకు జరిగింది. 71 ఏళ్ల న్యాయవాది రాకేష్ కిషోర్ సీజేఐ గవాయిపై షూ విసిరే ప్రయత్నం చేశారు. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది వెంటనే రాకేష్ కిషోర్‌ను అదుపులోకి తీసుకున్నారు.

BCI అధ్యక్షుడు, సీనియర్ న్యాయవాది మనన్ కుమార్ మిశ్రా విడుదల చేసిన తాత్కాలిక సస్పెన్షన్ ఉత్తర్వులో, నిందితుడి ప్రవర్తన కోర్టు గౌరవానికి విరుద్ధంగా ఉందని పేర్కొన్నారు. న్యాయవాదుల ప్రవర్తనా నియమావళి, అడ్వకేట్స్ చట్టం, 1961 నిబంధనలను రాకేష్ కిషోర్ ఉల్లంఘించారని పేర్కొన్నారు.

రాకేష్ కిషోర్ ఏ కోర్టులోనూ హాజరు కాలేరు

సస్పెన్షన్ సమయంలో నిందితుడైన న్యాయవాది రాకేశ్ కిషోర్ ఏ కోర్టులోనూ, అధికారం లేదా ట్రిబ్యునల్‌లో వాదనలకు హాజరు కాలేరు. ఆయనపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని BCI తెలిపింది. అయితే తన చర్యను లాయర్ ఇప్పటికీ సమర్థించుకుంటున్నారు. ఆయన తన చర్యలపై పశ్చాత్తాపం చెందడం లేదు. పైగా దైవ శక్తి సూచించడంతోనే సీజేఐ గవాయ్ మీద తాను దాడికి యత్నించానని చెబుతున్నారు. కానీ తన చర్యతో కుటుంబసభ్యులు అసంతృప్తిగా, తన మీద కోపంగా ఉన్న కారణంగా.. తాను జైలుకు వెళ్లినా బాగుండేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ఎలాంటి కేసు నమోదు కాలేదు
సుప్రీంకోర్టు పరిపాలన విభాగం రాకేశ్ కిషోర్ పై పై అధికారికంగా ఫిర్యాదు చేయలేదు. దాంతో పోలీసులు ఎటువంటి చట్టపరమైన చర్య తీసుకోలేదు. మూడుగంటల పాటు ప్రశ్నించిన అనంతరం లాయర్‌ను విడుదల చేశారు. అతని షూస్, పేపర్లను కూడా తిరిగి ఇచ్చారు. ఆ పేపర్లో ‘హిందూస్తాన్ సనాతన ధర్మాన్ని అవమానించడాన్ని సహించదు’ అని రాసి ఉందని పోలీసులు తెలిపారు. 

ఖజురహో ఆలయంపై వ్యాఖ్యలతో న్యాయవాది ఆగ్రహం
సెప్టెంబర్ 16న జరిగిన విచారణ సందర్భంగా  గవాయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మధ్యప్రదేశ్ లోని ఖజురహో ఆలయంలో విష్ణు విగ్రహాన్ని పునర్నిర్మించి తిరిగి ప్రతిష్టించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ ను కొట్టివేశారు. ఇది లాయర్ రాకేష్ కిశోర్‌కు కోపాన్ని తెప్పించింది. మీరు విష్ణువుకు గొప్ప భక్తుడని అంటున్నారు. ఏదైనా చేయాలని దేవుడ్ని ప్రార్థించాలని సీజేఐ గవాయ్ చేసిన వ్యాఖ్యలతో లాయర్ రాకేశ్ కిషోర్ కోపంతో నిన్న దాడికి యత్నించారు. ఈ స్థలం భారత పురావస్తు సర్వే సంస్థ (ASI) సంరక్షణలో ఉందని, పునరుద్ధరణకు ముందు ఆ శాఖ అనుమతి తీసుకోవాలని సీజేఐ పేర్కొన్నారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

India Census 2027: జనాభా లెక్కల్లో తప్పుడు సమాధానాలు ఇస్తే ఏమవుతుంది, జైలు శిక్షనా ? జరిమానా విధిస్తారా
జనాభా లెక్కల్లో తప్పుడు సమాధానాలు ఇస్తే ఏమవుతుంది, జైలు శిక్షనా ? జరిమానా విధిస్తారా
జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి
జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి
Independence Day 2026 PM Modi Speech Highlights: సప్తధార పేరుతో మోదీ సరికొత్త నినాదం- జెన్‌జీకి అధిక ప్రాధాన్యం- 80వ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగం హైలైట్స్‌!
సప్తధార పేరుతో మోదీ సరికొత్త నినాదం- జెన్‌జీకి అధిక ప్రాధాన్యం- 80వ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగం హైలైట్స్‌!
Vande Mataram at Red Fort: ఎర్రకోటపై చారిత్రక ఘట్టం! 80వ స్వాతంత్య్ర వేడుకల్లో తొలిసారిగా
ఎర్రకోటపై చారిత్రక ఘట్టం! 80వ స్వాతంత్య్ర వేడుకల్లో తొలిసారిగా "వందేమాతరం" ఆలాపన!

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి
జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి
Devdutt Padikkal Historic Ton: కోహ్లీ సరసన నిలిచి, ఎలైట్ లిస్ట్‌లోకి పడిక్కల్.. మెయిడిన్ టెస్టు సెంచరీతో సత్తా చాటిన దేవదత్
కోహ్లీ సరసన నిలిచి, ఎలైట్ లిస్ట్‌లోకి పడిక్కల్.. మెయిడిన్ టెస్టు సెంచరీతో సత్తా చాటిన దేవదత్
CM Revanth Reddy: రేషన్ కార్డు అంటే కేవలం బియ్యం ఇచ్చే సాధనం కాదు.. ప్రజల ఆత్మగౌరవం: సీఎం రేవంత్ రెడ్డి
రేషన్ కార్డు అంటే కేవలం బియ్యం ఇచ్చే సాధనం కాదు.. ప్రజల ఆత్మగౌరవం: సీఎం రేవంత్ రెడ్డి
Bigg Boss Agnipariksha 2 : కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
ఏడాదికి ఒక్కసారి మాత్రమే సర్వీస్, 200 KM రేంజ్‌తో రాబోతున్న Ather Konarc
ఏడాదికి ఒక్కసారి మాత్రమే సర్వీస్, 200 KM రేంజ్‌తో రాబోతున్న Ather Konarc
Pawan Kalyan Speech: డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
Adilabad Bike Theft Gang: ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి
Embed widget