అన్వేషించండి

Budget Sessions: పార్లమెంటు భద్రత కోసం 140 మంది సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బంది, 31 నుంచి బడ్జెట్ సమావేశాలు

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 31నుంచి ప్రారంభం కానున్నాయి. బడ్జెట్ సమావేశాల వేళ ఎలాంటి భద్రతాపరమైన లోపాలు తలెత్తకుండా కేంద్రప్రభుత్వం చర్యలు చేపట్టింది.

Parliament Security : పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 31నుంచి ప్రారంభం కానున్నాయి. బడ్జెట్ సమావేశాల (Budget Sessions) వేళ ఎలాంటి భద్రతాపరమైన లోపాలు తలెత్తకుండా కేంద్రప్రభుత్వం చర్యలు చేపట్టింది. పార్లమెంటు కాంప్లెక్స్‌ (Parliament Complex) లో భద్రత కోసం 140 మంది సీఐఎస్‌ఎఫ్‌ (CISF) సిబ్బందిని నియమించింది. వీరంతా సందర్శకులు, సామగ్రికని తనిఖీలు చేయనున్నారు. ఎక్స్‌రే యంత్రాలు, డిటెక్టర్లతో సందర్శకులను, వస్తువులను తనిఖీ చేస్తారని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. శీతాకాల సమావేశాల సమయంలో పార్లమెంటులో అలజడి ఘటన తీవ్ర కలకలం రేపింది. దీంతో పార్లమెంట్ భద్రతపై అనేక సందేహాలు వచ్చాయి. 

140 మంది సీఐఎస్ఎఫ్ సిబ్బంది పార్లమెంట్ భద్రత
సెక్యూరిటీ పరమైన ఇబ్బందులు తలెత్తకుండా సెంట్రల్‌ ఇండస్ట్రీయల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ కు అప్పగించాలని కొన్ని రోజుల క్రితమే కేంద్రం నిర్ణయించింది. తాజాగా 140 మంది సీఐఎస్ఎఫ్ సిబ్బందిని కేటాయించింది. 140 మంది సెక్యూరిటీ సిబ్బందిలో 36 మంది అగ్నిమాపక శాఖ విభాగానికి చెందిన సిబ్బంది ఉన్నారు. సెంట్రల్‌ ఇండస్ట్రీయల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌లో ప్రస్తుతం లక్షా 70 మంది సిబ్బంది ఉన్నారు. కేంద్ర హోంశాఖ అధీనంలోని ఇది పని చేస్తుంది. ఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలతో పాటు 68 విమానాశ్రయాలు, అణుశక్తి, ఢిల్లీ మెట్రో, ఏరోస్సేస్ కేంద్రాల వద్ద సీఐఎస్ఎప్ బలగాలు భద్రత నిర్వహిస్తున్నాయి.  సీఐఎస్‌ఎఫ్‌కు చెందిన గవర్నమెంట్‌ బిల్డింగ్‌ సెక్యూరిటీయూనిట్‌ నిపుణులు, ఫైర్‌ యూనిట్‌ సభ్యులు ప్రస్తుత పార్లమెంట్‌ భద్రతా బృందాలతో కలిసి కొన్నిరోజుల క్రితం సర్వే చేపట్టారు. కేంద్ర హోం శాఖకు నివేదిక ఇచ్చిన తర్వాత...140 మంది సీఐఎస్ఎఫ్ బలగాలను మోహరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మరోవైపు దేశ వ్యాప్తంగా బడ్జెట్ పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. 

సెంబరు 13న లోక్‌సభలో పొగ వెదజల్లిన ఇద్దరు వ్యక్తులు
గతేడాది డిసెంబరు 13న లోక్‌సభలో జీరో అవర్‌ జరుగుతున్న సమయంలో...ఇద్దరు వ్యక్తులు సభలోకి దూకి గందరగోళం సృష్టించారు.  పొగను లోక్ సభ అంతటా వెదజల్లారు. మరో ఇద్దరు భవనం వెలుపల ఆందోళన చేశారు. ఆ తర్వాత పార్లమెంటు భవన సముదాయంలో భద్రతపై కేంద్ర హోంశాఖ పూర్తిస్థాయి సమీక్ష చేసింది. ఎయిర్ పోర్టుల్లో సెక్యూరిటీ తరహాలోనే...పార్లమెంట్ వదద్ సీఐఎస్‌ఎఫ్‌ భద్రతను పర్యవేక్షించనుంది. పార్లమెంట్‌లో భద్రతా వైఫల్యం ఘటనలో పోలీసులు ఇప్పటి వరకు ఆరుగురిని అరెస్టు చేశారు. నిందితులు మనోరంజన్‌, సాగర్ శర్మ..డిసెంబర్ 13న లోక్‌సభలోకి దూసుకువచ్చి కలకలం సృష్టించారు. అమోల్‌ శిందే, నీలమ్ ఆజాద్‌.. పార్లమెంట్ వెలుపల ఆందోళన చేశారు. మరో నిందితుడు లలిత్‌ ఝా.. ఈ ఘటన మొత్తానికి సూత్రధారి అని, అతడికి మహేశ్‌ కుమావత్‌ సహకరించాడని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. వారందర్ని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.

రిటైర్డ్ డీఎస్పీ కుమారుడ్ని విచారించిన ఢిల్లీ పోలీసులు

బెంగళూరుకు చెందిన రిటైర్డ్‌ డీఎస్పీ కుమారుడు సాయికృష్ణను పోలీసులు విచారించారు. లోక్‌సభలో అలజడి సృష్టించిన మనోరంజన్‌కు స్నేహితుడు. వారిద్దరూ బెంగళూరులోని ఓ ఇంజినీరింగ్‌ కళాశాలలో కలిసి చదువుకున్నారు. విచారణలో భాగంగా మనోరంజన్‌ చెప్పిన వివరాల ఆధారంగా...సాయికృష్ణను అరెస్ట్ చేశారు. 

 

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu: సదరన్ జోనల్ కౌన్సిల్ మీటింగ్.. రాష్ట్ర విభజన హామీలు ప్రస్తావించనున్న సీఎం చంద్రబాబు
సదరన్ జోనల్ కౌన్సిల్ మీటింగ్.. రాష్ట్ర విభజన హామీలు ప్రస్తావించనున్న సీఎం చంద్రబాబు
Breaking News: మ‌త్స్య‌కారుల‌ను కాపాడేందుకు నిరంతరాయంగా గాలింపు చ‌ర్య‌లు.. మంత్రి అచ్చెన్నాయుడు
మ‌త్స్య‌కారుల‌ను కాపాడేందుకు నిరంతరాయంగా గాలింపు చ‌ర్య‌లు.. మంత్రి అచ్చెన్నాయుడు
BJP Grassroots Leadership: వారసత్వాలకు చెక్.. ప్యాషన్‌కే ప్రాధాన్యం - బీజేపీ గ్రాస్‌రూట్ లీడర్‌షిప్ మోడల్ - లీడర్లు ప్రజల నుంచే !
వారసత్వాలకు చెక్.. ప్యాషన్‌కే ప్రాధాన్యం - బీజేపీ గ్రాస్‌రూట్ లీడర్‌షిప్ మోడల్ - లీడర్లు ప్రజల నుంచే !
Kolkata Hotel Fire Accident: కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Principal Roopa Reddy Murder Case: ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
Nidhhi Agerwal Betting App Case: ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
Vizag Airport Workers: న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
Konda Politics: పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
Folk Singer Eshwar Sai Controversy:వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
Rajinikanth Vs Ram Pothineni: రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
Embed widget