X
Match 7 - 20 Oct 2021, Wed up next
NAM
vs
NED
15:30 IST - Sheikh Zayed Stadium, Abu Dhabi
Match 8 - 20 Oct 2021, Wed up next
SL
vs
IRE
19:30 IST - Sheikh Zayed Stadium, Abu Dhabi
Match 9 - 21 Oct 2021, Thu up next
BAN
vs
PNG
15:30 IST - Al Amerat Cricket Ground Oman Cricket (Ministry Turf 1), Oman
Match 10 - 21 Oct 2021, Thu up next
OMA
vs
SCO
19:30 IST - Al Amerat Cricket Ground Oman Cricket (Ministry Turf 1), Oman
Match 11 - 22 Oct 2021, Fri up next
NAM
vs
IRE
15:30 IST - Sharjah Cricket Stadium, Sharjah

INS Dhruv: ఇండియా తొలి క్షిపణి ట్రాకింగ్ నౌక ధృవ్ ప్రయోగం ఈరోజే.. దీని ప్రత్యేకతలు మామూలుగా లేవు..

భారతదేశపు మొట్టమొదటి క్షిపణి ట్రాకింగ్ నౌక ధృవ్.. ఈ రోజు నుంచి సముద్రంలో తన కార్యకలాపాలు ప్రారంభించనుంది. దీంతో భారతదేశ సముద్ర యుద్ధ శక్తి మరింత పెరగనుంది.

FOLLOW US: 

భారతదేశపు మొట్టమొదటి క్షిపణి ట్రాకింగ్ నౌక ఐఎన్ఎస్ ‘ధృవ్’ ఈ రోజు నుంచి (సెప్టెంబర్ 10) సముద్రంలో తన కార్యకలాపాలు ఆరంభించనుంది. ఐఎన్ఎస్ ధృవ్ రాకతో ఇలాంటి ప్రత్యేకమైన నౌకలను కలిగి ఉన్న అమెరికా, చైనా, ఫ్రాన్స్, యూకే దేశాల సరసన భారత్ కూడా చేరనుంది. ఈ నౌకతో భారతదేశ సముద్ర యుద్ధ శక్తి మరింత అధికం కానుంది. ఈ నౌక అణు, బాలిస్టిక్ క్షిపణులను ట్రాక్ చేయగలుగుతుంది. ఈ నౌకలో లాంగ్ రేంజ్ రాడార్లు, డోమ్ ఆకారంలో ఉన్న యాంటెన్నా, అధునాతన ఎలక్ట్రానిక్స్ ఉంటాయి. ఇందులో DRDO అభివృద్ధి చేసిన AESA (యాక్టివ్ ఎలక్ట్రానిక్స్ స్కాన్డ్ ఎరే రాడార్స్) రాడార్లు ఉన్నాయి. ఈ టెక్నాలజీ.. శత్రు జలాంతర్గాములు, ఉపగ్రహాల మీద నిఘా వేసి ఉంచుతుంది.


ఐఎన్ఎస్ ధృవ్ ప్రత్యేకతలు.. 
డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO), నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (NTRO) సహకారంతో హిందుస్థాన్ షిప్‌యార్డ్ దీనిని నిర్మించింది. వైజాగ్ లోని హిందుస్థాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్‌లో దీని తయారీ పనులు జరుగుతున్నాయి. దీని నిర్మాణం 2018లోనే పూర్తవ్వగా.. 2019 నుంచి సముద్ర పరీక్షలు ఆరంభం అయ్యాయి. ఈ న్యూక్లియర్ క్షిపణి ట్రాకింగ్ నౌకను జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ విశాఖపట్నం నుంచి ప్రారంభించే అవకాశం ఉంది. 


