US Open Final: యూఎస్ ఓపెన్ ఫైనల్లో యువ క్రీడాకారిణులు... ఫైనల్లో ఎమ్మా రాడుకా vs లెయ్‌లా ఫెర్నాండెజ్
యూఎస్ ఓపెన్‌లో బ్రిటిష్ టెన్నిస్ ప్లేయర్, టీనేజర్ ఎమ్మా రెడుకాను సంచలనం సృష్టించింది.
యూఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్‌లో ఇంగ్లాండ్‌కు చెందిన ఎమ్మా రాడుకాను సంచలనం సృష్టించింది. గ్రాండ్ స్లామ్ ఫైనల్ చేరిన పిన్న వయస్కురాలిగా ఎమ్మా రికార్డు నెలకొల్పింది. సెమీఫైనల్లో 17వ సీడ్ గ్రీస్ క్రీడాకారిణి మారియా సక్కారీపై 6-1, 6-4 తేడాతో ఎమ్మా విజయం సాధించింది.
The point that changed @EmmaRaducanu's life. pic.twitter.com/k65yVd7xMo
— US Open Tennis (@usopen) September 10, 2021
దీంతో 17 ఏళ్ల తర్వాత గ్రాండ్‌స్లామ్ ఫైనల్ చేరిన పిన్న వయస్కురాలిగా ఆమె రికార్డు నెలకొల్పింది. ఇంతకుముందు రష్యాకు చెందిన మరియా షరపోవా 2004లో 17 ఏళ్ల వయసులోనే వింబుల్డన్ టైటిల్ గెలవడం గమనార్హం.
Emma Raducanu sets up a collision course with fellow teenager Leylah Fernandez.
— US Open Tennis (@usopen) September 10, 2021
A wrap on Day 11's #USOpen action ⤵️
మారియాను ఓడించిన వీడియోను యూఎస్ ఓపెన్ టెన్నిస్ ట్విటర్‌లో పంచుకుంది. అందులో ఈ బ్రిటన్ చిన్నది సాధించిన విజయాన్ని తనను తానే నమ్మలేకపోయింది. ఆఖరి పాయింట్ సాధించాక ఎమ్మా కాసేపు నిశ్శబ్దంగా ఉండిపోయింది. మ్యాచ్ అనంతరం ఆమె మాట్లాడుతూ... తాను ఫైనల్‌కు చేరానంటే నమ్మలేకపోతున్నానని చెప్పింది. తనపై ఒత్తిడి లేదని, తుది పోరులో మంచి ప్రదర్శన చేస్తానని తెలిపింది.
From qualifying to the final, it's been a blur for @EmmaRaducanu pic.twitter.com/XUkk8ciRZs
— US Open Tennis (@usopen) September 10, 2021
ప్రస్తుతం 150వ ర్యాంక్‌లో కొనసాగుతున్న ఎమ్మా.. ఫైనల్స్‌లో కెనడా క్రీడాకారిణి లెయ్‌లా ఫెర్నాండెజ్(19)తో తలపడనుంది. రెండు దశాబ్దాల తర్వాత ఇద్దరు యువ క్రీడాకారిణులు మహిళల గ్రాండ్‌స్లామ్ ఫైనల్స్‌లో పోటీపడనుండటం విశేషం. 1999లో అమెరికాకు చెందిన 17 ఏళ్ల సెరీనా విలియమ్స్... 18 ఏళ్ల మార్టినా హింగిస్‌ను ఓడించింది.
(Teenage) dream final. pic.twitter.com/iKZkHuLAne
— US Open Tennis (@usopen) September 10, 2021