1000 టన్నుల బరువున్న ఈ నౌకలో లాంగ్ రేంజ్ రాడార్లు, డోమ్ ఆకారంలో ఉన్న యాంటెన్నా, అధునాతన ఎలక్ట్రానిక్స్ ఉంటాయి. ఇందులో DRDO అభివృద్ధి చేసిన AESA (యాక్టివ్ ఎలక్ట్రానిక్స్ స్కాన్డ్ ఎరే రాడార్స్) రాడార్లు ఉన్నాయి. AESAని రాడార్ టెక్నాలజీలో అత్యంత అధునాతన సాంకేతికగా పరిగణిస్తారు. ఈ టెక్నాలజీ.. భారతదేశాన్ని చూసే స్పై శాటిలైట్లను (నిఘా ఉపగ్రహాలు) స్కాన్ చేయగలదు. అలాగే శత్రు జలాంతర్గాములు, ఉపగ్రహాల మీద నిఘా వేసి ఉంచుతుంది. క్షిపణి సామర్థ్యంతో పాటు పరిధిని కూడా గుర్తిస్తాయి.   • ఇది 175 మీటర్ల పొడవు, 22 మీటర్ల బీమ్, ఆరు మీటర్ల డ్రాఫ్ట్, 21 నాట్ల వేగాన్ని కలిగి ఉంది. రెండు ఇంపోర్టెడ్  9,000 కిలోవాట్ల డీజిల్, డీజిల్ (CODAD) కాన్ఫిగరేషన్ ఇంజిన్లు, మూడు 1200 కిలోవాట్ల సహాయక జనరేటర్ల ద్వారా ఇది శక్తిని పొందుతుంది. 

  • ప్రముఖ మీడియా సంస్థలు పేర్కొన్న నివేదికల ప్రకారం.. పాకిస్తాన్, చైనా దేశాల నుంచి ప్రయోగించిన బాలిస్టిక్ క్షిపణుల దాడుల గురించి ఐఎన్ఎస్ ధృవ్ ముందుగానే హెచ్చరించగలదు. ఉపగ్రహం, బాలిస్టిక్ క్షిపణి ట్రాకింగ్ నౌకలను కోడ్ డిసిగ్నేషన్ వీసీ-11184 ద్వారా పిలుస్తారు. 

  • చైనా, పాకిస్తాన్ రెండు దేశాలు బాలిస్టిక్ సామర్థ్యాలను కలిగి ఉన్నాయి. ఈ రెండు దేశాలకు ఇండియాతో వివాదాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఐఎన్ఎస్ ధ్రువ్ భారత నావికా దళానికి తన సైనిక శక్తిని పెంచడంతో తోడ్పడుతుంది. 


విశాఖకు చేరుకున్న ఐఎన్ఎస్ విగ్రహ.. 
అడ్వాన్స్‌డ్‌ ఫైర్‌ పవర్‌తో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఐసీజీఎస్‌ విగ్రహ.. ఈరోజు (సెప్టెంబర్ 10) విశాఖపట్నం చేరుకుంది. 98 మీటర్ల పొడవున్న ఈ నౌకను ఆగస్టు 28న కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజనాథ్‌సింగ్‌ జాతికి అంకితం చేశారు. ఆఫ్‌షోర్‌ పెట్రోల్‌ వెసల్‌ సిరీస్‌లో ఇది 7వ నౌక. చెన్నైలోని ఎల్‌ & టీ షిప్‌ బిల్డింగ్‌ లిమిటెడ్‌ సంస్థ దీనిని నిర్మించింది. ఈ నౌక విశాఖపట్నం నుంచి కార్యకలాపాలు నిర్వర్తించనుంది. 


ALso Read: US Open Final: యూఎస్ ఓపెన్ ఫైనల్లో యువ క్రీడాకారిణులు... ఫైనల్లో ఎమ్మా రాడుకా vs లెయ్‌లా ఫెర్నాండెజ్‌


Also Read: Dengue D2 Strain: ఉత్తర్ ప్రదేశ్ లో డెంగీ విజృంభణ... డెంగీ మరణాలకు డీ2 స్ట్రైయిన్ కారణం... ప్రాణాంతక రక్తస్రావం కలిగిస్తుందంటున్న ఐసీఎంఆర్ వైద్యులు

Tags: India DRDO Visakhapatnam INS Dhruv INS Vigraha nuclear missile tracking ship Missiles NTRO nuclear missile Ajit Doval

సంబంధిత కథనాలు

Yadadri: యాదాద్రి పునఃప్రారంభం ముహూర్తం ఖరారు... కిలో 16 తులాల బంగారం ఇస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటన

Yadadri: యాదాద్రి పునఃప్రారంభం ముహూర్తం ఖరారు... కిలో 16 తులాల బంగారం ఇస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటన

Mumbai: ముంబయి సెషన్స్ కోర్టు సంచలన తీర్పు.. సెక్స్ చేయకుండా మహిళకు రెండేళ్ల నిర్బంధం!

Mumbai: ముంబయి సెషన్స్ కోర్టు సంచలన తీర్పు.. సెక్స్ చేయకుండా మహిళకు రెండేళ్ల నిర్బంధం!

Breaking Updates Live: ఏపీలో స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం : చంద్రబాబు

Breaking Updates Live: ఏపీలో స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం : చంద్రబాబు

DGP : ప్రజలు ఆవేశాలకు గురికావద్దు.. సంయమనం పాటించండి : డీజీపీ ఆఫీస్

DGP :  ప్రజలు ఆవేశాలకు  గురికావద్దు.. సంయమనం పాటించండి : డీజీపీ ఆఫీస్

Uttarakhand Flood: దేవభూమిలో జలప్రళయం.. వరదల ధాటికి 34 మంది మృతి

Uttarakhand Flood: దేవభూమిలో జలప్రళయం.. వరదల ధాటికి 34 మంది మృతి
SHOPPING
Diwali Gift
Kitchen
Make Up
Top Mobiles
Immunity Booster

టాప్ స్టోరీస్

Chandrababu : ఏపీలో పోలీసు వ్యవస్థ విఫలం.. కేంద్ర బలగాల రక్షణ కావాలి..! అమిత్ షా, గవర్నర్‌లకు చంద్రబాబు విజ్ఞప్తి !

Chandrababu : ఏపీలో పోలీసు వ్యవస్థ విఫలం.. కేంద్ర బలగాల రక్షణ కావాలి..!  అమిత్ షా, గవర్నర్‌లకు చంద్రబాబు విజ్ఞప్తి !

Top 10 Richest Cities 2021: దేశంలోనే ధనిక నగరాల జాబితాలో హైదరాబాద్‌.. ఫస్ట్ ర్యాంక్ ఆ నగరానికే!

Top 10 Richest Cities 2021: దేశంలోనే ధనిక నగరాల జాబితాలో హైదరాబాద్‌.. ఫస్ట్ ర్యాంక్ ఆ నగరానికే!

TDP Vs YSRCP: టీడీపీ ఆఫీసులపై దాడులతో వైఎస్ఆర్సీపీకి సంబంధం లేదు... ఇది చంద్రబాబు ఆడిస్తున్న డ్రామా.. వైఎస్ఆర్సీపీ నేతల ఆరోపణ

TDP Vs YSRCP: టీడీపీ ఆఫీసులపై దాడులతో వైఎస్ఆర్సీపీకి సంబంధం లేదు... ఇది చంద్రబాబు ఆడిస్తున్న డ్రామా.. వైఎస్ఆర్సీపీ నేతల ఆరోపణ

Dhoni-Chris Gayle Meet: మిస్టర్‌ కూల్‌ ధోనీతో సుడిగేల్ ముచ్చట్లు..! సరదాగా కాసేపు అంటున్న కరీబియన్లు

Dhoni-Chris Gayle Meet: మిస్టర్‌ కూల్‌ ధోనీతో సుడిగేల్ ముచ్చట్లు..! సరదాగా కాసేపు అంటున్న కరీబియన్లు